Popular Post Ara_Tenkai Posted April 10, 2024 Popular Post Report Posted April 10, 2024 1 minute ago, psycopk said: oka manifesto sariga cheyadam radu ivanni muchatlu baga cheptunnaru... Asusualga Jagan cheseve inkonchem ekkuva penchi list chesaru... 3 Quote
DallasBaluKarry Posted April 10, 2024 Report Posted April 10, 2024 10 minutes ago, psycopk said: Copy cats copy cats copy copy copy cats 2 Quote
allbakara Posted April 10, 2024 Report Posted April 10, 2024 Jagananna also stand by middle class while giving tickets https://www.instagram.com/reel/C5IOQWGJvw7/?igsh=ZDUyZWNhNGI2b2Vq Quote
Mr Mirchi Posted April 10, 2024 Report Posted April 10, 2024 44 minutes ago, psycopk said: pacha jendalu levu enti ekkuvu..jsp vi ekkuva Quote
Mr Mirchi Posted April 10, 2024 Report Posted April 10, 2024 PK saaru leaders ni thayaru cheyatam lo week....stage meedha kuda general ga veedu nadella and nagababu ye vuntaaru maximum times....idhi change chesukovaali Quote
futureofandhra Posted April 10, 2024 Report Posted April 10, 2024 1 hour ago, Ara_Tenkai said: oka manifesto sariga cheyadam radu ivanni muchatlu baga cheptunnaru... Asusualga Jagan cheseve inkonchem ekkuva penchi list chesaru... amma vodi , hostel fee kakunda jaggad kothaga em chesadu? Quote
psycopk Posted April 10, 2024 Author Report Posted April 10, 2024 Daggubati Purandeswari: తుపానులను మించిన విపత్తు ఈ వైసీపీ పాలన: నిడదవోలులో పురందేశ్వరి ప్రసంగం 10-04-2024 Wed 21:38 | Andhra నిడదవోలులో ప్రజాగళం సభ చంద్రబాబు, పవన్ తో పాటు హాజరైన పురందేశ్వరి నిడదవోలులో జనసాగరం కనిపిస్తోందన్న ఏపీ బీజేపీ చీఫ్ మే 13న మన సత్తా ఏంటో వైసీపీ నేతలకు చూపించాలని పిలుపు నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అన్న బలమైన కోరికతో ప్రజలు ఇవాళ ఈ సభకు జనసాగరంలా తరలివచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. తుపానులను మించిన వైపరీత్యం ఈ వైసీపీ పాలన అని పురందేశ్వరి అభివర్ణించారు. ఐదేళ్ల కిందట వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం కుదేలైందని అన్నారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందని, పరిశ్రమల రాక మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్న ఏపీ ఇవాళ తలలేని మొండెంలా మిగిలిపోయిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం ఎంత దౌర్భాగ్యమో మనందరం గుర్తించాలని, అలాంటి వేళ మనమందరం నడుం బిగించాల్సిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని పేదలతో తాగించి, మహిళల పుస్తెలు తెగినా ఫర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనే పరిస్థితులు చూస్తున్నాం... అని వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసే పరిస్థితి లేదని విమర్శించారు. బీసీ కమిషన్ కు కేంద్రం చట్టబద్ధత ఇస్తే, రాష్ట్రంలోని బీసీ కమిషన్ కు చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ వర్గాలకు వైసీపీ ఏ విధంగా అన్యాయం చేస్తోందో ఒక్కసారి గమనించాలని పిలపునిచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన డ్రైవర్ ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగలేదని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కచ్చితంగా మార్పు అవసరం ఉందని అన్నారు. ఇవాళ ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే... నరేంద్ర మోదీ గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి యుక్తి, పవన్ కల్యాణ్ గారి శక్తి ఈ సభా ప్రాంగణంలో కనిపిస్తోందని వివరించారు. ఈ సమరోత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగించాలని, మే 13న మన సత్తా ఏంటో వైసీపీ నాయకులకు చూపించాలి అని పురందేశ్వరి పిలుపునిచ్చారు. 2 Quote
Mr Mirchi Posted April 10, 2024 Report Posted April 10, 2024 mothaaniki nara and daggubati families same stage meedh avachaaru after a longggggg time 2 Quote
psycopk Posted April 10, 2024 Author Report Posted April 10, 2024 Pawan Kalyan: ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం: పవన్ కల్యాణ్ 10-04-2024 Wed 22:50 | Andhra నిడదవోలులో ప్రజాగళం సభ హాజరైన పవన్ కల్యాణ్, చంద్రబాబు, పురందేశ్వరి ఏపీలో అధికారం ఐదుగురి చేతుల్లో ఉందన్న పవన్ ఏ ఒక్కరినీ వదిలేది లేదని హెచ్చరిక నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదుగురి చేతిలో రాష్ట్రం నలిగిపోతోందని తెలిపారు. అధికారం, పెత్తనం అంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు. ఐదుగురు వ్యక్తులు ఐదు కోట్ల మంది ప్రజలను అణచివేస్తుంటే అందరూ కలిసి రావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించి పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబుపై, పురందేశ్వరిపై బూతులు తిడతారు అని మండిపడ్డారు. ఏ ఒక్కరినీ వదిలేది లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని హెచ్చరించారు. ఢిల్లీలో మోదీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు అనుభవం, ఐదేళ్లుగా వైసీపీ దాడులను తట్టుకుని నిలబడిన జనసైనికులు, వీరమహిళలను కలుపుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చామని వివరించారు. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలన్నదే తమ అజెండా అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి, పరిశ్రమలు ఏర్పాటై అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనించాలి అని పెద్ద మనసుతో ఆలోచించి సీట్ల సర్దుబాటు విషయంలో బాగా తగ్గామని, ముఖ్యంగా, సంస్థాగతంగా బలంగా ఉన్న చంద్రబాబు కూడా టీడీపీ విషయంలో బాగా తగ్గారని పవన్ వివరించారు. నిడదవోలు నుంచి ఈసారి జనసేన పార్టీ బరిలో ఉందని, కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారని వెల్లడించారు. కందుల దుర్గేశ్ గెలిచిన వెంటనే నిడదవోలు నియోజకవర్గ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. నిడదవోలు నియోజకవర్గ అభవృద్ధికి జనసేన వద్ద ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. "వివేకా హత్య కేసు నిందితులను వెనకేసుకుని వస్తున్నాడు. సొంత చెల్లెళ్లకే గౌరవం ఇవ్వని వ్యక్తికి సగటు ఆడపిల్లలు ఓ లెక్కా? 3 వేల మంది ఆడబిడ్డలు ఆచూకీ లేకుండా పోతే, ఈ సీఎం ఇప్పటివరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్లమెంటు ఉభయ సభల్లో 30కి పైగా సభ్యులు ఉండి కూడా రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ చర్చ జరపలేదు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. Quote
psycopk Posted April 10, 2024 Author Report Posted April 10, 2024 Chandrababu: నిడదవోలులో వారాహి వాహనంపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు 10-04-2024 Wed 22:28 | Andhra నిడదవోలులో ప్రజాగళం సభ హాజరైన చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్ పవన్ వారాహి గురించి చెబితే విన్నానే తప్ప, చూడ్డం ఇవాళే ప్రథమం అన్న చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నిడదవోలు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ కు చెందిన వారాహి వాహనం పైనుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "గత 40 ఏళ్లలో నిడదవోలుకు అనేక పర్యాయాలు వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే మే 13న గెలవబోయేది ఎన్డీయే అని స్పష్టమవుతోంది. మొట్ట మొదటిసారిగా మూడు పార్టీల అధ్యక్షులం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఇక్కడికి వచ్చాం. వారాహి నుంచి ప్రజాగళం వినిపిస్తున్నాం. మిత్రుడు పవన్ కల్యాణ్ వారాహి గురించి చెబుతుంటే విన్నాను కానీ, ఇవాళే చూస్తున్నాను. ఇక్కడ్నించి మూడు పార్టీల తరఫున సింహ గర్జన చేస్తున్నాం. ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. ఇప్పుడే తణుకులో నేను, పవన్ కల్యాణ్ గారు రోడ్ షో చేశాం... అదిరిపోయింది. ఇప్పుడు నిడదవోలు దద్దరిల్లిపోయింది. ఇది చూస్తే జగన్ కు నిద్ర రాదు... గుండె పగలిపోవడం ఖాయం. సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్... నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, భారత్ ను ప్రపంచపటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న మోదీ ఉన్నారు... నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు చెప్పండి... మనకు జగన్ ఓ లెక్కా? జగన్ మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధం అని తిరుగుతున్నాడు... నిడదవోలు నుంచి చెబుతున్నాం... నిన్ను ఓడించడానికి మేం సిద్ధం. మమ్మల్ని అడ్డుకోవాలంటే నీ వల్ల కాదు... సైకిల్ స్పీడు పెంచి తొక్కుకుంటూ ముందుకెళతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరింత పదునెక్కుతుంది... నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుందే తప్ప, నీ బురద అంటదు. ఈ మూడు కలిసిన తర్వాత ఇక అన్ స్టాపబుల్. పవన్ కల్యాణ్ ఇప్పటికే చెప్పారు... మూడు పార్టీలు కలిసింది మా కోసం కాదు... రాష్ట్రం కోసం. ఈ జోరు ఆగేది కాదు... మా కాంబినేషన్ సూపర్ హిట్. చాలామంది సినిమాల్లో హీరోలుగా ఉంటారు కానీ, ప్రజల్లో నిజమైన హీరో పవన్ కల్యాణ్. ఆయన కోట్ల డబ్బును, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం వచ్చారు. ఎన్ని దాడులు, వేధింపులు ఎదురైనా మడమ తిప్పని నాయకుడు. మేం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఈ ఆటుపోట్లు మాకు కొత్త కాదు... మేం రాటుదేలిపోయాం. కానీ పవన్ కు ఇలాంటి పరిస్థితులు అలవాటు లేకపోయినా నిలదొక్కుకున్నారు. మావి మూడు జెండాలు... కానీ అజెండా ఒక్కటే. సీట్ల సర్దుబాటుతో అనేక త్యాగాలు చేసి మీ వద్దకు వచ్చాం. నిండు మనసుతో ఆశీర్వదించండి. ఇక సీఎం జగన్ తాను ఒంటరినని చెబుతున్నాడు. నువ్వు సింగిల్ గా రావడంలేదు... శవాలతో వస్తున్నావు... అది మర్చిపోవద్దు. 2014లో తండ్రి లేని బిడ్డ అని వచ్చావు... 2019లో మా బాబాయిని చంపేశారని వచ్చావు... నువ్వే చంపి, మా బాబాయి కూడా లేడంటూ వచ్చావు. ఇప్పుడు పెన్షన్ల పేరిట వృద్ధులతో శవరాజకీయాలు చేస్తున్నావు. జగన్ ను చూస్తే అందరు భయపడిపోయారు... టికెట్లు ఇస్తామన్నా సరే... ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, ఎంపీలు కూడా పారిపోతున్నారు. నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు అంటూ వైసీపీని వదలి మన వద్దకు వస్తున్నారు. ఇవాళ ఇక్బాల్ అనే ఎమ్మెల్సీ కూడా పదవికి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు. నాలుగేళ్ల పదవీకాలం ఉంటే సి.రామచంద్రయ్య కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చేశారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఈ రాష్ట్రంలో బాగుపడిందెవరైనా ఉంటే అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. రాష్ట్రాన్ని జగన్ నలుగురికి అప్పగించాడు... సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి.... ఇలాంటి వాళ్లే బాగుపడ్డారు తప్ప... ప్రజలకు ఒరిగిందేమీలేదు. పవన్, నేను అన్యోన్యంగా ఉంటే జగన్ కులరాజకీయాల చిచ్చుపెట్టాడు. మేం బీజేపీతో కలిస్తే మతరాజకీయాలకు తెరలేపాడు. జగన్... ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండకపోతే నీ అడ్రస్ గల్లంతవుతుంది, ఆ చిచ్చులో నిన్నే దగ్ధం చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రాంతీయ విద్వేషాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులను ప్రజలే అధిగమించాలి. ఎన్డీయే ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని దుష్ప్రచారం చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందే ఎన్టీ రామారావు. ఎన్డీయే వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవు... ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు తీసుకువస్తాం. ఇప్పటికే సూపర్-6 ప్రకటించాం... మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా 10 పాయింట్స్ ఫార్ములా కూడా ప్రకటిస్తాం... " అని చంద్రబాబు వెల్లడించారు. Quote
psycopk Posted April 10, 2024 Author Report Posted April 10, 2024 Pawan Kalyan: ఇక్కడ నా జనసైనికులపై పడిన దెబ్బ నేనింకా మర్చిపోలేదు: పవన్ కల్యాణ్ 10-04-2024 Wed 20:28 | Andhra తణుకులో ప్రజాగళం సభ హాజరైన పవన్ కల్యాణ్ ఆ మంత్రి పేరును నా నోటితో పలకడానికి కూడా ఇష్టపడను అంటూ వ్యాఖ్యలు తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. స్థానికంగా ఉన్న పౌరసరఫరాల మంత్రి పేరును కూడా నా నోటి నుంచి పలకడానికి ఇష్టపడను అంటూ పవన్ ధ్వజమెత్తారు. ఇక్కడ టీడీఆర్ బాండ్ల సొమ్ము దోచుకుని హైదరాబాద్ వెళ్లి బాలానగర్ లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆ మంత్రి కనీసం తన అవినీతి సొమ్మును ఈ నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టినా స్థానికులకు ఉపాధి వచ్చేదని అన్నారు. గతంలో ఇక్కడ జరిగిన తప్పులపై జనసేన రోడ్లపైకి వచ్చి పోరాడిందని పవన్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడ నా జనసైనికులపై పడిన దెబ్బ నేనింకా మర్చిపోలేదు అని అన్నారు. ఇక, అందరూ పేదల గురించి, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతుంటారని, కానీ మధ్య తరగతి వ్యక్తుల గురించి ఎవరూ మాట్లాడరని పవన్ పేర్కొన్నారు. అందుకే ఈ సభా ముఖంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానని, మధ్యతరగతి ప్రజలను కూడా గుర్తించాలని కోరుతున్నానని తెలిపారు. ఏపీలో 10 పాయింట్స్ ఫార్ములాతో ప్రజల్లోకి వస్తున్నామని... చిట్టచివరి పొలానికి కూడా నీరందాలి, ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనేదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఎంత క్లిష్టమైన అంశం అయినప్పటికీ, అసెంబ్లీకి రాగానే దానిపై మాట్లాడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే సీపీఎస్ ను పరిష్కరించాలని ఈ సందర్భంగా కూటమి భాగస్వాములకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. Quote
psycopk Posted April 10, 2024 Author Report Posted April 10, 2024 Chandrababu: ప్రజలు కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతారు: తణుకులో చంద్రబాబు 10-04-2024 Wed 19:17 | Andhra తణుకులో ప్రజాగళం సభ హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు మరోసారి ముగ్గురం కలిశామని, ఇక తమకు ఎదురులేదని ధీమా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజాగళం ధాటికి ఏపీ నుంచి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రజాగ్రహానికి వాయువు తోడైందంటూ పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ ను చూపించారు. నేడు తణుకు సభ సాక్షిగా చెబుతున్నా సైకిల్ స్పీడుకు ఎదురులేదు, గ్లాసు జోరుకు తిరుగులేదు, కమల వికాసానికి అడ్డే లేదు అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాయి... మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని అన్నారు. పదేళ్ల కిందట రాష్ట్ర విభజన కష్టాలు పోగొట్టేందుకు మూడు పార్టీలు కలిశాయని తెలిపారు. మళ్లీ ఇప్పుడు జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్లీ కలిశామని స్పష్టం చేశారు. కలిసింది మామూలు వ్యక్తులు కాదు... అనుభవం ఉన్న నేను, తపన ఉన్న పవన్ కల్యాణ్, దేశాన్ని నెంబర్ వన్ గా ప్రపంచపటంలో నిలపాలని కృషి చేసే నరేంద్ర మోదీ కలిశాం... ఇక మాకు తిరుగుంటుందా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. పవన్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత దాడులు చేశారు... అయినా అనేక అవమానాలను, దాడులను తట్టుకుని నిలబడిన పోరాట యోధుడు పవన్ కల్యాణ్ అని వివరించారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కల్యాణ్... నేను గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోం అని పేర్కొన్నారు. చీకటిపాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. అలాంటి సంకల్పానికి నరేంద్ర మోదీ నుంచి మద్దతు లభిస్తోంది అని చంద్రబాబు వెల్లడించారు. చేతిలో చిప్ప పట్టుకోవడం ఖాయం! 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లలో టీడీపీని గెలిపించారు... ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాం... వైసీపీకి డిపాజిట్లు వస్తాయా? ఇవాళ యువత పవర్ చూశాను. యువత గానీ కన్నెర్ర చేస్తే ఈ జగన్ లండన్ పారిపోతాడు. చేతిలో చిప్ప పట్టుకోవడం ఖాయం... ఎక్కడికి వెళతాడో నేను ఇప్పుడే చెప్పను... నేను, పవన్ కల్యాణ్ చేసి చూపిస్తాం. 2014-19 మధ్య ఎలాంటి పాలన జరిగిందో మీకు తెలుసు... మళ్లీ అలాంటి పాలన రావాలంటే కూటమి రావాలి, జాబు రావాలంటే కూటమి రావాలి... రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రథమ ప్రాధాన్యత. నేను గానీ, పవన్ గానీ ఆలోచించేది దాని గురించే! 2019 నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోండి... బాదుడే బాదుడు. గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు, తలపై చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు... ఇప్పుడు గుద్దుడే గుద్దులు... పిడిగుద్దులు గుద్దుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీయే ఆక్సిజన్ అందిస్తుంది. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో, పవన్ కల్యాణ్ కు అధికారం కోసమో మేం ఆలోచించడంలేదు... రాష్ట్ర ప్రజల బాగు కోసమే మేం ఆలోచిస్తున్నాం. విధ్వంసక పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా... సంక్షేమ పాలన కావాలా, సంక్షోభ పాలన కావాలా... మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, లేక గంజాయి, డ్రగ్స్ కావాలా... మీ ఆస్తులకు రక్షణ కావాలా, లేక భూ మాఫియా కావాలా... నడుములు విరిగే దారుణమైన రోడ్లు కావాలా, భద్రతనిచ్చే రోడ్లు కావాలా... రూ.10 ఇచ్చి రూ.100 దోచేసే దొంగలు కావాలా, మీ సంపద పెంచే కూటమి కావాలా... సచివాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్లు కావాలా, సంపద సృష్టించే వాళ్లు కావాలా... ధరల బాదుడు కావాలా, దోపిడీ లేని పథకాలు కావాలో అందరూ ఆలోచించుకోవాలి. వీళ్లు ఫేక్ ఫెలోస్, బోగస్ ఫెలోస్ ఈ రాష్ట్రంలో ఫేక్ ఫెలోస్ వచ్చారు, బోగస్ వ్యక్తులు వచ్చారు... వీళ్లను నమ్మితే నష్టపోతాం. యూట్యూబ్ లో కానీ, మీ ఫోన్లలో వచ్చేవి కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.. వాస్తవాలను తెలుసుకోండి... దొంగలు పెట్టే ఫేక్ న్యూస్ నమ్మొద్దు. జగన్ ఎన్నికల ముందు ఎన్నో చెప్పాడు... ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మిమ్మల్ని ఎవరినైనా కలిశాడా? పరదాలు కట్టుకుని తిరిగాడు. తాడేపల్లిలో అయినా ఎవరినైనా కలిశాడా? ఇప్పుడు మళ్లీ మీ వద్దకు వస్తున్నాడు.. మీపై ప్రేమ కాదు, మీ ఓట్ల కోసం వస్తున్నాడు... జగన్ ను నమ్మం అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్-6తో మీ ముందుకు వస్తున్నాం కూటమి తరఫున నిర్దిష్టమైన అజెండాతో మీ ముందుకు వస్తున్నాం. సూపర్-6తో మీ ముందుకు వస్తున్నాం. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ నిధి. స్త్రీలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఇద్దరుంటే రూ.3000, ముగ్గురుంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6000... ప్రతి నెలా ఒకటో తారీఖున ఆడబిడ్డల అకౌంట్లలో వేస్తాం. రెండోది తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15,000 చొప్పున ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు, ఐదుగురు ఉంటే రూ.75 వేలు ఇస్తాం. మూడోది... ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నాలుగోది... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఐదు... అన్నదాతలకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తాం. ఆరు... యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. జగన్ వస్తున్నాడంటే పరిశ్రమలు పారిపోతాయి... మేం వస్తున్నామంటే పరిశ్రమలు అవే వస్తాయి.... మన యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ అందిస్తాం. వృద్ధులకు, వితంతువులకు, పేదలకు ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం... రెండో నెలలో కూడా తీసుకోకపోతే మూడో నెలలో కూడా ఇచ్చే బాధ్యత మాది. వికలాంగులకు రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇస్తాం. మళ్లీ చెబుతున్నా... వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాలంటీర్లకు మరోసారి చెబుతున్నా. నిన్ననే మా కూటమి తరఫున ప్రకటన చేశాం. వాలంటీరు వ్యవస్థ ఉంటుంది... మీరు తప్పుడు పనులు చేయొద్దు... మీకిచ్చే జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడంలేదు. మంత్రి ధర్మాన అంటున్నాడు... రాష్ట్రంలో వాలంటీర్లే లేరట... వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారట. రాజీనామా చేసిన వాలంటీర్లు రెండు శాతమే. ఈ సందర్భంగా వాలంటీర్లకు చెబుతున్నా... వాళ్లు చెప్పినా మీరు రాజీనామా చేయొద్దు... మీకు అండగా మేముంటాం. మీరు మంచి పనులు చేస్తే మీకు మద్దతుగా నిలుస్తాం. మీతో తప్పుడు పనులు చేయించి మీ జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్ ఆలోచిస్తున్నాడు... వాలంటీర్లు విజ్ఞతతో ఆలోచించాలి... రాష్ట్రాభివృద్ధికి దోహదపడండి.. అవసరమైతే రూ.10 వేలు కాదు... రూ.1 లక్ష సంపాదించుకునే మార్గం చూపిస్తాను. Quote
Sucker Posted April 10, 2024 Report Posted April 10, 2024 12 minutes ago, futureofandhra said: amma vodi , hostel fee kakunda jaggad kothaga em chesadu? Baubgarini jail ki pampadu ani @CBN_God cheppadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.