psycopk Posted April 8, 2024 Report Posted April 8, 2024 Chandrababu: క్రోధి నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చంద్రబాబు 08-04-2024 Mon 20:20 | Both States రేపు తెలుగువారి సంవత్సరాది... ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఆగమనం చెడు అంతా దహనమై చల్లని పాలన ప్రారంభం కావాలన్న చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రేపు (ఏప్రిల్ 9) ఉగాది పర్వదినం నేపథ్యంలో, చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగుపెడుతున్నామని తెలిపారు. "క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. అయితే నేడు మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ... ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. Quote
psycopk Posted April 8, 2024 Author Report Posted April 8, 2024 Revanth Reddy: ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు 08-04-2024 Mon 21:09 | Telangana శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలన్న ముఖ్యమంత్రి ప్రజల ఆశలు, ఆంక్షలు నెరవేరాలన్న ముఖ్యమంత్రి కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, వానలు సమృద్ధిగా కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలన్న సీఎం తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతున్న సందర్భంగా... కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు, ఆంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, వానలు సమృద్ధిగా కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలన్నారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉపముఖ్యమంత్రి శుభాకాంక్షలు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి క్రోధినామ సంవత్సరాది సందర్భంగా భట్టివిక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలను పంచాలన్నారు. ప్రజల జీవితాల్లో సుఖ శాంతులు తేవాలని, కష్టాలు, నష్టాలు తొలగి ఆనందమయ జీవితాలకు ఈ పండుగ నాంది కావాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల లబ్ధి పొందుతున్న ప్రజల జీవితాల్లో ఆనందాలు నిండాలన్నారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ఈ క్రోధినామ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు బాగుండాలని, సకలవృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినందున నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం కావాలన్నారు. Quote
psycopk Posted April 8, 2024 Author Report Posted April 8, 2024 balakrish: తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ 08-04-2024 Mon 22:05 | Both States రేపే తెలుగువారి నూతన సంవత్సర పండుగ ఉగాది ఉగాది పర్వదిన వేడుకల కోసం సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు ఈ ఉగాది ప్రతి ఒక్క తెలుగు వారి జీవితాల్లో ఉషస్సులు నింపాలని ఆకాంక్షించిన బాలయ్య రేపు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోబోతున్నారు. ఉగాది సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరు కొత్త సంవత్సర శోభను సంతరించుకున్నాయి. పండుగను జరపుకునేందుకు అందరూ కావాల్సిన పూజ సామగ్రిని, ఉగాది పచ్చడికి కావాల్సిన అన్నింటిని సమకూర్చుకున్నారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.