psycopk Posted March 28, 2024 Report Posted March 28, 2024 K Keshav Rao: ఈ నెల 30న కాంగ్రెస్‌లో చేరుతున్నాం: కేకే, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి 28-03-2024 Thu 20:02 | Telangana ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపిన మేయర్ విజయలక్ష్మి అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని వ్యాఖ్య తాను గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్నట్లు వెల్లడి తాము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు, ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన తాము అధికార పార్టీలో చేరుతున్నామని వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నామని కే కేశవరావు కూడా వెల్లడించారు. తాను గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని గుర్తు చేశారు. 84 ఏళ్ల వయస్సులో తాను తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నానన్నారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా: కేకే తనయుడు తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగనున్నట్లు కేకే కుమారుడు విప్లవ్ కుమార్ వెల్లడించారు. తన తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. కేసీఆర్‌పై నమ్మకం ఉందన్నారు. 1 Quote
psycopk Posted March 28, 2024 Author Report Posted March 28, 2024 congress lo cwc member ga undi.. aa party ni munchi... trs lo cheradu... power aaipoindi.... malli congress... Quote
psycopk Posted March 28, 2024 Author Report Posted March 28, 2024 KCR: ఫామ్ హౌస్‌కు వచ్చిన కేశవరావుపై కేసీఆర్ తీవ్ర అసహనం? 28-03-2024 Thu 18:46 | Telangana పార్టీలో మీకు, కూతురుకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పార్టీని ఎందుకు వీడుతున్నారంటూ కేసీఆర్ నిలదీత అధికారం పోగానే పార్టీని వీడుతున్నారని ఆవేదన కేకేతో పాటు పార్టీ వీడుతున్న పలువురు నేతలపై కేసీఆర్ తీవ్ర అసహనం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావుపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కేకే పార్టీ మారనున్నట్లుగా కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లారు. తన కుటుంబం పార్టీ మారనున్నట్లు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని, ఈ సమయంలో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. మీడియా కథనాల మేరకు... పార్టీలో కేకేకు, ఆయన కూతురుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పార్టీని ఎందుకు వీడుతున్నారంటూ కేసీఆర్ నిలదీశారు. పదేళ్ల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు అధికారం పోగానే పార్టీని వీడుతున్నారని వాపోయారు. కేకేతో పాటు పార్టీ వీడుతున్న పలువురు ప్రజాప్రతినిధులు, నేతలపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడానికి గల కారణం కేకే చెబుతుండగా... సాకులు చెప్పవద్దని కేసీఆర్ సూచించినట్టు సనాచారం. దీంతో కేశవరావు మధ్యలోనే బయటకు వచ్చేసినట్టు చెబుతున్నారు. Quote
jalsa01 Posted March 28, 2024 Report Posted March 28, 2024 Holi ! Ila ite tillu, aggipette tappa evaru migile la leru. Quote
r2d2 Posted March 28, 2024 Report Posted March 28, 2024 1 minute ago, jalsa01 said: Holi ! Ila ite tillu, aggipette tappa evaru migile la leru. Quote
lollilolli2020 Posted April 1, 2024 Report Posted April 1, 2024 1 hour ago, psycopk said: congress lo cwc member ga undi.. aa party ni munchi... trs lo cheradu... power aaipoindi.... malli congress... etela ni ellagottad ala entha mandi leru BRS nunchi ellagottina leaders; its biting him back this way Quote
Skn_benami Posted April 1, 2024 Report Posted April 1, 2024 Floating members toni party nimpi, first nunchi unnollani kick cheste ilane untundi. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.