Jump to content

Recommended Posts

Posted

KTR: బీఆర్ఎస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేటీఆర్ ట్వీట్ 

29-03-2024 Fri 11:32 | Telangana
  • అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించిన ధీశాలి కేసీఆర్ అన్న కేటీఆర్
  • కేసీఆర్ ను దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు ప్రజలు జవాబు చెపుతారని వ్యాఖ్య
  • పార్టీలో నికార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని వెల్లడి
 
KTR latest tweet on things happening in BRS

ఉద్యమ పార్టీగా, తెలంగాణను సాధించిన పార్టీగా ఖ్యాతి గడించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు. పార్టీ కీలక నేత కె.కేశవరావు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. ఒక్కడుగా బయల్దేరి, లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్ దని కితాబునిచ్చారు. అలాంటి ధీరుడు కేసీఆర్ ను కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెపుతారని అన్నారు. 

ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి... తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు. పార్టీలో నికార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని, పోరాటపంథాలో కదం తొక్కుదామని ఆయన పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.

  • Upvote 1
Posted

KTR: ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు... పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు: కేటీఆర్ 

29-03-2024 Fri 14:29 | Telangana
  • అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నియోజకవర్గంలో చాలాచోట్ల తాను ప్రచారం చేస్తానన్న కేటీఆర్
  • తాండూరు సీటును గెలుస్తామనుకున్నామన్న కేటీఆర్
  • ఏం జరిగిందో తెలియదు... కొన్నిచోట్ల ఓడిపోయామన్న బీఆర్ఎస్ నేత
 
KTR fires at Patnam Mahendar Reddy

ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడని... పార్టీలోనే ఉంటూ పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గంలో మాట్లాడుతూ... తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నియోజకవర్గంలో చాలాచోట్ల ప్రచారం చేశానన్నారు.

తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు... కొన్నిచోట్ల ఓడిపోయామన్నారు. పట్నం మహేందర్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రంజిత్ రెడ్డే మొదట ఫోన్ చేశారని... చేవెళ్ల లోక్ సభ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే తప్పకుండా గెలుస్తామని చెప్పాడని తెలిపారు.

  • Haha 1
Posted

 

Kadiam Srihari: కాంగ్రెస్ నేతలు మా ఇంటికి వచ్చి ఆహ్వానించారు... ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తా: కడియం శ్రీహరి 

29-03-2024 Fri 14:03 | Telangana
  • తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కోరినట్లు వెల్లడి
  • శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్న కడియం శ్రీహరి
  • వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందని వ్యాఖ్య
 
Congress leaders meet Kadiyam Srihari

కాంగ్రెస్ నేతలు ఇంటికి వచ్చి తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు తనను కలిశారని చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వారు కోరినట్లు చెప్పారు. తన శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందన్నారు.

కడియం ఇంటికి కాంగ్రెస్ నేతలు

కడియం శ్రీహరి ఇంటికి శుక్రవారం మధ్యాహ్నం పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు. 

 

  • Sad 1
Posted

 

Minister Komatireddy: కేసీఆర్ చేసిన పాపాలే ఆయ‌న‌కు చుట్టుకున్నాయి.. ఆయ‌న‌ చేసిన మొద‌టి త‌ప్పు అదే: మంత్రి కోమ‌టిరెడ్డి 

29-03-2024 Fri 12:58 | Telangana
  • కేసీఆర్ చేసిన మొద‌టి త‌ప్పు యాద‌గిరిగుట్ట పేరును మార్చ‌డ‌మేన‌న్న కాంగ్రెస్ నేత‌ 
  • దేవుడి పేరుతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని మండిపాటు
  • యాద‌గిరి గుట్ట‌లో స్కామ్ జ‌రిగిందంటూ మంత్రి ఆరోప‌ణ‌ 
  • యాదాద్రి పేరును మ‌ళ్లీ యాద‌గిరి గుట్ట‌గా మారుస్తామ‌న్న మంత్రి కోమ‌టిరెడ్డి
 
Minister Komatireddy Venkat Reddy Criticizes BRS Chief KCR

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి శుక్ర‌వారం మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయ‌న‌కు చుట్టుకున్నాయ‌న్నారు. ఇంకా మంత్రి కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. యాద‌గిరిగుట్ట పేరును మార్చ‌డ‌మే కేసీఆర్ చేసిన మొద‌టి త‌ప్పు అని అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్‌ చేసిన పాపాల వ‌ల్ల క‌రువు వ‌చ్చింద‌న్నారు. అలాగే యాద‌గిరి గుట్ట‌లో భారీ స్కామ్ జ‌రిగింద‌ని మంత్రి ఆరోపించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత విచార‌ణ చేస్తామ‌ని తెలిపారు. అంతేగాక‌ యాదాద్రి పేరును మ‌ళ్లీ యాద‌గిరి గుట్ట‌గా మారుస్తామ‌ని చెప్పారు. గేట్లు తెర‌వ‌క‌ముందే కాంగ్రెస్‌లోకి తోసుకుని వ‌స్తున్నార‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చెప్పుకొచ్చారు. 

 

Posted

Kadiyam Srihari: మరో కీలక పరిణామం.. కడియం శ్రీహరికి ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి 

29-03-2024 Fri 12:04 | Telangana
  • బీఆర్ఎస్ ను ఒక్కొక్కరుగా వీడుతున్న కీలక నేతలు
  • నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కడియం శ్రీహరి కూతురు కావ్య
  • ఈరోజు రేవంత్ తో కడియం శ్రీహరి భేటీ అయ్యే అవకాశం
 
Revanth Reddy calls Kadiam Srihari

తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపటి క్రితం కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై శ్రీహరితో రేవంత్ చర్చించారు. వీరిద్దరూ ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. 

కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. కావ్య కాంగ్రెస్ పార్టీ తరపున వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కడియం శ్రీహరి హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో ఉన్నారు. 

మరోవైపు కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో సీనియర్ నేత కె.కేశవరావు భేటీ అయ్యారు. కేకే, ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

Posted

K Keshav Rao: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేకే.. కాంగ్రెస్ లో చేరికపై చర్చ 

29-03-2024 Fri 11:04 | Telangana
  • బీఆర్ఎస్ ను వీడిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు
  • కాంగ్రెస్ లో చేరికపై రేవంత్ తో చర్చించిన కేకే
  • కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్టు ప్రచారం
 
K Keshav Rao meets Revanth Reddy

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ లో అత్యున్నత పదవులు అనుభవించిన కేకే... ఆ పార్టీని వీడుతారని ఎవరూ ఊహించలేదు. కాసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై వీరిద్దరూ చర్చించారు. చర్చల అనంతరం రేవంత్ నివాసం నుంచి కేకే వెళ్లిపోయారు. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. పదేళ్ల తర్వాత కేకే తన సొంత గూడు కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు.

నిన్న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేకే భేటీ అయిన సంగతి తెలిసిందే. కేకే పార్టీ మారుతుండటంపై కేసీఆర్ సీరియస్ అయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. పదేళ్లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు పార్టీ మారితే ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించారా? అని కేసీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. దేనికీ సమాధానాలు ఇవ్వని కేకే... చివరకు తన కెరీర్ కాంగ్రెస్ లోనే ప్రారంభమయిందని, కాంగ్రెస్ లోనే చచ్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి.

Posted

K Keshav Rao: బీఆర్ఎస్‌కు సీనియర్ నేత కె.కేశవ రావు గుడ్‌బై 

29-03-2024 Fri 08:38 | Telangana
  • తన పూర్వ పార్టీ కాంగ్రెస్‌‌లోకి చేరబోతున్నానని ప్రకటన
  • తన కూతురు, హైదరాబాద్ మేయర్‌తో కలిసి హస్తంపార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడి
  • కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియా ముఖంగా ప్రకటన విడుదల చేసిన కేకే
 
Party General secretary K Keshav Rao says good bye to BRS

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన కూతురు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 

కేసీఆర్‌ తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఆయనపై తనకూ గౌరవం ఉందని కేకే ఈ సందర్భంగా అన్నారు. రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. 84 ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటున్నానని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారని, తాను కూడా తన సొంత ఇల్లు లాంటి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనుకుంటున్నానని కేశవరావు తెలిపారు. తాను సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నానని, ఆ పార్టీ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని కేకే అన్నారు. తాను పుట్టింది.. పెరిగింది.. కాంగ్రెస్‌లోనేనని అన్నారు. 

తెలంగాణ ఉద్యమ నాటి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో చేరానని కేకే అన్నారు. తాను ఆశించినట్టుగానే తెలంగాణ సిద్ధించిందని, కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణ కోరికను నెరవేర్చిందని అన్నారు. 53 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశానని, బీఆర్ఎస్‌లో పదేళ్లే పని చేశానని అన్నారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతాననే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని అన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తనకు బాగా సహకరించారని, ప్రస్తుతం తాను రాజకీయ విరమణ దశలో ఉన్నానని, బీఆర్ఎస్‌లో యువతకు మరిన్ని అవకాశాలు రావాలని అన్నారు.

కాగా గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేకే భేటీ అయ్యారు. ఇరువురి భేటీపై కేకేపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా మీడియా కథనాలు వెలువడ్డాయి. కేసీఆర్‌తో భేటీ అనంతరం కేకే తన నివాసానికి వెళ్లారు. పార్టీ మారబోతున్నట్టు మీడియా సమావేశంలో వెల్లడించారు.  బీఆర్ఎస్‌కు సంబంధించిన విషయాలపై కేసీఆర్‌తో మాట్లాడానని అన్నారు. కవిత అరెస్టుపై కూడా చర్చించుకున్నామని, ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చ జరిగిందని ప్రస్తావించారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగాలని తన కుమారుడు విప్లవ్‌ తీసుకున్న నిర్ణయం మంచిదేనని ఈ సందర్భంగా కేకే అన్నారు.

Posted

Tdp and congress mla lani lakunapudu emaindi ra half brain

Dasoju Sravan: కే కేశవరావు, కడియం శ్రీహరిలపై దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం 

29-03-2024 Fri 17:50 | Telangana
  • అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లడం ఏమిటి? అని ప్రశ్న
  • ఏమాత్రం ఇంగితం ఉన్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్
  • ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే అనర్హత పడుతుందని హెచ్చరిక
 
Dasoju Sravan fires at KK and Kadiyam

కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, చేరాలని నిర్ణయించుకున్న కే కేశవరావు, కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఏమాత్రం ఇంగితం ఉన్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడుతున్న వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బుగ్గ కార్లలో తిరిగి పదేళ్లు అధికారంతో వచ్చిన హోదాను, డబ్బును, అధికారాన్ని వాడుకొని పార్టీ మారుతారా? అని ప్రశ్నించారు.

దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా ఎలా పోటీ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే అనర్హత వేటు పడుతుందన్నారు. ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం ఎలా కుదురుతుందో చెప్పాలన్నారు. అలాంటి వారు మునిగిపోక తప్పదన్నారు.

కేసీఆర్ తనకు దేవుడిలాంటి వాడని దానం నాగేందర్ అన్నారని... అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు. ఎవరైనా దేవుడి వద్ద ఉంటారా? తిట్టిన వారి వద్దకు వెళతారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌లోకి వచ్చారని... బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళుతున్నారన్నారు. కొందరు ఆత్మగౌరవం అంటున్నారని... పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు అది గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.

Posted

Pocharam Srinivas: చెత్త అంతా పోయింది: నేతలు పార్టీ మారడంపై పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్య 

29-03-2024 Fri 17:05 | Telangana
  • పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారని విమర్శ
  • మోసకారుల జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్‌దే అన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారని వ్యాఖ్య
  • లోక్ సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయన్న మాజీ స్పీకర్
 
Pocharam Srinivas Reddy fires at leaders who leaving party

పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరడంపై మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొంతమంది వెళ్లడంతో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి చెత్త అంతా పోయిందని వ్యాఖ్యానించారు. గట్టి వాళ్లు మాత్రమే పార్టీలో మిగిలారన్నారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోసకారుల జాబితా రాస్తే తొలిపేరు బీబీ పాటిల్‌దే అన్నారు. తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయన్నారు. ఎవరు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు.

శుక్రవారం సిద్దిపేట జిల్లా ఆందోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయని... బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 100 పథకాల గురించి చెబుతామని... కానీ బీజేపీ అమలు చేసిన ఒక్క పథకం గురించి చెప్పగలరా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని ఆరోపించారు.

Posted

Elections aaiyaka jump

Sabitha Indra Reddy: సోషల్ మీడియా ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రచారం... నాకు మంత్రి పదవి రిజర్వ్ చేశారట!: సబితా ఇంద్రారెడ్డి 

29-03-2024 Fri 17:30 | Telangana
  • చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే ఉంటామన్న సబితా ఇంద్రారెడ్డి
  • తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా తన మనసు పులకించిపోతోందన్న ఎమ్మెల్యే
  • చేవెళ్ల నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపు
 
Sabitha Indra Reddy on party change

సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టంవచ్చినట్లుగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని... జిల్లాలో తన కోసం ఓ మంత్రి పదవిని రిజర్వ్ చేసి పెట్టినట్లు పుకార్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... చివరి శ్వాస వరకు తాము కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా తన మనసు పులకించిపోతుందన్నారు. చేవెళ్ల నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

లోక్ సభ ఎన్నిక‌ల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. పరుగెత్తుకొచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేసుల‌కు భ‌య‌ప‌డేది లేదని... మొన్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిన్న బ్రేక్ వచ్చిందని... ఇంతమాత్రాన వెన‌క్కి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు ఎవరో తెలియకపోయినా మనం గెలిపించామని... ఈసారి మనతో మమేకమయ్యే కాసానిని గెలిపించుకుందామన్నారు. పార్లమెంట్‌లో బడుగుల గొంతు వినిపించాలంటే కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు.

Posted

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్యేల్యే మదన్ రెడ్డి 

29-03-2024 Fri 16:21 | Telangana
  • మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి నివాసంలో కలిసిన బీఆర్ఎస్ నేత
  • రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి జీవన్ రెడ్డి
  • సీఎంతో ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఖానాపూర్ ఎమ్మెల్యే సమావేశం
 
Former BRS Narsapur MLA Madan Reddy met CM Revanth Reddy at his residence

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ నేతలు కలిశారు. శుక్రవారం సీఎం నివాసంలో బీఆర్ఎస్ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి కలిశారు. వీరు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇటీవల పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్య నేతలు... ముఖ్యమంత్రితో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రిని కలిసిన లోక్ సభ అభ్యర్థులు

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులు ఆయన నివాసంలో కలిశారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని కలిశారు. ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మర్యాదపూర్వకంగా కలిశారు.

Posted
12 minutes ago, nag said:

Malli  kadiyam, keshav rao endukura  mestri.. leni chetthani  tecchipettukuntavu

Financial ga strong ga unnaru.. trs ni close cheyataniki use avutaru future lo..congress kadu ante post polls they might pick bjp too

  • Upvote 1
Posted

eyana and errabelli eppudu goda meeda cats.... thu ella jeevitham...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...