Anta Assamey Posted April 17, 2024 Report Posted April 17, 2024 As expected, the Vijayawada cops who have been virtually groping in the dark for the last three days to find out the real perpetrators behind the stone pelting at YSR Congress party president and Andhra Pradesh chief minister Y S Jagan Mohan Reddy are said to have zeroed in on TDP leader Bonda Uma Maheshwar Rao. Within minutes of the attack, the YSRCP leaders have been accusing the TDP leaders of conspiring to harm Jagan physically. In fact, the chief minister himself has openly accused TDP president N Chandrababu Naidu of instigating the people to attack him with stones. But since the police cannot directly fix Naidu in the case, they are looking for the local TDP leader and finally, they are learnt to have decided to implicate former MLA Bonda Umamaheshwar Rao, whose constituency Vijayawada (central) covers Ajit Singh Nagar where the incident took place. The police picked up five or six boys from the area and after interrogating them, they allegedly took a statement from them saying they were instigated by Bonda Uma to pelt stone at him. TDP sources said on coming to know about the plan of the police authorities to fix him, Bonda Uma switched off his phone and went underground, obviously to get anticipatory bail, fearing that he might be arrested in the case. Whether the case will be proved or not is a different question, but it will immediately serve the political purpose of the YSRCP and a setback for the TDP, as Bonda Uma is vigorously campaigning for the party in Vijayawada. Quote
psycopk Posted April 17, 2024 Report Posted April 17, 2024 Bonda Uma: సీఎంపై రాయి దాడి ఘటనతో నాకు సంబంధం లేదు: బోండా ఉమ స్పష్టీకరణ 17-04-2024 Wed 15:41 | Andhra ఈ నెల 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి బోండా ఉమపై ఆరోపణలు సానుభూతి కోసం గులకరాయి డ్రామా ఆడుతున్నారన్న ఉమ సానుభూతి రాకపోవడంతో టీడీపీ నేతల మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం ఈ విషయం గవర్నర్ దృష్టికి తీసుకెళతానని వెల్లడి విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి వ్యవహారంలో తన చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ఎన్నికల ముందు సానుభూతి కోసం గులకరాయి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. వారు ఆశించిన సానుభూతి లభించకపోవడంతో, ఈ వ్యవహారాన్ని టీడీపీ నేతల మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉమా మండిపడ్డారు. వేముల దుర్గారావును తమ కార్యాలయంలో ఉండగా పట్టుకెళ్లారని, వేముల దుర్గారావు తమ పార్టీ ఆఫీసు వ్యవహారాలు చూస్తుంటాడని వివరించారు. అన్యాయంగా ఇరికిస్తే జూన్ 4 తర్వాత ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతామని బోండా ఉమ వెల్లడించారు. "సీఎంపై రాయి దాడితో నాకు సంబంధం లేదు. కానీ కొందరు అధికారులు నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. సీబీఐ విచారణ జరిపించండి... నేను విచారణకు సహకరిస్తా. వేముల దుర్గారావును హింసించి నా పేరు చెప్పించాలని చూస్తున్నారు. అంతకుముందు వడ్డెరగూడెం పిల్లలను తీసుకెళ్లి హింసించారు. తనకు డబ్బు ఇవ్వకపోవడంతో రాయి విసిరినట్టు అందులో ఒకరు చెప్పారు" అని బోండా ఉమ వివరించారు. Quote
psycopk Posted April 17, 2024 Report Posted April 17, 2024 Chandrababu: బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నా: చంద్రబాబు 17-04-2024 Wed 14:07 | Andhra విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి బోండా ఉమపై ఆరోపణలు అధికార పార్టీ నీచమైన డ్రామాలు ఆడుతోందన్న చంద్రబాబు తప్పు చేసే అధికారులూ... బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ సీఎంపై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నానని తెలిపారు. తప్పు చేసే అధికారులూ... బీకేర్ ఫుల్... మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ‘‘ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలకు వైసీపీ తెరలేపింది. హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద వేయాలని చేసిన ప్రయత్నాలను ప్రజలు ఛీ కొట్టడంతో ఆ పార్టీ పీకల్లోతు బురదలో కూరుకుపోయింది. నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారు. వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు తీసుకుపోయారు. దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. అసలు... రాయి విసిరింది ఎవరు... కారణాలు ఏంటి... వాస్తవాలు ఏమిటో చెప్పకుండా మళ్లీ కుట్రలకు ప్రభుత్వం నీచపు ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పడం కోసం, నమ్మించడం కోసం పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, టీడీపీ ముఖ్యనేతలను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో పావులు కదుపుతోంది. దీనికోసం నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలున్నట్లు చిత్రీకరించేలా విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను కేసులో ఇరికించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. కీలక ఎన్నికల సమయంలో బోండా ఉమా ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోంది. ఈ ప్రభుత్వ చర్యలను, కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదు. నేడు మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం... అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా... జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో చాలా కఠినంగా శిక్షించబడతారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలి. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణ బాధ్యతల నుండి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. Quote
psycopk Posted April 17, 2024 Report Posted April 17, 2024 Varla Ramaiah: బోండా ఉమను ఇరికించే కుట్ర.. ఏపీ సీఈవో మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు 17-04-2024 Wed 13:00 | Andhra సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై విమర్శలు సీఈవోకు మెసేజ్ పెట్టామని, ఆయన ఇంకా స్పందించలేదని వివరణ ఏపీ డీజీపీకి కూడా మెసేజ్ చేశామన్న వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తమ పార్టీ నేత, విజయవాడ అభ్యర్థి బోండా ఉమను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఇదే విషయమై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మెసేజ్ రూపంలో ఆయన దృష్టికి తీసుకెళ్లామని, సీఈవో నుంచి ఇంకా స్పందన రాలేదని వివరించారు. దీంతో పాటు ఏపీ డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. విజయవాడలో సీఎంపై దాడి పూర్తిగా స్క్రిప్టెడ్ డ్రామా అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. విజయవాడ కమిషనర్ పై తమకు నమ్మకంలేదని, అధికార పార్టీకి అనుగుణంగా ఆయన నడుచుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో జగన్ ఈ గులకరాయి డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. బోండా ఉమ గెలుపు ఖాయం కావడంతో ఎలాగైనా ఆయనను ఇబ్బంది పెట్టాలని, రాజకీయంగా అన్ పాప్యులర్ చేయాలని వైసీపీ ఆడుతున్న నాటకమని విమర్శించారు. ఈ విషయంపై అవసరమైతే బుధవారం సాయంత్రం ఏపీ సీఈవో మీనాను కలుస్తామని వర్ల రామయ్య చెప్పారు. Quote
Apple_Banana Posted April 17, 2024 Report Posted April 17, 2024 Ilanti silly things cheste... sanuboothi tho easy ga gelustadu.. bonda.. last time 70 votes lost anukunta.. already most of the people irrespective of parties comedy chestunnaru... stone meeda inka laagithe... vunnadi kuda poddi.. 1 Quote
ThyagalaThyagaraju Posted April 17, 2024 Report Posted April 17, 2024 2 hours ago, Anta Assamey said: As expected, the Vijayawada cops who have been virtually groping in the dark for the last three days to find out the real perpetrators behind the stone pelting at YSR Congress party president and Andhra Pradesh chief minister Y S Jagan Mohan Reddy are said to have zeroed in on TDP leader Bonda Uma Maheshwar Rao. Within minutes of the attack, the YSRCP leaders have been accusing the TDP leaders of conspiring to harm Jagan physically. In fact, the chief minister himself has openly accused TDP president N Chandrababu Naidu of instigating the people to attack him with stones. But since the police cannot directly fix Naidu in the case, they are looking for the local TDP leader and finally, they are learnt to have decided to implicate former MLA Bonda Umamaheshwar Rao, whose constituency Vijayawada (central) covers Ajit Singh Nagar where the incident took place. The police picked up five or six boys from the area and after interrogating them, they allegedly took a statement from them saying they were instigated by Bonda Uma to pelt stone at him. TDP sources said on coming to know about the plan of the police authorities to fix him, Bonda Uma switched off his phone and went underground, obviously to get anticipatory bail, fearing that he might be arrested in the case. Whether the case will be proved or not is a different question, but it will immediately serve the political purpose of the YSRCP and a setback for the TDP, as Bonda Uma is vigorously campaigning for the party in Vijayawada. Bonda Anna intha dhairyam chesada… thank god… ma Thyagaraju meedha nindha veyaledhu Quote
psycopk Posted April 17, 2024 Report Posted April 17, 2024 Bonda Uma: నాపై నిందలు వేస్తే ఊరుకునేది లేదు... వీడియో పంచుకున్న బోండా ఉమ 17-04-2024 Wed 20:34 | Andhra విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి బోండా ఉమపై ఆరోపణలు విజయవాడ సెంట్రల్ లో జరిగింది కాబట్టి తనను టార్గెట్ చేస్తున్నారన్న ఉమ జూన్ 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి ఘటనలో తనపై ఆరోపణలు వస్తుండడం పట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరో ఆకతాయి రాయి విసిరితే తనపై నిందలు వేస్తున్నారని, ఇలాంటి అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను టార్గెట్ చేస్తున్నవారికి జూన్ 4 తర్వాత సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. "విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ సంఘటన అనుకోకుండా జరిగింది. తాను ఎందుకు అలా చేసిందీ ఆ కుర్రాడు కారణం కూడా చెప్పాడు. వాళ్ల ఇంటి పక్కనే అన్న క్యాంటీన్ ఉండేదట. అన్న క్యాంటీన్ తీసేశారు, మాకు రూ.300 ఇస్తామని ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు... మా అమ్మకు రూ.200 ఇస్తామని ఇవ్వలేదు. ఇలా డబ్బులు ఇవ్వకుండా ఎవడికి వాడు వెళ్లిపోయాడన్న బాధతో, కోపంతో చీకట్లో ఒక రాయి విసిరాడు. దురదృష్టవశాత్తు అది సీఎంకు తగిలింది. అంతే తప్ప, గురి చూసి విసరడానికి అదేమీ చిన్న విషయం కాదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది కాబట్టి... వాళ్లకొక అవకాశం వచ్చినట్టుగా భావించి నన్ను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవాలు ఉంటాయి, సాక్ష్యాధారాలు ఉంటాయి... ఎలాంటి పరిస్థితుల్లో నా పేరును తీసుకువస్తూ కేసును పెట్టించారో, ఎవరు కేసు బుక్ చేశారో, ఎవరు విచారణ చేస్తున్నారో వారంతా నా పేరును ప్రస్తావిస్తే మాత్రం జూన్ 4 తర్వాత కచ్చితంగా వారంతా కేసుల్లో ఇరుక్కుంటారు. కోడికత్తి డ్రామా లాగానే ఈ ఘటనతోనూ రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి పొందాలనుకుంటున్నారు. చిన్న గాయాన్ని పెద్దదిగా చూపిస్తున్నారు. ఇక్కడ నేను గెలుస్తున్నాను... గెలవలేని వెల్లంపల్లి ఏదో విధంగా నా మీద కేసు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ న్యాయం, ధర్మం అనేవి కచ్చితంగా ఉన్నాయి. ఇందులో నా పాత్ర ఉంటే నేను దేనికైనా సిద్ధం. ఉరేసినా, బహిరంగ శిక్ష విధించినా బాధపడను. అలాకాకుండా, నన్ను ఇరికించాలి, నా ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే ఎవరినీ వదిలిపెట్టం" అని బోండా ఉమ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ మీడియా ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.