psycopk Posted April 19, 2024 Report Posted April 19, 2024 Nara Bhuvaneswari: చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్ 19-04-2024 Fri 14:35 | Andhra కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి కుప్పం రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేషన్ పత్రాల అందజేత అంతకుముందు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి భువనేశ్వరి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా, నామినేషన్ దాఖలుకు ముందు భువనేశ్వరి శుక్రవారం ఉదయం ఆలయం, మసీదు, చర్చిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఉంచి భువనేశ్వరి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబూనగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. Quote
psycopk Posted April 19, 2024 Author Report Posted April 19, 2024 Balakrishna: హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు 19-04-2024 Fri 14:59 | Andhra భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన బాలయ్య ఈ నామినేషన్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని వ్యాఖ్య నందమూరి బాలకృష్ణ హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్‌కు భారీ సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు తరలిరావడం జరిగింది. కాగా, బాలయ్య ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులను నిర్మించినట్లు పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తన కుటుంబం అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన.. ఆ అభిమానంతోనే తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో తనను గెలిపించాలని బాలకృష్ణ హిందూపురం ఓటర్లను అభ్యర్థించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.