Jump to content

Recommended Posts

Posted

Revanth Reddy: తెలంగాణ సీఎంగా చెబుతున్నా... ఉదయనిధి స్టాలిన్ లాంటి వారిని శిక్షించాలి: 'సనాతన' వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి 

20-04-2024 Sat 17:36 | National
  • టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై రేవంత్ స్పందన 
  • ఉదయనిధి వ్యాఖ్యలు సరికాదు... ఆ మాటలు తప్పే.. ఎవరూ సమర్థించరన్న రేవంత్ రెడ్డి
  • ఒకే కుటుంబంలో భిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఉంటారని వ్యాఖ్య
 
Telangana CM Revanth Reddy Slams Udhayanidhi Stalin Anti Sanatan Dharma Remarks

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఉదయనిది గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. 'టైమ్స్ నౌ' ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా... 'ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదు. ఆ మాటలు తప్పు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరైనా సమర్థిస్తారా? ఉదయనిధి స్టాలిన్ చేసింది కరెక్ట్ అని చెప్పగలరా?' అని రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వారు బాధ్యత వహించాల్సిందే అన్నారు. 'నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఆయన (ఉదయనిధి) లాంటి వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు.

డీఎంకేతో పొత్తు గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా... ఒకే కుటుంబంలో కూడా భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఉంటారన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని గత ఏడాది సెప్టెంబర్‌లో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

  • Haha 1
Posted

Karnataka: కర్ణాటకలో ప్రచారం కోసం బెంగళూరుకు చేరుకున్న రేవంత్ రెడ్డి 

20-04-2024 Sat 17:14 | National
  • బెంగళూరులోని సర్వజ్ఞనగర్‌లో రోడ్డు షో నిర్వహించనున్న రేవంత్ రెడ్డి
  • ఆ తర్వాత మార్తనహళ్లిలోని బహిరంగ సభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం
  • అనంతరం హోంగసాండ్ర కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
 
Revanth Reddy will campaign in Karantaka

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటకలో ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయన బెంగళూరులోని సర్వజ్ఞనగర్‌లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్తనహళ్లిలోని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హోంగసాండ్ర కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తరఫున ప్రచారం నిర్వహించారు.

Posted

KCR: ఇంకా తానే ముఖ్యమంత్రిని అని కేసీఆర్ అనుకుంటున్నారు: రేవంత్ రెడ్డి 

20-04-2024 Sat 15:38 | Telangana
  • లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్య
  • ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలం మధు గెలవాలన్న సీఎం
  • ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి
  • ఏం చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్‌లోకి వెళతారని ఎద్దేవా
 
Revanth Reddy satire on brs chief kcr

తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రిని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలం మధు గెలవాలన్నారు.

తనతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ఏం చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్‌లోకి వెళతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ఇందిరమ్మ అనేక పరిశ్రమలను ఇచ్చారన్నారు. అందుకే దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి ఎంతోమంది బతుకుతున్నట్లు చెప్పారు.

Posted

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డి 

20-04-2024 Sat 16:58 | Telangana
  • అనన్యరెడ్డికి శాలువ కప్పి సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • సివిల్స్‌లో థర్డ్ ర్యాంక్ సాధించిన అనన్యరెడ్డి
 
Civils third ranker Ananya Reddy of Mahabubnagar met CM Revanth Reddy

సివిల్స్ థర్ట్ ర్యాంకర్ అనన్యరెడ్డి శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు అరవై మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్ నగర్‌కు చెందిన దోనూరి అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.

Posted

@bhaigan why congress support these people. ?  Will never vote someone who hurts your belief system. The last govt if not providing facilities should not hurt their sentiments.

Posted
5 hours ago, jpismahatma said:

@bhaigan why congress support these people. ?  Will never vote someone who hurts your belief system. The last govt if not providing facilities should not hurt their sentiments.

Udaynidhi ki already supreme court motti kayalu kuda vesindi, Young blood he should have shut his mouth on some sensitive things

Posted
19 minutes ago, bhaigan said:

Udaynidhi ki already supreme court motti kayalu kuda vesindi, Young blood he should have shut his mouth on some sensitive things

Udayanidhi gaadu ucha aapukoleka vaagesadu.. AP lo cross Jaffa lu chesthundhi ithe adhe kadha... 

Posted

Starting lo hadavidi chesaru as it is Jaggad la now no sound ? Sudden ga disappeared??

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...