psycopk Posted May 12, 2024 Report Posted May 12, 2024 APSRTC ఓటు వేసేందుకు వస్తున్న వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు... బుకింగ్ కోసం ప్రత్యేక నెంబరు ఓటు వేసేందుకు వస్తున్న వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు... బుకింగ్ కోసం ప్రత్యేక నెంబరు12-05-2024 Sun 18:50 | Andhra ఏపీలో రేపు ఎన్నికలు పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి తరలి వస్తున్న ఓటర్లు ప్రయాణికుల కోసం చర్యలు తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ ఏపీలో సోమవారం నాడు (మే 13) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులు ఓటు వేసేందుకు భారీగా తరలివస్తున్నారు. వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ ను ఏర్పాటు చేసింది. స్వస్థలాలకు చేరుకునే ఓటర్ల కోసం స్పెషల్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బస్సులను ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని ఎపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. 40 మంది, అంతకుమించి ప్రయాణికులు కలిసి బస్సును బుక్ చేసుకోవచ్చని వివరించింది. అందుకోసం ప్రత్యేకంగా 99591 11281 ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ పేర్కొంది. Quote
psycopk Posted May 12, 2024 Author Report Posted May 12, 2024 Chandrababu: ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు ఫోన్ 12-05-2024 Sun 18:28 | Andhra ఏపీలో రేపు పోలింగ్ పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తున్న ఓటర్లు బస్సుల కొరత ఉండరాదన్న చంద్రబాబు స్పెషల్ బస్సులు వేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తి టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఫోన్ చేశారు. ఏపీలో రేపు పోలింగ్ జరగనున్నందున, సొంతూళ్లలో ఓటు వేసేందుకు ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారని, వారి కోసం స్పెషల్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు ఎన్నికల కోసం స్వస్థలాలకు వస్తున్నారని, అదనపు బస్సులు నడపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి జిల్లాలకు స్పెషల్ బస్సులు వేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తి చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.