psycopk Posted March 24, 2024 Author Report Posted March 24, 2024 https://www.instagram.com/reel/C457DoApUye/?igsh=Mmh3eDR0eW95aDds Quote
psycopk Posted March 27, 2024 Author Report Posted March 27, 2024 AP CMO: సీఎం క్యాంప్ ఆఫీసుకు కంటైనర్.. ఎందుకొచ్చింది.. ఏం తెచ్చిందంటూ లోకేశ్ ప్రశ్న 27-03-2024 Wed 11:48 | Andhra కంటైనర్ ను ఎందుకు తనిఖీ చేయలేదని నిలదీసిన లోకేశ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు జవాబు చెప్పాలని డిమాండ్ తన కాన్వాయ్ ను రోజూ తనిఖీ చేస్తున్నారని గుర్తుచేసిన యువనేత ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే రోజూ తన కాన్వాయ్ ను తనిఖీ చేసే పోలీసులకు సీఎం క్యాంప్ ఆఫీసులోకి కంటైనర్ వెళ్లడం కనిపించలేదా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆ కంటైనర్ మిగతా వాహనాలలాగా కాకుండా రాంగ్ రూట్ లో వెళ్లడం, సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కంటైనర్ సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎందుకొచ్చింది.. ఏం తెచ్చిందంటూ నిలదీశారు. ఇందులో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన పోలీసులకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కంటైనర్ ను తనిఖీ చేయకపోవడానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. అందులో ఏముంది..? బ్రెజిల్ సరుకా లేక లిక్కర్ లో మెక్కిన వేల కోట్ల డబ్బా? లేక లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా.. ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలన్నారు. ఏపీ సెక్రటేరియట్ లో ఇన్నాళ్లూ దాచిన దొంగ ఫైళ్లు తరలించారా.. ఏం చేశారో, కంటైనర్ లో ఏం తరలించారో ఏపీ డీజీపీ చెబుతారా? అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు. Quote
psycopk Posted March 27, 2024 Author Report Posted March 27, 2024 Container: ఆ కంటైనర్ సీఎం జగన్ బస్సు యాత్రలో ఆహారం తయారుచేసే వాహనం: వైసీపీ 27-03-2024 Wed 15:08 | Andhra సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కంటైనర్ కలకలం పలు సందేహాలు వ్యక్తం చేసిన విపక్ష నేతలు ప్రభుత్వ శాఖలకు ఫర్నిచర్ తెచ్చిందని వైవీ సుబ్బారెడ్డి వివరణ వైవీ వ్యాఖ్యలకు విరుద్ధంగా స్పందించిన వైసీపీ... అది పాంట్రీ వాహనం అని వెల్లడి సీఎం జగన్ క్యాంపు ఆఫీసులో ప్రవేశించిన కంటైనర్ వాహనం ప్రభుత్వ శాఖలకు ఫర్నిచర్ తీసుకువచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పగా, వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో మరో రకంగా వివరణ ఇచ్చింది. సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా దారిలో ఆహారం తయారు చేసే పాంట్రీ వాహనం అని వెల్లడించింది. ఆ పాంట్రీ వాహనం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తే, ఆ వాహనంపై రామోజీ పచ్చమీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అంతేకాదు, వైసీపీ ఓ వీడియో కూడా పంచుకుంది. ఆ కంటైనర్ వాహనంలో ఏముందో కూడా వీడియోలో చూపించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.