Jump to content

Trs vallu 100days kuda aga leka potunaru…


Recommended Posts

Posted

Madhavaram Krishna Rao: ఎంపీగా మల్కాజ్‌గిరికి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 

03-04-2024 Wed 17:41 | Telangana
  • మల్కాజ్‌గిరి అభివృద్ధికి ముఖ్యమంత్రి చేసిందేమీ లేదన్న మాధవరం 
  • ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒరగబెట్టిందేమి లేదన్న ఎమ్మెల్యే
  • మహిళలకు గృహలక్ష్మి, రూ.2500 హామీలను తుంగలో తొక్కారని విమర్శ
 
kukatpally mla Krishna Rao takes on Revanth Reddy over malkajgiri development

గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ఎంపీగా ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మల్కాజ్‌గిరి అభివృద్ధికి ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. మహిళలకు గృహలక్ష్మి, రూ.2500 హామీలను తుంగలో తొక్కారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలు పనిచేసే వారిని గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Posted

 

KTR: పరిపాలన తన చేతుల్లో లేదన్నప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ ఎందుకు?: కేటీఆర్ ఎద్దేవా 

03-04-2024 Wed 16:29 | Telangana
  • తాత్కాలికంగా రెండు నెలల పాటు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం సమన్వయం చేస్తుందని వెల్లడి
  • పరిపాలన అనుభవం లేక అది కూడా రేవంత్ రెడ్డికి తెలియదని ఎద్దేవా
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీ సహకరించింది... ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్‌కు సహకరిస్తోందని వ్యాఖ్య
 
KTR questions Revanth Reddy over his statemnt

'సిగ్గుచేటు ఏమిటంటే, పరిపాలన నా చేతుల్లో లేదు... ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. మరి ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు? పరిపాలన అల్టిమేట్‌గా సీఎం చేతుల్లోనే ఉంటుంది. తాత్కాలికంగా రెండు నెలల పాటు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం సమన్వయం చేస్తుంది. అది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. పరిపాలన అనుభవం లేదు కదా' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిపాలన తన చేతుల్లో లేదనడం చాలా చిల్లరగా ఉందన్నారు.

వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ... గతంలో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతావని అడిగితే సీఎం పదవి గుంపు మేస్త్రీ పదవి అని చెప్పారని గుర్తు చేశారు. ఇక ప్రధానమంత్రేమో తాపీ మేస్త్రీ... ఇద్దరూ కలిసి తెలంగాణకు సమాధి కట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీకి సమాధి కట్టాలని ఇద్దరు కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు.

ఆనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు బీజేపీవాళ్లు స‌హ‌క‌రించారని... ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ నాయ‌కులు స‌హ‌క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్నారు. చేవెళ్ల‌లో కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేద‌ని తెలుసుకుని... నిన్న మొన్న‌టిదాకా ఇంఛార్జిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉండి సీటు ఓడిపోతే ప‌రువు పోతుందని గ్ర‌హించి జారుకున్నాడని ఎద్దేవా చేశారు. చేవెళ్ల‌లో కాసాని జ్ఞానేశ్వ‌ర్ త‌ప్ప‌కుండా గెలుస్తున్నాడన్నారు. మన పార్టీని ఖతం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి కండువా కప్పించుకుంటున్నారని విమర్శించారు. 

 

Posted

 

KTR: మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరికి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు 

03-04-2024 Wed 16:16 | Telangana
  • ఫోన్ ట్యాపింగ్ అంశంలో తప్పుడు ఆరోపణలు చేశారని లీగల్ నోటీసులు
  • వారంలోగా క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్
  • క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
 
KTR sends legal notice to Konda Surekha along with 2 other leaders

ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ నోటీసులు పంపిన వారిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. తన పరువుకు భంగం కలిగేలా తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై వారంలోగా క్షమాపణ చెప్పాలని... లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని నోటీసులో ఆయన పేర్కొన్నారు. ఈ ఉదయం ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. తనపై దుష్ప్రచారం చేస్తే మంత్రి అయినా, సీఎం అయినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తనకు ఏ హీరోయిన్ తో సంబంధం లేదని... వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన కర్మ తనకు లేదని అన్నారు. 
20240403fr660d31e12a7f0.jpg

 

Posted

KTR: రాముడిని మొక్కుదాం... బీజేపీని తొక్కుదాం: కేటీఆర్ 

03-04-2024 Wed 16:07 | Telangana
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలపై కేటీఆర్ ఆగ్రహం
  • రంజిత్ రెడ్డి ఇంటికి వ‌స్తే చాయ్ తాగించి ఓదార్చండి.. కానీ బ‌రాబ‌ర్ ఓడగొడుతామ‌ని చెప్పండని సూచన
  • బీజేపీకి అభ్యర్థులు లేక మన నాయకులను తీసుకొని పోటీ చేయిస్తున్నారన్న కేటీఆర్
  • ఓటు వేసే ముందు బీజేపీకి ఎందుకు వేయాలో ఆలోచించండని సూచన
 
KTR says will pray Lord Rama but dont vote bjp

రాముడిని మొక్కుదాం... బీజేపీని పండబెట్టి తొక్కుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. దేవుడిని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొండా విశ్వేశ్వర్ రెడ్డి విశ్వాసం లేని నాయకుడని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఒక రన్నింగ్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పట్నం మహేందర్ రెడ్డికి, రంజిత్ రెడ్డిలకు నటనలో అవార్డు ఇవ్వాలని చురక అంటించారు. మహేందర్ రెడ్డిని మంత్రిగా చేస్తే కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తమకు మోదీ, రేవంత్ రెడ్డి దొరికారని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సంబరపడిపోతున్నారన్నారు. కానీ వారికి దిక్కులేని నాడు బీఆర్ఎస్ కార్యకర్తలే వారిని గెలిపించిన విషయం మరిచిపోయారన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు గెలిపించిన వారిని వదిలేసి ఇతర పార్టీలకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఎందుకు మారా‌వు? అని సోష‌ల్ మీడియాలో రంజిత్ రెడ్డిని పిల్ల‌లు ప్రశ్నిస్తున్నారన్నారు. రాజ‌కీయాల్లో ఓడినంత మాత్రాన పార్టీ నుంచి వెళ్లిపోతామా? మ‌న పార్టీ అధికారంలోకి వ‌స్తే ఇవాళ కాంగ్రెస్‌లోకి వెళ్లేవాడా? అవ‌కాశం, స్వార్థ్యం కోసం కాంగ్రెస్‌లో చేరాడన్నారు. ఇలాంటి అవకాశవాదిని ఓడించాలన్నారు. రంజిత్ రెడ్డి ఇంటికి వ‌స్తే చాయ్ తాగించి ఓదార్చండి.. కానీ బ‌రాబ‌ర్ ఓడగొడుతామ‌ని చెప్పండని కార్యకర్తలకు సూచించారు. రాజ‌కీయ జీవితం ఇచ్చిన కేసీఆర్‌పై ఆయ‌న‌కు ప్రేమ లేన‌ప్పుడు.. మ‌నం ఎందుకు ప్రేమ చూపించాలని నిలదీశారు. రంజిత్ రెడ్డి సెంటిమెంట్ల‌కు పడిపోవద్దని... దొంగ‌ల పార్టీలో క‌లిసిపోయావని ముఖం మీదే చెప్పాలని సూచించారు.

ఒక్క మెడికల్ కాలేజీ, సైనిక్ స్కూల్ ఇవ్వని బీజేపీకి మనం ఓటు ఎందుకు వేయాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ‌లో బీజేపీకి అభ్య‌ర్థులు కరవయ్యారన్నారు. చేవెళ్ల‌, మ‌ల్కాజ్‌గిరి, నల్గొండ, వ‌రంగ‌ల్‌లో మన పార్టీకి చెందిన వారినే బీజేపీ నాయ‌కులు అభ్య‌ర్థులుగా ప్రకటించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లో కిష‌న్ రెడ్డి ఒక్క‌రే ఒరిజిన‌ల్ బీజేపీ... కాబ‌ట్టి మ‌న నేత‌ల‌తోనే మ‌న‌కు పోటీ నెలకొందన్నారు. బీజేపీకి అభ్య‌ర్థులు లేరు.. కేడ‌ర్ దిక్కు లేదన్నారు. దేశంలో మోదీ హ‌వా అంత బాగుంటే.. ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కుల‌ను ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. చిన్న కార్య‌క‌ర్త‌ను పెట్టినా గెల‌వాలి క‌దా? అని ప్రశ్నించారు.

మాట్లాడితే రాముడికి దండం పెడుదాం.. మోదీకి ఓటు వేద్దాం అని అంటున్నారు. హిందువులం కాబ‌ట్టి త‌ప్ప‌కుండా రాముడికి దండం పెడుతాం.. కానీ ఓటు వేసే ముందు చేవెళ్ల‌కు బీజేపీ ఏం చేసిందో ఆలోచించాలన్నారు. రైల్వే లైన్ ప్ర‌క‌టించారా? ఒక‌ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. ఐటీఐఆర్‌ను ర‌ద్దు చేసి పిల్ల‌ల నోట్లో మ‌ట్టి కొట్టినందుకు మోదీకి ఓటు వేయాల్నా? అన్నారు. పదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. అన్ని ధరలు పెంచినందుకు మోదీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మోదీ ప్రియ‌మైన ప్ర‌ధాని కాదు.. పిర‌మైన ప్ర‌ధాని అని ఎద్దేవా చేశారు.

Posted

Harish Rao: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ గెలవాలి: హరీశ్ రావు 

03-04-2024 Wed 14:54 | Telangana
  • హామీలపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్
  • మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శలు
  • కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు రూ.10,000 బాకీ పడిందన్న హరీశ్ రావు
 
Harish Rao vows BRS winning for fulfill congress promises

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చిందని... కానీ దానిని అమలు చేయడంలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని... అంటే ఒక్కో మహిళకు రూ.10,000 అధికార పార్టీ బాకీ పడిందన్నారు. క్వింటాల్ వడ్లు రూ.2500కి కొనుగోలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంటుందన్నారు. హామీలు అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి... లేదంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. బీజేపీ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలు దగాపడ్డాయని విమర్శించారు. జాతీయ పార్టీలు గెలిస్తే ఢిల్లీకి గులాంగిరి చేయాలన్నారు.

Posted

Harish Rao: రైతుల‌కు రుణ‌మాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి హ‌రీశ్‌రావు బ‌హిరంగ లేఖ 

03-04-2024 Wed 11:54 | Telangana
  • రైతుల‌కు వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయాల‌ని బీఆర్ఎస్ నేత డిమాండ్‌
  • రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించిన‌ట్లు డిసెంబ‌ర్ 9న రుణ‌మాఫీ కాలేదన్న హరీశ్‌రావు
  • పంట మ‌ద్దతు ధ‌ర‌పై రూ. 500 బోన‌స్.. ఎక‌రానికి రూ. 15 వేల చొప్పున పెట్టుబ‌డి సాయం చేయాల‌న్న మాజీ మంత్రి
 
BRS Leader Harish Rao wrote a letter to CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు రైతుల రుణ‌మాఫీ విష‌య‌మై బ‌హిరంగ లేఖ రాశారు. రైతుల‌కు వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయాల‌ని, డిసెంబ‌ర్ 9వ తేదీనే చేస్తామ‌ని మేనిఫెస్టోలో పేర్కొన్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. రుణ‌మాఫీ అయ్యాక మ‌ళ్లీ రూ. 2 లక్ష‌లు రుణం తీసుకోవాల‌న్నార‌ని, రేవంత్ మాట‌లు న‌మ్మి చాలా మంది అప్పులు తీసుకున్నార‌ని పేర్కొన్నారు. 

"రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించిన‌ట్లు డిసెంబ‌ర్ 9న రుణ‌మాఫీ కాలేదు. అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు గ‌డుస్తున్నా ఏ ఒక్క రైతుకు రుణ‌మాఫీ అంద‌లేదు. దీన్ని ఏ విధంగా అమ‌లు చేస్తారో చెప్పాలి. సాగునీరు, 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 4 నెల‌ల కాలంలో 209 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రుణ‌మాఫీ విష‌యంలో బ్యాంక‌ర్ల వేధింపులు త‌ట్టుకోలేక బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన దుస్థితి. పంట మ‌ద్దతు ధ‌ర‌పై రూ. 500 బోన‌స్ ఇవ్వాలి. అలాగే ఎక‌రానికి రూ. 15 వేల చొప్పున పెట్టుబ‌డి సాయం చేయాలి" అని హ‌రీశ్‌రావు త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Posted

KTR: నాకు ఏ హీరోయిన్ తోనూ సంబంధం లేదు: కేటీఆర్ 

03-04-2024 Wed 11:34 | Telangana
  • తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం
  • హీరోయిన్లను కేటీఆర్ బెదిరించారంటూ ఆరోపణలు
  • తప్పుడు మాటలు మాట్లాడితే తాట తీస్తామన్న కేటీఆర్
 
I dont have any contact with any heroine says KTR

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత వైవాహిక జీవితం విచ్ఛిన్నమయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

ఈ అంశంపై ఈరోజు తెలంగాణ భవన్ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఫోన్లు ట్యాప్ చేసి తాను హీరోయిన్లను బెదిరించానని ఇటీవల ఓ మంత్రి అన్నారని... ఇలాంటి అసత్య ఆరోపణలు చేసేవారిని తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా, సీఎం అయినా తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

ఏ హీరోయిన్ తోనూ తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మ తనకేముందని అన్నారు. తప్పుడు ఆరోపణలకు తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.

Posted

 

KTR Fires On Modi: క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ రేట్లు తగ్గించట్లేదేం?: మోదీని నిలదీసిన కేటీఆర్ 

03-04-2024 Wed 11:34 | Telangana
  • ప్రతీ భారతీయుడూ దీనిపై ఆలోచించాలని కోరిన మాజీ మంత్రి
  • 2014 నుంచి ఇప్పటి వరకు క్రూడాయిల్ ధర 20 డాలర్లు తగ్గిందని వివరణ
  • కొండెక్కిన పెట్రోల్ రేటు మాత్రం కొంచెం కూడా తగ్గలేదని మండిపాటు
  • గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేటీఆర్
 
Every Indian needs to think about this Asks KTR

ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పడిపోతే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారని, ఆ పాపమంతా కేంద్రానిదేనని ట్వీట్ చేశారని గుర్తుచేశారు. అప్పట్లో మోదీ చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు. మరి ఇప్పుడు.. గత పదేళ్లుగా ప్రధాని సీట్లో కూర్చుని మోదీ చేసిందేంటని నిలదీశారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉండె.. ఇప్పుడు ఎలా ఉన్నాయంటూ రేట్ల పట్టికను ట్వీట్‌ చేశారు. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండేవని, మోదీ పదేళ్ల పాలనలో నేడు చమురు ధరలు దిగొచ్చినా సరే కొండెక్కిన పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం అలానే ఉన్నాయని ఆరోపించారు.

గడిచిన దశాబ్దంలో పెట్రోల్ ధర రూ.35, డీజిల్ ధర రూ.40 వరకు పెరిగిందని చెబుతూ దీనికి బాధ్యులెవరని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. నిత్యావసర ధరలు పెరగడానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటూ నిలదీశారు. 2014 ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.72.26, డీజిల్ ధర రూ.55.49, క్రూడ్ ఆయిల్ ధర 105.56 డాలర్లు ఉండేవని, ప్రస్తుతం 2024 ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.107.41, డీజిల్ ధర రూ.95.65, క్రూడ్ ఆయిల్ ధర 86.44 డాలర్లు ఉందని కేటీఆర్ చెప్పారు. ఇక, గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పట్లో మోదీ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ.. రూపాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందని, రూపాయి విలువ పడిపోవడానికి కేంద్ర ప్రభుత్వ అవినీతే కారణమని మోదీ చెప్పారన్నారు.

20240403fr660cf0c274c38.jpg

 

Posted

100 rojulu agalekapovudu kadu randa gadu 100 rojullo ani chestam ani 6 guarantees ichindu kada so venta padtunnaru niku em wrong kanipistundi

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...