psycopk Posted April 21, 2024 Report Posted April 21, 2024 Vijayasai Reddy: లోకేశ్.. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు?: విజయసాయి రెడ్డి 21-04-2024 Sun 12:23 | Andhra లోకేశ్ కు వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్న నీకు సంస్కారం నేర్పించలేకపోయిన స్టాన్ ఫోర్డ్ ప్రొఫెసర్లు తలదించుకోవాలి.. నారా లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, జగన్ ను హత్య చేయడానికి పదునైన రాయితో కొట్టినట్లు చెప్పాడని వైసీపీ నేత విజయసాయి రెడ్డి చెప్పారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత లోకేశ్ వ్యంగ్యంగా చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్ నీకు మెదడులో చిప్ లేదని అందరికీ తెలుసు. పశువుకంటే హీనంగా దిగజారిన నీకు సంస్కారం నేర్పించలేనందుకు చదువు చెప్పిన టీచర్లు, స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ప్రొఫెసర్లు సిగ్గుతో తలదించుకోవాలి. జగన్ ను తాకిన రాయి ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు. దాడి చేయించింది విజయవాడ సెంట్రల్ టీడీపీ ముఖ్యులే’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. Quote
psycopk Posted April 21, 2024 Author Report Posted April 21, 2024 Lokesh ni ane mundu aa stone cbn veyinchadu annaru kada ra pichi kukkalaga…. Daniki em samadhanam cheptaru ra jaffas… inkaki aa stone ekkada dachi petaru?? Quote
psycopk Posted April 21, 2024 Author Report Posted April 21, 2024 Varla Ramaiah: ముఖ్యమంత్రి గారూ... మీ ఇద్దరూ ఇక బ్యాండేజీలు తీసేయండి: వర్ల రామయ్య 21-04-2024 Sun 17:21 | Andhra ఏప్రిల్ 13న సీఎం జగన్ పై విజయవాడలో రాయి దాడి సీఎం జగన్ నుదుటికి గాయం... మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి గాయం జగన్ గాయానికి మూడు రోజులు బ్యాండేజి చాలన్న వర్ల రామయ్య వెల్లంపల్లి కంటి దెబ్బకు రెండున్నర రోజులు బ్యాండేజి చాలని వెల్లడి ఇటీవల విజయవాడలో సీఎం జగన్ పై విజయవాడలో రాయి దాడి జరగడం, ఆయన నుదుడికి గాయం కావడం తెలిసిందే. ఏప్రిల్ 13న ఈ ఘటన జరగ్గా, సీఎం జగన్ ఇంకా నుదుటన బ్యాండేజితోనే దర్శనమిస్తున్నారు. ఇదే ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి కూడా గాయం కావడంతో, ఆయన కూడా బ్యాండేజి వేయించుకున్నట్టు ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ అంశాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. "ముఖ్యమంత్రి గారూ... మీరు, మీ అనుచరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మీ మీ బ్యాండేజిలు తీసేయండి. మీ నుదుటి దెబ్బకు మూడు రోజుల బ్యాండేజి చాలు. వెల్లంపల్లి కంటి దెబ్బకు రెండున్నర రోజులు చాలు. వెల్లంపల్లి కంటి బ్యాండేజి వెంటనే తీయకుండా ఎన్నికల దాకా ఉంచుకుంటే మొదటికే మోసం... గ్రహించగలరు" అంటూ ట్వీట్ చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.