Jump to content

Recommended Posts

Posted

 

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఆ సీసీ కెమెరాల ఏర్పాటు రాధాకిషన్‌రావు అండ్ కో పనేనట! 

04-04-2024 Thu 12:20 | Telangana
  • బీఆర్ఎస్‌ నేతలు గువ్వల బాలరాజు, రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్‌రావు
  • వారి సంభాషణను బట్టి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకి
  • వారు సమావేశమైన గదిలో సీసీ కెమెరాలు అమర్చిన రాధాకిషన్‌రావు బృందం
  • నోటీసులు ఇచ్చేందకు ప్రత్యేక విమానంలో సిట్ వెళ్లడంపైనా దర్యాప్తు
 
Phone Tapping Case Sensational Twist Burst Out

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో అదిరిపడే విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధం ఉన్న విషయం తాజాగా బయటపడింది. బీఆర్ఎస్ నేతలు గువ్వల బాలరాజు, రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఫోన్లను ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ట్యాప్ చేయడంతోనే ఈ వ్యవహారం వెలుగుచూసినట్టు సమాచారం. ఎమ్మెల్యేల సంభాషణలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్‌రావు, ఆయన బృందం చర్చలు జరిగిన గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం కూడా బయటకు వచ్చింది. అప్పటి సిట్ బృందం నోటీసులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతకు చెందిన ప్రత్యేక విమానంలో వచ్చిన విషయం కూడా బయటకు వచ్చి సంచలనమైంది. అదే విమానంలో బీఎల్ సంతోష్, తుషార్‌కు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారని, ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందన్న దానిపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. 

 

Posted

Radhakishan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్ రావుపై మరో కేసు 

04-04-2024 Thu 06:44 | Telangana
  • తనపై బెదిరింపులకు దిగారంటూ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీపై కూకట్‌పల్లి వ్యాపారి ఫిర్యాదు
  • తన కూతురి పేరిట సేల్ డీడ్‌‌ను బలవంతంగా రద్దు చేయించారంటూ ఆరోపణ
  • బాధితుడి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు
 
Another case registered against former OSD Radhakishan Rao

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తన కూతురు పేరిట కొనుగోలు చేసిన ఫ్లాట్ సేల్ డీడ్‌ను బలవంతంగా రద్దు చేయించారంటూ సుదర్శన్‌ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం, కూకట్‌పల్లిలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్‌కుమార్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన స్నేహితులు, ఎస్ఆర్‌‌నగర్‌కు చెందిన ఎంవీ రాజు, సనత్‌నగర్‌కు చెందిన ఏవీకే విశ్వనాథరాజు తమకు చెందిన రాజేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌లో పెట్టుబడి పెట్టాలన్నారు. ఇందుకు ప్రతి ఫలంగా 10 శాతం వాటా ఇస్తామని చెప్పారు. సుదర్శన్ రూ.60 లక్షలు ఇవ్వగా 2019లో సనత్‌నగర్ జెక్ కాలనీలోని అపార్టుమెంటులో ఫ్లాటు ఇచ్చారు. దీన్ని తన కుమార్తె పేర రిజిస్టర్ చేయించిన సుదర్శన్..అందులోనే నివసిస్తున్నారు. 

రిజిస్ట్రేషన్ తరువాత రెండు నెలలకు ఎంవీ రాజు సుదర్శన్‌కు ఫోన్ చేసి ఫ్లాటు ఇచ్చినందుకు అదనంగా మరో రూ.5 లక్షలు రావాల్సి ఉందని డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల తరువాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుదర్శన్ ఇంటికొచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు నిర్బంధించి బెల్టుతో కొట్టారు. ఓఎస్డీ రాధాకిషన్ రావు అసభ్యంగా మాట్లాడుతూ వెంటనే ఫ్లాటు ఖాళీ చేయాలనీ, లేకుంటే రాజు చంపేస్తాడని బెదిరించాడు. దీంతో, భయపడిపోయిన సుదర్శన్, ఫ్లాటు సేల్ డీడ్ రద్దు చేసుకున్నారు. భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన తాజాగా కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4 నిందితుడైన రాధాకిషన్ రావును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై నాంపల్లి కోర్టులో బుధవారం విచారణ జరిగింది. పోలీసులు 10 రోజుల కస్టడీ కోరగా న్యాయస్థానం ఏడు రోజులకు అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనను పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.

Posted

 

Yennam Srinivas Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల ద్వారా బెదిరించాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

04-04-2024 Thu 15:49 | Telangana
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కోసం తాము అడుగుతుంటే పరువు తీశారని కేటీఆర్ అనడం విడ్డూరమని వ్యాఖ్య
  • ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
  • ఆధారాలు చూపించినందునే పోలీసులు విచారిస్తున్నారన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి
 
Yennam Srinivas Reddy takes on KTR over phone tapping issue

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తుంటే పరువు తీశారని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా తాము ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలు చూపించినందునే పోలీసులు విచారిస్తున్నట్లు చెప్పారు.

తాను కనుక కేటీఆర్ స్థానంలో ఉండి ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్ర లేదని పోలీస్ అధికారులకు లేఖ రాసి వివరణ ఇస్తానని తెలిపారు. కానీ కేటీఆర్ మాత్రం లీగల్ నోటీసులు ఇచ్చి బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 

 

Posted

G. Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం... బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

04-04-2024 Thu 17:16 | Telangana
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబం ప్రమేయం ఉందని ఆరోపణ
  • ప్రయివేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న కిషన్ రెడ్డి
  • బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఈసీని కలుస్తామని వెల్లడి
  • కేసీఆర్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలన్న కిషన్ రెడ్డి
 
Kishan Reddy hot comments on KCR and brs

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రయివేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పోలీసుల విచారణలో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని తేలిందని పేర్కొన్నారు. దేశ భద్రతకు భంగం కలిగేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, సమాజాంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రాజకీయాలకు సంబంధం లేని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడవుతోందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఫలితాలు కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

ఉప ఎన్నికల సమయంలోనూ మా అభ్యర్థులు, నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధినేతపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.

  • Upvote 1
Posted
21 hours ago, i_sudigadu said:

K Tapping Rao lol-laugh.gif

Krakul Tapping Rao

Posted
13 hours ago, psycopk said:

 

Mamatha benarjee 2017 lo statement ichindi ap govt software konnadi ani. She never took back her words. 2019 lo cbn worked with her

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...