Jump to content

Chandra babu ni gun peti kalchali annapudu ekkada sacharu ra meru anta


Recommended Posts

Posted

YS Bharathi: అది చంద్రబాబు విచక్షణకే వదిలేస్తున్నా: వైఎస్ భారతి 

29-04-2024 Mon 14:35 | Andhra
  • పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్న భారతి
  • జగన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్న తీరు సరిగా లేదని వ్యాఖ్య
  • ఒక వ్యక్తిని అడ్డు తొలగించాలనుకోవడం సరికాదని వ్యాఖ్య
 
YS Bharathi comments on Chandrababu

ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గంలో ఆయన భార్య వైఎస్ భారతి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గడపగడపకు వెళ్లి ఆమె ఓటర్లను కలుస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారం సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు విచక్షణతో మాట్లాడాలని అన్నారు. వయసులో పెద్దవారైన చంద్రబాబు జగన్ గురించి మాట్లాడుతున్న తీరు సరిగా లేదని చెప్పారు. 

జగన్ పై జరిగిన రాయి దాడి గురించి మాట్లాడుతూ... ఒక వ్యక్తిని చంపాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రజలను మెప్పించాలని అనుకోవాలే కానీ... అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణమని చెప్పారు. దీన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు. పులివెందులలో అభివృద్ధి లేదనే వారికి కళ్లు లేవనుకోవాలని చెప్పారు. పులివెందులలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. మరింత అభివృద్ధి జరగాలంటే జగన్ కు మరోసారి ఓటు వేసి గెలిపించాలని అన్నారు.

Posted

Ee 5yrs lo investigate chesi kanipetava ra kukka sai

Vijayasai Reddy: ఇప్పటికే రెండు సార్లు జగన్ పై హత్యాయత్నాలు చేయించిన బాబు ఇప్పుడు స్వయంగా బెదిరిస్తున్నాడు: విజయసాయి 

29-04-2024 Mon 14:46 | Andhra
  • చంద్రబాబులో ద్వేషం, కసి, అసూయ బుసలు కొడుతున్నాయన్న విజయసాయి
  • నిన్ను చంపితే ఏమవుతుంది జగన్ అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపణ
  • నీ మనసులో కోరిక నెరవేరదు బాబూ అంటూ ట్వీట్
 
Vijayasai tweets on Chandrababu

చంద్రబాబులో ద్వేషం, కసి, అసూయ బుసలు కొడుతున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే రెండుసార్లు జగన్ ను అంతం చేయించేందుకు హత్యాయత్నాలు చేయించిన బాబు ఇప్పుడు తనే స్వయంగా "నిన్ను చంపితే ఏమవుతుంది జగన్" అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. 

తన రాజకీయ జీవితం పరిసమాప్తం అవుతోందన్న ఆక్రోశంతో కడుపులోని మంటను బయటపెట్టుకుంటున్నాడని విమర్శించారు. జగన్ కు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు నీ మనసులోని కోరిక నెరవేరదు బాబూ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Posted

Looks like ycp is desperate to play sympathy card… one more self attack on cards… 

Posted

Chandrababu: నేనేదో జగన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన భార్య, ఏ2 మాట్లాడుతున్నారు: చంద్రబాబు 

30-04-2024 Tue 18:28 | Andhra
  • ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు
  • తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • నోటికి గట్టిగా వాత పెట్టాలని వ్యాఖ్యలు
 
Chandrababu slams YS Jagan and his wife

టీడీపీ అధినేత చంద్రబాబు దెందులూరు ప్రజాగళం సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానేదో చంపేయడానికి ప్రయత్నిస్తున్నాని జగన్ అంటున్నాడని, ఆయన భార్య కూడా మాట్లాడుతోందని, ఏ2 కూడా అదే మాట అంటున్నాడని విమర్శించారు. వీళ్లకు తప్పుడు ప్రచారం అలవాటైపోయిందని, ఆ నోటికి గట్టిగా వాత పెట్టి, శాశ్వతంగా మూసేస్తే తప్ప సిగ్గురాని మనుషులు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 

"మీరు చూసే పనులను మాపై నెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే! ఇక్కడ దెందులూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయా? ఎందుకు పులివెందులో ఉన్నాయి? నువ్వే కారణం... అవునా, కాదా?" అంటూ  నిలదీశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...