Jump to content

Grand Doughter of tippu sultan statue in London.......


Recommended Posts

Posted

[img]http://www.sakshi.com/newsimages/contentimages/01112010/khan-lady31-10-10-35484.jpg[/img]

లండన్: మైసూరు మహా సంస్థానాన్ని పరిపాలించిన మహారాజు టిప్పు సుల్తాన్ మనుమరాలు నూర్ ఇనాయత్ ఖాన్. రెండవ ప్రపంచ యుద్ధంలో నెగ్గితే భారత్‌కు స్వాతంత్య్రం ఇస్తామని బ్రిటీషు ప్రభుత్వం ఆశచూపడంతో ఆమె- ముందు, వెనుక చూడక యుద్ధరంగంలో అడుగుపెట్టింది. వ్యూహాత్మకంగా శత్రు దేశాల సైనిక శిబిరాల్లోకి చొచ్చుకుపోయి వారి అనుపానులు బ్రిటీషు పటాలాలకు చేరవేసింది. దేశం కోసం దేహాన్ని పణంగా పెట్టిన వనితగా చరిత్రకెక్కింది. ఆ తర్వాతెప్పుడో బ్రిటీషు ప్రభుత్వం ఖాన్‌కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసింది. అలాగే ఫ్రాన్స్ కూడా ఆ వీరవనితకు వందనమాచరించి పురస్కారం అందజేసింది. అది వేరే సంగతి!.

ఒళ్ళు గగుర్పొడిచే ఆమె గూఢచార జీవితాన్ని స్రబానీ బసు అక్షరీకరించారు. ఇప్పుడాయన ఆమె అర్థాకృతి (తల నుంచి భుజాల కిందివరకూ కనిపించే రాతిబొమ్మ) విగ్రహాన్ని లండన్ ప్రధాన వీధిలో ప్రతిష్టింప జేయాలని సంకల్పించారు. ఇందుకోసం నిధుల సేకరణకు తోడ్పడాలని ట్రినిటీ కాలేజీలో నిర్వహించిన నూర్ స్మారక కార్యక్రమంలో పిలుపునిచ్చారు. దేశభక్తికి నిజమైన నిదర్శనంలా నిలిచిన నూర్ విగ్రహ ప్రతిష్టాపనకు పలువురు ప్రవాస భారతీయ ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు. అదేజరిగితే బ్రిటన్‌లో విగ్రహం ప్రతిష్టితమైన తొలి ఆసియా మహిళగా, తొలి ముస్లీం వనితగా ఇనాయత్‌ఖాన్ పేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తుందని సబ్రానీ బసు సంతోషతరంగితులయ్యారు

×
×
  • Create New...