Jump to content

Recommended Posts

Posted

BC కోడికత్తి డ్రామాకి ఓ దళితుడ్ని బలి చేశారు... ఇప్పుడు మరో బీసీని బలి చేస్తున్నారు: పట్టాభి 

17-04-2024 Wed 16:37 | Andhra
  • సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి 
  • పోలీసుల అదుపులో వడ్డెర కులానికి చెందిన మైనర్ బాలురు?
  • బీసీలంటే అంత చులకనగా ఉందా అంటూ పట్టాభి ఫైర్ 
  • పర్యవసానాలు అనుభవిస్తారంటూ హెచ్చరిక 
 
Pattabhi fires on minor boys has taken into custody in stone attack case

సీఎం జగన్ పై రాయితో దాడి వ్యవహారంలో వడ్డెర సామాజికవర్గానికి చెందిన మైనర్లను బలిపశువులను చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. నాడు 2019లో కోడికత్తి డ్రామాకి ఒక దళితుడ్ని బలి చేశారని, ఇప్పుడు ఒక బీసీని బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"బలహీన వర్గాలకు చెందిన పిల్లలను మీ కార్యాలయాల్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? బీసీలంటే మీకు అంత చులకనగా ఉందా? రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది బీసీలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వారిపై ఈ రకమైన దౌర్జన్యం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? కచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవిస్తారు" అంటూ పట్టాభి హెచ్చరించారు

Posted

Stone Attack On Jagan: బీసీ బిడ్డను ఇరికించే ప్రయత్నం.. జగన్ పై దాడి ఘటనపై అచ్చెన్న ఫైర్ 

17-04-2024 Wed 12:52 | Andhra
  • నాడు కోడికత్తి డ్రామాతో దళిత బిడ్డను ఐదేళ్లు జైలుపాలు చేశారన్న అచ్చెన్న 
  • నేడు బీసీ బిడ్డ సతీశ్‌ను జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
  • బోండా ఉమ పేరు చెప్పించే ప్రయత్నం జరుగుతోందన్న కేశినేని చిన్ని
 
Atchannaidu Responds Over Stone Attack On Jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామాతో ఎస్సీ బిడ్డను ఐదేళ్లపాటు జైలు పాలు చేశారని, ఇప్పుడు గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డ సతీశ్‌ను ఇరికించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గులకరాయి ఘటనకు, టీడీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కోడికత్తి సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలని నాడు అన్నారని, ఇప్పుడు అధికారంలో ఉన్నవారే దీనికి బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

బోండా ఉమను ఇరికించే యత్నం 
గులకరాయి కేసులో టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత కేశినేని చిన్ని ఆరోపించారు. బీసీ యువకుల్ని బెదిరించి ఉమామహేశ్వరరావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో టీడీపీ క్యాడర్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Posted

Accused ki Tdp support ki digindi ante its proved that they sponsored the attack

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...