Jump to content

Jagan using my father to just blame pk.. moddu gadda daughter


Recommended Posts

Posted

Mudragada Padmanabham: ముద్రగడకు షాకిచ్చిన కూతురు క్రాంతి.. జగన్ వాడుకుంటున్నాడంటూ సంచలన వీడియో విడుదల  

03-05-2024 Fri 10:49 | Andhra
  • పవన్ ను తన్ని తరిమేస్తానని తన తండ్రి అనడం కరెక్ట్ కాదన్న క్రాంతి
  • ఆయన ప్రకటన ఆయన అభిమానులకు కూడా నచ్చలేదని వ్యాఖ్య
  • ముద్రగడను జగన్ వాడుకుని వదిలేస్తారన్న క్రాంతి
 
Mudragada Padmanabham daughter releases video

కాపు నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ... ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు. వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ ను తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. 

ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక  వీడియో విడుదల చేశారు. 

"అందరికీ నమస్కారం. నేను క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో వపన్ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ ను ఓడించి... పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానుకు కూడా నచ్చలేదు. 

వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్ గారని, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కల్యాణ్ గారిని తిట్టడానికి జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్ కల్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా" అని ఆమె వీడియో ద్వారా వెల్లడించారు.

Posted

He was supposed to get one Mla seat for his son and an MP seat for himself… oorike late chesi emi lekundaa poyaadu.. I doubt he will get anything in return for his campaigning other than the bad name in kapus 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...