Jump to content

Recommended Posts

Posted

Janasena: మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కల్యాణ్... జనసేన జాబితా విడుదల 

24-03-2024 Sun 21:42 | Andhra
  • ఏపీలో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన
  • ఇప్పటివరకు 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు
  • పెండింగ్ లో అవనిగడ్డ, విశాఖ సౌత్, పాలకొల్లు నియోజకవర్గాలు
 
Pawan Kalyan confirmed another 11 candidates for assembly elections

ఏపీలో పొత్తు కారణంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటివరకు 7 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఇవాళ మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. తద్వారా జనసేన పార్టీ ఇప్పటివరకు 18 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా, విశాఖపట్నం సౌత్, పాలకొండ, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తొలుత 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని, నిన్న మరో ఇద్దరిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అటు, కాకినాడ లోక్ సభ స్థానానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించారు.
20240324fr6600505e53253.jpg20240324fr6600506a3ae97.jpg

Posted

 

Pithapuram: పవన్ కల్యాణ్ ను కలిసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మ 

24-03-2024 Sun 15:54 | Andhra
  • మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చిన వర్మ
  • పవన్ కల్యాణ్ తో మర్యాదపూర్వక భేటీ
  • భేటీలో పాల్గొన్న టీడీపీ నేత సుజయ కృష్ణ రంగారావు 
 
Pithapuram TDP incharge SVSN Varma met Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 

కాగా, ఇవాళ పవన్ ను పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్, వర్మ భేటీ జరిగింది. ఈ మర్యాదపూర్వక సమావేశంలో టీడీపీ నేత సుజయ కృష్ణ రంగారావు కూడా పాల్గొన్నారు. 

వాస్తవానికి, పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్వీఎస్ఎన్ వర్మ భావించారు. కానీ, పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. ఇక్కడ్నించి బరిలో దిగుతున్నట్టు పవన్ ప్రకటించగా, వర్మ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. 

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చచెప్పడంతో వర్మ శాంతించారు. ఈ నేపథ్యంలో, పవన్ తో నేడు వర్మ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
20240324fr65ffff5a470b5.jpg20240324fr65ffff638c9fa.jpg

 

Posted

Pawan Kalyan: సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోంది: పవన్ కల్యాణ్ 

24-03-2024 Sun 14:44 | Andhra
  • ఉమ్మడి కడప జిల్లాలో భార్యాబిడ్డలతో సహా చేనేత కార్మికుడి బలవన్మరణం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • వైసీపీ నేతల భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన 
 
Pawan Kalyan reacts on handloom worker family suicide incident

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మాధవరం గ్రామంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు, భార్య, కుమార్తెతో సహా తనువు చాలించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. 

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో భూ రికార్డులు మార్చిన క్రమంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నాయకుల భూ దందాలకు పేదల బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

చేనేత మగ్గం నడవక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వైసీపీ నేతల పేరు మీదకు ఎలా మారిపోయింది? ఆ కుటుంబ సామూహిక మరణాలకు కారకులు ఎవరో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

వైసీపీ పాలకులు ప్రజల ఆస్తులు హస్తగతం చేసుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని జనసేనాని మండిపడ్డారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం దస్తావేజులు కూడా ఇవ్వకుండా కేవలం ఫోటోస్టాట్ కాపీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా వైసీపీ భూ దందా కుట్రలో భాగమే అనిపిస్తోందని వెల్లడించారు. 

అధికార పదవుల్లోని ముఖ్య నేతలు భారీ దోచేస్తుంటే, స్థానికంగా ఉన్న నాయకులు పేదల భూములు గుంజేస్తున్నారని పవన్ విమర్శించారు. వీటిని చట్టపరంగా చేసేందుకే చట్ట సవరణలు, కొత్త చట్టాలు తీసుకువచ్చారని ఆరోపించారు. 

రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతో పాటు భూ దందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...