psycopk Posted May 13, 2024 Report Posted May 13, 2024 Sajjala Ramakrishna Reddy: ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారు.. ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తింది: సజ్జల 13-05-2024 Mon 21:12 | Andhra ఏపీలో నేడు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదన్న సజ్జల ఇది సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమేనని వ్యాఖ్య ఏపీలో ఇవాళ జరిగిన పోలింగ్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీ నేతలు పోలింగ్ సరళిపై సంతోషం వ్యక్తం చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు. ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారని, గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదని తెలిపారు. సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమే, ఇవాళ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందని అభివర్ణించారు. ఓటింగ్ పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారని, ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారని సజ్జల వివరించారు. టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మలేదని అన్నారు. పేద ప్రజల అభివృద్ధే తమ అజెండా అని, పేదల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని స్పష్టం చేశారు. కాగా, ఇవాళ పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు ఉదయం నుంచి అరాచకాలకు తెరలేపారని, చిత్తూరు జిల్లాలో కత్తిపోట్లకు దిగారని... పీలేరు, సత్తెనపల్లి, అద్దంకిలో టీడీపీ కార్యకర్తలు, గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారని సజ్జల ఆరోపించారు. టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేయడమే కాకుండా, ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారని... అయితే, వైసీపీ శ్రేణులు ఎక్కడా నియంత్రణ కోల్పోలేదని, వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించారని వెల్లడించారు. Quote
Anta Assamey Posted May 13, 2024 Report Posted May 13, 2024 Thank You for Helping Jagan Anna all the way Sajjala uncle... Quote
psycopk Posted May 13, 2024 Author Report Posted May 13, 2024 Devineni Uma: వీటి గురించి చెప్పలేదేం సజ్జలా!: దేవినేని ఉమా 13-05-2024 Mon 22:06 | Andhra ఇవాళ ప్రభుత్వ సానుకూల ఓటు వెల్లువెత్తిందన్న సజ్జల టీడీపీ శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయని ఆరోపణలు వైసీపీ వాళ్లు ఇవాళే ఏమేం చేశారో ఏకరవుపెట్టిన దేవినేని ఉమా సజ్జల సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు పేదలకు సీఎం జగన్ చేసిన సంక్షేమం ఇవాళ ఓటు రూపంలో పోటెత్తిందని, సానుకూల ఓటుతో ప్రజలు పోలింగ్ కేంద్రాలను ఉప్పెనలా ముంచెత్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం తెలిసిందే. ఉదయం చిత్తూరు జిల్లాలో కత్తిపోట్లతో మొదలుపెట్టి టీడీపీ శ్రేణులు ఇవాళ్టి పోలింగ్ లో పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డాయని అన్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీలపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. రేపు కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారి, ఇంకా బడాయి కబుర్లు చెబుతున్నారని, నంగనాచిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. "సజ్జల, జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి... మీ ఖేల్ ఖతం! మీ దుకాణం బంద్! బేలగా మాట్లాడడం మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి. ఇంకా ప్రజలను నమ్మించాలని సజ్జల ప్రయత్నిస్తున్నారు. ఇవాళ సజ్జల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ ఉదయం చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని బూరగమంద గ్రామంలో పోలింగ్ ఏజెంట్లను ఎత్తుకెళ్లిపోయారు. మీ దుర్మార్గాలకు, మీ పాపాలకు, మీ మాట విన్నందుకు అక్కడ ఎస్సై సస్పెండ్ అవుతున్నాడు. మాచర్ల నియోజకవర్గంలో ఇవాళ మీరు ఎన్ని అరాచకాలు, దుర్మార్గాలు, దాడులు చేశారో తెలుసా? చివరికి మీ ఎమ్మెల్యే అభ్యర్థిని గృహనిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది. ఉరవకొండ 129వ బూత్ లో మీ వాళ్లు పోలింగ్ అధికారులతో గొడవకు దిగారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో మా ఏజెంట్లపై మీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కడప జిల్లా చాపాడు మండలంలో ఉలవలూరు గ్రామంలో పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్లను బయటికి లాగి మీరు చేసిన అరాచకాలను చెప్పలేకపోయావా సజ్జలా? శ్రీశైలం 4, 5 పోలింగ్ కేంద్రాల్లో మీ నేతలు చేసిన అరాచకాలు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో బ్యాలెట్ విషయంలో మీరు చేసిన అరాచకాలు, పల్నాడు జిల్లా గురజాల, దాచేపల్లి మండలంలో పోలింగ్ బూత్ ల వద్ద మీ కార్యకర్తల దాడులు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో టీడీపీ కార్యకర్తలపై మీ నాయకులు దాడులు, ఉరవకొండ నియోజకవర్గం పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో 178వ బూత్ లో మీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి పోలింగ్ ప్రక్రియను ఆపడం... ఇందాక వీటి గురించి మాట్లాడలేదేం సజ్జలా? నెల్లూరు జిల్లా కమ్మవారి గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని ఆ ఊరి వాళ్లు పోలింగ్ నే బహిష్కరించారు. సజ్జల ఇంకా సిగ్గులేకుండా అభివృద్ధి గురించి, ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు" అంటూ దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.