Jump to content

Recommended Posts

Posted

Happy Bday. 75 to 80 CM avvali.  

Health chuskondi yeppati la ne 😀

Good luck and best wishes Pedhayana 🙏

Posted
25 minutes ago, Sucker said:

Happy Bday. 75 to 80 CM avvali.  

Health chuskondi yeppati la ne 😀

Good luck and best wishes Pedhayana 🙏

ZGVuLmdpZg.gif

Posted

Chandrababu: చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ 

20-04-2024 Sat 14:11 | Andhra
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • టీడీపీ అధినేతపై శుభాకాంక్షల వెల్లువ 
  • ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసే నేత అంటూ కొనియాడిన మోదీ
 
PM Modi conveys birthday wishes to NDA ally Chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు విషెస్ తెలియజేశారు. 

"ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అంకితభావంతో కృషి చేసే అనుభవజ్ఞుడైన నాయకుడు. ప్రజాసేవలో నిమగ్నమైన ఆయన దీర్ఘాయుష్కుడై, ఆరోగ్యవంతుడై జీవించాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Posted

Chandrababu Birthday: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, పవన్ కల్యాణ్ 

20-04-2024 Sat 13:21 | Andhra
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు చంద్రబాబు అన్న చిరంజీవి
  • నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారన్న పవన్
 
Chiranjeevi and Pawan Kalyan birthday greetings to Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గ్రీటింగ్స్ తెలిపారు. 

'అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ... ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ... 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా ధృడ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కార్ బనాయించిన కేసులతో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదు. పరిపాలన పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు గారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

Posted

Raghu Rama Krishna Raju: రాజర్షి చంద్రబాబుకు ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు: రఘురామకృష్ణరాజు 

20-04-2024 Sat 11:11 | Andhra
  • నేడు చంద్రబాబు జన్మదినం
  • జాతి గర్వపడే నాయకుడు చంద్రబాబు అన్న రఘురాజు
  • రేపటి తరాల భవితను తీర్చిదిద్దే మహాశిల్పి అని కితాబు
 
Raghu Raju birthday wishes to Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేతలు ఎంత మంది ఉన్నా... జాతి గర్వపడే నాయకులు కొందరే ఉంటారని రఘురాజు అన్నారు. ఆ కొందరిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉంటారని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని... ఆయన ఒక అనితరసాధ్యుడని, అద్వితీయ దార్శనికుడని, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని, రేపటి తరాల భవితను తీర్చిదిద్దే మహాశిల్పి అని కొనియాడారు. అలాంటి రాజర్షికి ఇవే నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. చంద్రబాబుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

Posted

Chandrababu: సైబర్ టవర్స్ వద్ద ఘ‌నంగా చంద్ర‌బాబు పుట్టిన‌రోజు వేడుక‌లు 

20-04-2024 Sat 15:26 | Andhra
  • హైద‌రాబాద్‌లో చంద్రబాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన అభిమానులు
  • హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద కేక్ కట్ చేసి బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన ఐటీ ఉద్యోగులు 
  • 'హ్యాపీ బ‌ర్త్‌డే సీబీఎన్' అంటూ నినాదాలు
 
Chandrababu Birth day Celebrations at Cyber towers

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుక‌ల‌ను ఆయ‌న అభిమానులు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. 'హ్యాపీ బ‌ర్త్‌డే సీబీఎన్' అంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల తాలూకు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు ఏపీ వ్యాప్తంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుకల‌ను ఆయ‌న అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.  

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...