psycopk Posted April 1, 2024 Report Posted April 1, 2024 Pawan Kalyan: నన్ను, భద్రతా సిబ్బందిని బ్లేడ్లతో కోశారు: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు 01-04-2024 Mon 21:05 | Andhra సంచలన విషయాలు వెల్లడించిన పవన్ తనను కలిసేందుకు వచ్చేవారిలో కిరాయి మూకలు కూడా ఉంటున్నాయని వెల్లడి సన్నటి బ్లేడ్లతో దాడి చేస్తున్నారని వివరణ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన విషయాలు వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తాను అందరినీ కలవాలని భావిస్తానని, అయితే ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కోసారి ప్రోటోకాల్ పాటించకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. ఇటీవల తనను కలిసేందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు, వారిలో కిరాయి మూకలు కూదా చొరబడుతున్నాయని, సన్నటి బ్లేడ్లు ఉపయోగించి భద్రతా సిబ్బందిని కోసేస్తున్నారని, తనను కూడా కోశారని పవన్ వెల్లడించారు. మొన్న పిఠాపురంలో కూడా ఇది జరిగిందని తెలిపారు. అందువల్ల అందరినీ కలవలేకపోతున్నామని చెప్పారు. మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు మీకు తెలుసు కాబట్టి, అందుకు తగినట్టుగా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.