psycopk Posted May 14, 2024 Report Posted May 14, 2024 Varla Ramaiah: ఇది రాజకీయ ఆర్థిక కుట్ర... ఈసీ వాళ్లిద్దరిపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య 14-05-2024 Tue 20:01 | Andhra ఇప్పటికిప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన అవసరమేంటన్న వర్ల రామయ్య ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపణ దీనిపై చంద్రబాబు ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాశారని వెల్లడి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్బిఐ నుంచి రూ.4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకువచ్చిందని, ఆ డబ్బును జగన్ రెడ్డి తన బినామీ కాంట్రాకటర్లకు దోచిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. ఇంతటి రాజకీయ ఆర్థిక కుట్రలో భాగ్యులైన సీఎస్ జవహర్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ...”ఏపీఎండీసీ ద్వారా వచ్చిన రూ.7 వేల కోట్లు, ఇప్పుడు కొత్తగా తీసుకున్న రూ.4 వేల కోట్లను జగన్ తన సొంత, బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలనే దుర్మార్గపు ఆలోచన ఇది. సీఎస్ జవహర్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలు ఇద్దరూ కుమ్మక్కై రాజకీయ ఆర్థిక కుట్రకు పాల్పడుతున్నారు. ఇది ఆర్థిక నేరం. ప్రైవేటు ఆసుపత్రులకు రావాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. పంచాయతీ రాజ్ ఛాంబర్‌కు రావల్సిన సుమారు రూ.8 కోట్లు ఇంతవరకు ఇవ్వలేదు. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు చెల్లించలేదు. పోలీసులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏం తొందర వచ్చిందని హుటాహుటీన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పుడు చెల్లిస్తున్నారు? పద్ధతి ప్రకారం కాకుండా సొంత కాంట్రాక్టర్లను ఏరికోరి వారికే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ రాజకీయ ఆర్థిక కుట్రలో భాగస్తులైన సీఎస్ జవహర్ రెడ్డిని, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై గవర్నర్ గారికి మా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రేపు గవర్నర్‌ను కలిసి జగన్ రెడ్డి ప్రభుత్వం పన్నుతున్న కుట్రపై ఫిర్యాదు చేస్తాం” అని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్యతో పాటు మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరి అఖిల్ తదితరులు ఉన్నారు. Quote
psycopk Posted May 14, 2024 Author Report Posted May 14, 2024 Chandrababu: జగన్ చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు... అడ్డుకోండి!: గవర్నర్ కు చంద్రబాబు లేఖ 14-05-2024 Tue 19:39 | Andhra నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లిస్తున్నారన్న చంద్రబాబు దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి బటన్లు నొక్కిన పథకాలను ఇప్పటిదాకా ఎందుకు విడుదల చేయలేదంటూ ఆగ్రహం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని... దీనిని తక్షణమే నిలుపుదల చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నేడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని చంద్రబాబు వెల్లడించారు. ఎన్నికల కోడ్ కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కు ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమకాలేదో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని చంద్రబాబు గుర్తు చేశారు. "అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్ కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించింది. రుణాల కింద తెచ్చిన రూ.4 వేల కోట్లు, బాండ్ల ద్వారా రూ.7000 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. ఈ నిధులన్నీ ప్రభుత్వం ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా తమకు అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోంది. రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు, సీఎం జగన్ తన బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మీరు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. లబ్ధిదారులకు మేలు చేసే డీబీటీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలి" అంటూ చంద్రబాబు తన లేఖలో గవర్నర్ ను కోరారు. చంద్రబాబు.... గవర్నర్ కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా ట్యాగ్ చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.