psycopk Posted April 10, 2024 Report Posted April 10, 2024 RBI: అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై అనిశ్చితి 10-04-2024 Wed 20:44 | Andhra అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై పీఎంవోకు లేఖ రాసిన జాస్తి ఆంజనేయులు ఆ లేఖను ఆర్బీఐకి పంపింన పీఎంవో అధికారులు తాజాగా ఆర్బీఐ నుంచి జాస్తి ఆంజనేయులుకు లేఖ ఏపీ రాజధాని అమరావతిలో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్) కార్యాలయం ఏర్పాటుపై సందిగ్ధత ఏర్పడింది. రాజధాని ఏదో ఏపీ ప్రభుత్వం ఇంకా తేల్చలేదని ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమీత్ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరుకు చెందిన జాస్తి ఆంజనేయులుకు సుమీత్ లేఖ రాశారు. అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై జాస్తి ఆంజనేయులు గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖను పీఎంవో అధికారులు ఆర్బీఐకి పంపించారు. ఆ లేఖకు ఆర్బీఐ అధికారులు బదులిచ్చారు. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచే స్పష్టత లేదని ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమీత్ ఆ లేఖలో వెల్లడించారు. ఆర్బీఐ తనకు లేఖ రాయడం పట్ల జాస్తి ఆంజనేయులు స్పందించారు. 2016లో అమరావతిలో ఆర్బీఐకి 11 ఎకరాలు కేటాయించారని, కేంద్ర ప్రభుత్వ మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించారని వెల్లడించారు. Quote
TacoTuesday Posted April 10, 2024 Report Posted April 10, 2024 RBI uncles… hold your horses… three party is going to form govt. will build three buildings for you 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.