psycopk Posted April 5, 2024 Report Posted April 5, 2024 YS Sharmila: షర్మిల బస్సు యాత్రలో వివేకా కూతురు సునీత.. అవినాశ్ రెడ్డిని ఓడించాలని పిలుపు 05-04-2024 Fri 13:15 | Andhra కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్న సునీత షర్మిలను ఎంపీ చేయాలనేదే తన తండ్రి చివరి కోరిక అని వెల్లడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభమయింది. ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ... కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రి వివేకాను చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా చంపేశారని... హత్య చేసిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి ఉంటే దీన్ని సహించేవారా? అని ప్రశ్నించారు. షర్మిలను ఎంపీ చేయాలనేది తన తండ్రి చివరి కోరిక అని చెప్పారు. తన తండ్రి కోరిక నెరవేరాలంటే అవినాశ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ కండువా వేసి ఇద్దరినీ కాంగ్రెస్ లోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ... జగన్, వైసీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టిన తనను జగన్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ తమకు దేవుడితో సమానమని... షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియంత జగన్ ను గద్దె దించాలని... కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని అన్నారు. Quote
psycopk Posted April 5, 2024 Author Report Posted April 5, 2024 YS Sharmila: హత్యా రాజకీయాలు పోవాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలి: వైఎస్ షర్మిల 05-04-2024 Fri 12:43 | Andhra కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల వివేకా హత్య కేసు నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని మండిపాటు హంతకులను కాపాడేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని విమర్శ కడప లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను... డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని... ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలని అన్నారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో వివేకా కూతురు సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని... పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే అన్నీ పూర్తయ్యేవని చెప్పారు. Quote
psycopk Posted April 5, 2024 Author Report Posted April 5, 2024 YS Sharmila: కోర్టు పరిధిలో ఉన్న వాటిపై షర్మిల మాట్లాడుతున్నారు... ఈసీకి ఫిర్యాదు చేస్తాం: వాసిరెడ్డి పద్మ 05-04-2024 Fri 18:22 | Andhra కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన షర్మిల జగన్ ప్రభుత్వం లక్ష్యంగా వ్యాఖ్యలు షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉందన్న వాసిరెడ్డి పద్మ షర్మిల రంగులు మార్చడంలో చంద్రబాబును మించిపోయారని విమర్శలు షర్మిలను చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని వెల్లడి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచార పర్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన ప్రచారంలో ఆమె ప్రధానంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఘాటుగా స్పందించారు. షర్మిల ప్రచారం ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత అజెండాతోనే షర్మిల... సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడకూడదన్న విషయం షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. ఎంతో తీవ్రమైన అంశంలో తీర్పు, శిక్ష ఈవిడే ఖరారు చేస్తున్నారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ కుటుంబాన్ని విడదీసే కుట్రలు ఈనాటివి కావని, కడప ప్రజలకు అన్నీ తెలుసని అన్నారు. షర్మిల చేస్తున్నవి సానుభూతి రాజకీయాలన్న విషయం అందరికీ అర్థమైందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. షర్మిల ఎన్ని అంశాల్లో యూటర్న్ తీసుకున్నారో అందరికీ తెలుసని, షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడతుందని అన్నారు. రంగులు మార్చడంలో ఆమె చంద్రబాబును మించిపోయారని వ్యాఖ్యానించారు. నాడు అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారు, విభజన హామీలపై ఏంచేసింది కాంగ్రెస్ పార్టీ? ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? అంటూ షర్మిలను వాసిరెడ్డి పద్మ నిలదీశారు. షర్మిల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆమె చంద్రబాబు రాజకీయంలో ఒక పావుగా మారారని విమర్శించారు. Quote
psycopk Posted April 5, 2024 Author Report Posted April 5, 2024 Devineni Uma: అందుకే జగన్ కు ఓటు వేయొద్దని ఆయన సొంత చెల్లెమ్మలే చెపుతున్నారు: దేవినేని ఉమ 05-04-2024 Fri 17:09 | Andhra వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందన్న దేవినేని ఉమ వైసీసీ పాలనలో ఎస్సీలు, బీసీలపై దాడులు జరిగాయని విమర్శ జగన్ లాంటి వాళ్లు సమాజానికే హానికరమని వ్యాఖ్య వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అవ్వాతాతల ప్రాణాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 4 వేల పెన్షన్ ఇంటి వద్దే అందిస్తామని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీలు, బీసీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని... దళితులను చంపి డోర్ డెలివరీ చేశారని అన్నారు. వారిపై 6 వేల తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు సమాజానికే హానికరమని... అందుకే జగన్ కు ఓటు వేయొద్దని ఆయన సొంత చెల్లెమ్మలే చెపుతున్నారని అన్నారు. Quote
RavvaKesari Posted April 5, 2024 Report Posted April 5, 2024 3 hours ago, psycopk said: YS Sharmila: షర్మిల బస్సు యాత్రలో వివేకా కూతురు సునీత.. అవినాశ్ రెడ్డిని ఓడించాలని పిలుపు 05-04-2024 Fri 13:15 | Andhra కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్న సునీత షర్మిలను ఎంపీ చేయాలనేదే తన తండ్రి చివరి కోరిక అని వెల్లడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభమయింది. ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ... కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రి వివేకాను చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా చంపేశారని... హత్య చేసిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి ఉంటే దీన్ని సహించేవారా? అని ప్రశ్నించారు. షర్మిలను ఎంపీ చేయాలనేది తన తండ్రి చివరి కోరిక అని చెప్పారు. తన తండ్రి కోరిక నెరవేరాలంటే అవినాశ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ కండువా వేసి ఇద్దరినీ కాంగ్రెస్ లోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ... జగన్, వైసీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టిన తనను జగన్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ తమకు దేవుడితో సమానమని... షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియంత జగన్ ను గద్దె దించాలని... కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని అన్నారు. Tv serials kanna ekuva drama undi ee family valla. Quote
psycopk Posted April 5, 2024 Author Report Posted April 5, 2024 Dr Suneetha Reddy: జగన్ జైల్లో ఉంటే షర్మిల పార్టీని బతికించింది... కానీ...!: సునీతా రెడ్డి 05-04-2024 Fri 20:29 | Andhra కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిల షర్మిలతో పాటు ప్రచారంలో పాల్గొన్న వివేకా కుమార్తె సునీతా రెడ్డి జగన్ కు షర్మిలను చూస్తే భయం పట్టుకుందని వ్యాఖ్యలు హంతకులకు శిక్ష పడాలంటే వాళ్లు అధికారంలో ఉండరాదన్న సునీతారెడ్డి అవినాశ్ రెడ్డిని ఓడించి షర్మిలను గెలిపించాలని పిలుపు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కడప జిల్లా నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతా రెడ్డి ప్రసంగిస్తూ, వివేకాను కిరాతకంగా హత్య చేశారని, ఆయనను చంపించింది అవినాశ్ రెడ్డి అని ఆరోపించారు. హత్య చేయించిన వ్యక్తి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నాడని అన్నారు. "జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీని బతికించింది. కానీ జగన్ జైలు నుంచి వచ్చాక షర్మిలను పక్కనపెట్టారు. జగన్ కు షర్మిలను చూస్తే భయం పట్టుకుంది. రాజకీయంలో జగన్ కంటే షర్మిల ముందున్నారు. వైఎస్సార్ లో ఉన్న ప్రతి లక్షణం షర్మిలలో ఉంది. జగన్ హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వివేకా హంతకులకు శిక్ష పడాలి. శిక్ష పడాలంటే హంతకులు అధికారంలో ఉండకూడదు. హంతకులను గద్దె దించే సమయం వచ్చింది. అవినాశ్ రెడ్డిని ఓడించాలి... షర్మిలను గెలిపించాలి" అని సునీతారెడ్డి పిలుపునిచ్చారు. Quote
psycopk Posted April 6, 2024 Author Report Posted April 6, 2024 Dr Suneetha Reddy: చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేకపోతున్నా: సునీత 06-04-2024 Sat 16:13 | Andhra వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా పోరాడుతున్నానన్న సునీత అన్నీ ఉన్నా నిస్సహాయంగా మిగిలిపోయానని ఆవేదన అవినాశ్ రెడ్డి మళ్లీ గెలవకూడదని వ్యాఖ్యలు నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టీకరణ గత ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత నేడు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి హత్య కేసులో ఐదేళ్లుగా పోరాడుతున్నానని వెల్లడించారు. చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటం తన కోసమే కాదని, సామాన్యుల కోసం కూడా అని సునీత స్పష్టం చేశారు. అవినాశ్ రెడ్డి అధికారంలోకి రాకూడదనేది తన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆపై ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. "2009కి ముందు కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకాలలో ఒకరు పోటీ చేసేవారు. వైఎస్ చనిపోయాక జగన్ ఎంపీగా ఉన్నారు. వైఎస్ మరణానంతరం పులివెందులలో పోటీపై చర్చ జరిగింది. పులివెందులలో పోటీకి భాస్కర్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చింది. అయితే, పులివెందులలో భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వివేకా వ్యతిరేకించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వివేకాకు మంత్రి పదవి ఇచ్చింది... దీన్ని జగన్ వ్యతిరేకించారు. జగన్ కు తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో వివేకా కాంగ్రెస్ ను వీడి వచ్చారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలే పార్టీని నడిపించింది. ఉప ఎన్నికల సమయంలోనూ షర్మిల పార్టీని గెలిపించడంలో కృషి చేసింది. అయితే, షర్మిలకు ఆదరణ పెరుగుతోందని జగన్ ఆమెను పక్కనబెట్టారు. 2014లో షర్మిల కడప నుంచి పోటీ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఆ ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ ను అవినాశ్ రెడ్డికి ఇచ్చారు. అవినాశ్ కు కడప ఎంపీ టికెట్ ఇవ్వడం వివేకాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. అవినాశ్ వెన్నుపోటు వల్లే వివేకాకు ఓటమి ఎదురైంది. 2019లో షర్మిలకు కడప టికెట్ ఇవ్వాలనే చర్చ వచ్చింది. కడప నుంచి నువ్వే పోటీలో ఉండాలి అంటూ షర్మిలను వివేకా ఒత్తిడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. నన్ను కూడా నరికి చంపినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వివేకా కేసులో సీబీఐ కొంత వేగంగా పనిచేస్తోందని భావిస్తున్నాను. నా వెనుక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు. వైసీపీలో ఉన్న వారు కూడా నాకు మద్దతు పలుకుతున్నారు. నా కుటుంబంలో ఉన్నవారే హత్య చేశారనేదాన్ని మొదట నేను నమ్మలేదు. నా కుటుంబంలోని వాళ్లను పూర్తిగా నమ్మడమే నేను చేసిన పొరపాటు. అవినాశ్ రెడ్డి నిందితుడు అని సీబీఐ చెబుతోంది. కానీ జగన్ అసెంబ్లీలో అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా రెండ్రోజులు అడ్డుకున్నారు. ఇటీవల కడప జైలుకు వెళ్లి దస్తగిరిని ప్రలోభపెట్టారు" అంటూ సునీత వివరించారు. జగన్ పై సీబీఐ, ఈడీ కేసుల్లో జాప్యం జరుగుతోందని సునీత పేర్కొన్నారు. జగన్ కేసుల్లో పదేళ్ల తర్వాత కూడా ట్రయల్ మొదలుకాలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. Quote
psycopk Posted April 6, 2024 Author Report Posted April 6, 2024 https://www.instagram.com/reel/C5aR0u1psY3/?igsh=MWNzZDJlcHZ5eTNjdg== Quote
psycopk Posted April 6, 2024 Author Report Posted April 6, 2024 Sakala shaka mantri calls ys daughters paid artists… jagga oka anna ga chachi povachu ra nuvvu https://www.instagram.com/reel/C5anbzIB1hK/?igsh=MTd6MmZqdjhtejE0dA== Quote
psycopk Posted April 6, 2024 Author Report Posted April 6, 2024 https://www.instagram.com/reel/C5axJrrJHsP/?igsh=eXNhbmoxZ2QyMWNi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.