Jump to content

Recommended Posts

Posted

 

Pawan Kalyan: 'కెమెరా అటు తిప్పండయ్యా' అంటూ సీఎం జగన్ హోర్డింగ్ ను చూపించిన పవన్ కల్యాణ్ 

02-05-2024 Thu 17:26 | Andhra
  • మన్యం జిల్లా పాలకొండలో వారాహి విజయభేరి సభ
  • 'కలలు నిజం చేయడానికి' అంటూ సీఎం జగన్ హోర్డింగ్
  • ఏం కలలు నిజం చేశాడంటూ విమర్శించిన జనసేనాని
 
Pawan Kalyan comments on CM Jagan hording in Palakonda

జనసేనాని పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ఆసక్తికరంగా ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో అక్కడే సీఎం జగన్ హోర్డింగ్ ఉండడాన్ని పవన్ కల్యాణ్ గమనించారు. ఆ హోర్డింగ్ పై జగన్ బొమ్మతో పాటు కలలు నిజం చేయడానికి... జగన్ కోసం సిద్ధం అని రాసి ఉంది. 

కెమెరా అటు తిప్పండయ్యా... అంటూ పవన్ ఆ హోర్డింగ్ ను చూపించారు. కలలు నిజం చేయడానికి అంట... మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా? అంటూ ప్రశ్నించారు. 

మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి ఇక్కడి వీరఘట్టం నుంచే వచ్చారని, ఒంటి చేత్తో గొలుసులను తెంపేవారని పవన్ కీర్తించారు. ఇక్కడ కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు... కానీ జగన్ కానీ, ఇక్కడున్న వైసీపీ నేతలు కానీ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని అడిగారా? అని ప్రశ్నించారు. మరెందుకయ్యా... ఆ పోస్టర్... సిద్ధం సిద్ధం అంటూ... ఏం కలలు నిజం చేస్తాడు? అంటూ ధ్వజమెత్తారు. 

మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, కానీ రూ.60 క్వార్టర్ ను రూ.200కి అమ్ముతున్నాడు... 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోతే వారి ఇంట్లో వాళ్ల ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పాడు... కానీ రద్దు చేయలేదు... ఇంకేం కలలు నిజం చేస్తాడు? అంటూ పవన్ నిలదీశారు. 

తనకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు అని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం, భాష, యాస గుండె కదిలించేస్తాయని అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో తిరిగిన వాడ్ని, ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)లో తిరిగిన వాడ్ని, కష్టాలు చూసినవాడ్ని, యువత కడుపు మంట తెలిసిన వాడ్ని, ఉపాధి అవకాశాల్లేక వలస వెళ్లిపోతున్న యువత ఆక్రోశాన్ని అర్థం చేసుకున్నవాడ్ని అని వివరించారు. 

అందరిలాగా ఓటమిని అంగీకరించి పారిపోవడం నా వల్ల కాదు... అందుకే దశాబ్దకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను అని వెల్లడించారు. నాకు నిలబడడం ఒక్కటే తెలుసు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కళామతల్లి ద్వారా తాను ఆటా పాటా నేర్చుకున్నానని చెబుతూ పవన్ కల్యాణ్ 'మల్లీ నీకెందుకురా పెళ్లి' అనే గీతాన్ని ఆలపించారు. 

అంతేగాకుండా, ఏం పిల్లడో ఎల్దమొస్తవా, బాయ్ బాయే బంగారు రమణమ్మ అనే గీతాలు ఉత్తరాంధ్రలో తిరిగినప్పుడు తనకు పరిచయం అయ్యాయని వివరించారు. ఉత్తరాంధ్ర యాసను తెలుగు సినిమాల్లో పెట్టాలా, వద్దా అని చాలామంది ఆలోచిస్తుంటారని, కానీ ఉత్తరాంధ్ర యాస తన గుండెల్లో మోగుతుంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. 

తెలుగు వాడుక భాషోద్యమం చేపట్టిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాష అంతరించిపోకుండా ఆ భాషకు ఓ నిఘంటువును కనిపెట్టారని కొనియాడారు. శ్రీశ్రీ వంటి మహాపండితులు, ఉద్ధండులను అందించిన నేల ఈ ఉత్తరాంధ్ర అని పేర్కొన్నారు. 

 

Posted

Ambati Rayudu: నన్ను తప్పుదారి నుంచి తప్పించి కరెక్ట్ రూట్లో తీసుకెళుతున్నందుకు థాంక్యూ సర్: పవన్ కు కృతజ్ఞతలు చెప్పిన అంబటి రాయుడు 

02-05-2024 Thu 20:30 | Andhra
  • విశాఖలో వారాహి సభ
  • హాజరైన పవన్ కల్యాణ్, అంబటి రాయుడు
  • మాట్లాడాలంటూ రాయుడికి మైక్ ఇచ్చిన పవన్
  • పవన్ తననే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని కరెక్ట్ రూట్లో తీసుకెళతాడన్న రాయుడు
  • తనకు ఇదే తొలి పొలిటికల్ స్పీచ్ అని, రోమాలు నిక్కబొడుచుకున్నాయని వెల్లడి
 
Ambati Rayudu thanked Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ హాజరైన విశాఖ వారాహి విజయభేరి సభకు ప్రముఖ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు కూడా హాజరయ్యారు. ఇతర నేతల ప్రసంగాలు అయ్యాక... అంబటి రాయుడు గురించి పవన్ కల్యాణ్ పరిచయ వాక్యాలు పలికారు. 19 ఏళ్ల వయసులో అండర్-19 క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టి, ఈరోజు వరకు తన సత్తా చాటుకుంటున్న ఇండియన్ క్రికెటర్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని మనకు మద్దతు తెలుపుతున్న అంబటి రాయుడు గారిని ఐదు నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నా అని పవన్ పేర్కొన్నారు. 

అనంతరం మైక్ అందుకున్న అంబటి రాయుడు ప్రసంగిస్తూ... బాగున్నారా అంటూ అందరినీ పలకరించారు. "చాలా సంతోషంగా ఉంది. మొదట పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే... నన్ను తప్పుదారి నుంచి తప్పించి ఈ రోజు కరెక్ట్ రూట్లో తీసుకెళుతున్నందుకు థాంక్యూ సర్. తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడ్నే కాదు... రాష్ట్ర ప్రజలందరినీ తప్పిస్తున్నారు పవనన్న. 

మనం యువత 50 శాతం ఉన్నాం. యువతే రాష్ట్ర భవిష్యత్తు. పవనన్న నాయకత్వంలో కూటమి ద్వారా రాష్ట్రం మరింత ముందుకెళుతుందని, ఎంతో అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ప్రజలందరూ కూటమికి తోడ్పాటు అందించాలి. కసిగా ఓటేసి వైసీపీ అరాచకాలకు అంతం పలకాలి. 

ఈ ఎన్నికలు ప్రజలకు ఒక సువర్ణావకాశం. ముఖ్యంగా వైజాగ్ ప్రజలు ట్రెండ్ సెట్ చేయాలి. ఎన్నికల్లో కూటమి గెలిస్తే విశాఖ ఒక మహానగరం అవుతుంది. బీజేపీ సహకారంతో ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా మనందరి భవిష్యత్తు నెంబర్ వన్ గా ఉండబోతోంది. 

వైసీపీలో నేను 7 నెలల పాటు రాష్ట్రమంతా పర్యటించాను. గ్రామగ్రామాలకు వెళ్లాను. అక్కడ ఎన్నో సమస్యలు కనిపించాయి. వైసీపీ వల్ల ఆ సమస్యలు పరిష్కారం కావు అనిపించింది. వైసీపీలో బానిసత్వం తప్ప ఏమీ లేదు, పూర్తి అరాచకత్వం ఉంది. ఒక రాజు మిగతా అందరినీ తన కాలి కింద పెట్టి, రాష్ట్రాన్ని బానిసత్వానికి గురిచేస్తున్నాడు. అందుకే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. 

ఏపీ ఎంతో ప్రగతిశీల రాష్ట్రం. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది. ఆంధ్రులంటే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. అందుకే మంచితనానికి ఓటేయండి. 

పవనన్నను నమ్మండి. నాకు పవనన్నపై గట్టి నమ్మకం ఉంది. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ కూటమి ఉన్నా, ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా పవనన్న మీకోసం నిలబడతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అన్న కరెక్ట్ రూట్లో తీసుకెళతారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను" అంటూ అంబటి రాయుడు తన తొలి రాజకీయం ప్రసంగం చేశారు. 

ఇంతమంది జనం మధ్య మ్యాచ్ లు ఆడాను కానీ, రాజకీయ ప్రసంగం చేయడం మాత్రం ఇదే తొలిసారి అని, రోమాలు నిక్కబొడుచుకున్నాయని రాయుడు వెల్లడించారు.

Posted

Pawan Kalyan: నేను సినిమాల్లో వేలు చూపించే ఫొటోలకు పోజులివ్వడానికే ఆలోచిస్తాను.... ఈయన వేలు చూపించి సిద్ధం అంటున్నాడు: పవన్ కల్యాణ్ 

02-05-2024 Thu 21:12 | Andhra
  • విశాఖ సౌత్ నియోజకవర్గంలో వారాహి విజయభేరి సభ
  • ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడే ప్రజల వేదన అర్థమైందన్న పవన్
  • చెల్లెలి జీవితాన్ని బయటికి లాగిన వ్యక్తి ఉన్నాడంటూ వ్యాఖ్యలు
  • మరోసారి వైసీపీ అరాచకాన్ని భరించే ఓపిక రాష్ట్రానికి లేదని వెల్లడి 
 
Pawan Kalyan fires on CM  Jagan in Visakha South

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ సౌత్ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఉత్తరాంధ్రపై తన అభిమానాన్ని చాటుకున్నారు. నటనలో తాను ఓనమాలు నేర్చుకుంది ఈ గడ్డపైనే అని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అంటే ఆట, పాట, పొలం, పని, సముద్రం, సైనికుడు అని వివరించారు. ఇవి ఉత్తరాంధ్ర ఆరు ప్రాణాలు అని పేర్కొన్నారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, సిక్కోలు-ఆరు ప్రాణాలు అని ఒక రచయిత రాశాడని వెల్లడించారు. 

"విశాఖలో నటనలో శిక్షణ పొందే సమయంలో ఇక్కడే చాలా నెలలు ఉన్నాను. భీమిలి వెళ్లేవాడ్ని. అక్కడే సముద్రం పక్కన కూర్చుని యాక్టింగ్ క్లాసులకు హాజరయ్యేవాడ్ని. ఇక్కడే ఉత్తరాంధ్ర ఆటాపాటా నేర్చుకున్నాను. ఆ రోజుల్లోనే జనం తాలూకు వేదన అర్థమైంది. 

కానీ ఈ రోజు 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే పట్టించుకోకుండా, సొంత చెల్లి జీవితాన్నే బయటికి లాగిన దిగజారుడు వ్యక్తి ఉన్నాడు... సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు ఇక్కడున్న ఆడబిడ్డలకు గౌరవం ఇస్తాడా? భార్యాపిల్లలను కిడ్నాప్ చేస్తే వాళ్ల సొంత ఎంపీనే రక్షించుకోలేకపోయాడు. సొంత కుటుంబాలనే రక్షించుకోలేనివాళ్లు మన జీవితాలకు ఏం భద్రత ఇస్తారు? 

రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు... ప్రజలు నమ్మకంతో ఓటేస్తారు. కానీ నాకు నేనే పరీక్ష పెట్టుకున్నాను. 2014లో పార్టీ పెట్టినప్పుడు నాకు పోటీ చేసే అర్హత లేదనుకున్నాను. ఆకలితో కడుపుమాడే పేదవాడి హృదయ వేదన అర్థం చేసుకోవడమే రాజకీయాలకు అర్హత అని భావించాను. 

ఈ ముఖ్యమంత్రి వేలు చూపించి సిద్ధం సిద్ధం అంటున్నాడు... దేనికయ్యా సిద్ధం నువ్వు? మేం కూడా సిద్ధం. ఓటేసి కింద తుంగలో తొక్కడానికి మేము సిద్ధం. నువ్వు వేలు చూపించి ఎవడ్ని బెదిరిస్తున్నావు? నేను సినిమాల్లో వేలు చూపించే ఫొటోలకు పోజులివ్వడానికే ఆలోచిస్తాను... అలాంటిది ఈయన సిద్ధం అంటే మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు. నేను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ ఫ్యాక్షన్ మూకలను ఎదుర్కొంటున్నాను" అంటూ పవన్ పేర్కొన్నారు. 

నాడు తనను హోటల్ లో నిర్బంధించినప్పుడు... యావత్ విశాఖ మొత్తం తరలివచ్చి నోవోటెల్ వద్ద నిలిచిందని వెల్లడించారు. ఒక మహిళ తన నాలుగేళ్ల బిడ్డను చంకనెత్తుకుని వచ్చిందని, దోమలు కుడుతున్నా ఆమె నిలబడి, నా అన్న కోసం వచ్చాను అన్నప్పుడు నా గుండె కదిలిపోయిందని తెలిపారు. ఆమె కేవలం నాకోసమే వచ్చినట్టు కాదు... ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చినట్టు అని స్పష్టం చేశారు. 

ఇంకోసారి వైసీపీ అరాచకాన్ని భరించే ఓపిక ఏపీకి లేదని... ఈ ఎన్నికలతో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని పవన్ పిలుపునిచ్చారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...