Jump to content

Recommended Posts

Posted

Raghu Rama Krishna Raju: సజ్జల కళ్లలో భయం కనపడుతోంది.. పులివెందుల కూడా టైట్ గా ఉంది: రఘురామకృష్ణరాజు 

17-05-2024 Fri 17:08 | Andhra
  • వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్న రఘురాజు
  • కూటమికి 150 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్య
  • పులివర్తి నానిపై దాడిని ఖండించిన రఘురాజు
 
No wonder if Kutami gets more than 150 seats says Raghu Rama Krishna Raju

వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఉండి అభ్యర్థి, ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఓటమి భయంతోనే పల్నాడు, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని చెప్పారు. సజ్జలతో పాటు వైసీపీ నేతల కళ్లలో భయం కనపడుతోందని వ్యాఖ్యానించారు. నోరు అబద్ధం చెప్పినా, కళ్లు అబద్ధం చెప్పవని అన్నారు. కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని తాను ఇంతకు ముందే చెప్పానని... ఆ సంఖ్య 150 సీట్లు దాటినా తాను ఆశ్చర్యపోనని చెప్పారు. గతంలో జగన్ కు 110 వస్తాయని అనుకుంటే 151 వచ్చాయని... దీన్ని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదని అన్నారు. ఈ మెజార్టీని జగన్ కూడా ఊహించలేక పోయారని చెప్పారు. 

ఉద్యోగుల ఓటింగ్ 85 శాతం పడిందని చెపుతున్నారని... అన్ని వర్గాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని రఘురాజు తెలిపారు. పులివెందులే టైట్ గా ఉందంటే... ఇక ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని ఖండించారు. నానిని పరామర్శించేందుకు వెళ్లారు.

Posted

Devineni Uma: ఐప్యాక్ ఆఫీసులో జగన్ చెప్పిన మాటలు పనిచేయలేదు... అందుకే సజ్జల మళ్లీ మీడియా ముందుకొచ్చాడు: దేవినేని ఉమా 

17-05-2024 Fri 17:27 | Andhra
  • నిన్న విజయవాడలో ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం జగన్
  • 151కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22కి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తున్నామని ధీమా
  • అయితే జగన్ మాటలు వైసీపీ శ్రేణులకు ధైర్యాన్ని కలిగించలేకపోయాయన్న ఉమా
  • సజ్జల ఈ ఉదయం మళ్లీ గోబెల్స్ ప్రచారం చేయడానికి వచ్చాడని విమర్శలు
  • 40 మంది మంత్రుల్లో ఒక్కరూ తాము గెలుస్తామని ధైర్యంగా చెప్పడంలేదని ఎద్దేవా
 
Devineni Uma slams Sajjala and other YCP leaders

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న విజయవాడ ఐప్యాక్ కార్యాలయంలో చెప్పిన మాటలేవీ వైసీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించలేకపోయాయని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ మాటలు పనిచేయకపోడంతో ఈ ఉదయం ఆంధ్రా గోబెల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చాడని పేర్కొన్నారు. 

నాడు పార్లమెంటు భవనాన్ని హిట్లర్ ఎలా తగలబెట్టుకుని ప్రతిపక్షాలపై ఆరోపణలు , ఇప్పుడు గోబెల్స్ కూడా పెద్దారెడ్డి ఇంటిపై మేం దాడి చేశామని, మేం సీసీ కెమెరాలు పగులగొట్టామని అసత్యప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. 

"జగన్ మాటలను వైసీపీ శ్రేణులు నమ్మడం లేదు... అందుకే వైసీపీ క్యాడర్ కాడి వదిలేసింది. నాయకులు, కార్యకర్తలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రేమో విదేశాలకు వెళ్లిపోతున్నాడు, మీ నాయకుల తాలూకు కంపెనీల వాహనాల బయటి రాష్ట్రాలకు, బయటి దేశాలకు పంపించేసుకుంటున్నారు. అందుకు చిత్తూరు జిల్లాలో పీఎల్ఆర్ కంపెనీ వాహనాలు ఎక్స్ పోర్ట్ అవుతుండడమే నిదర్శనం. ఎవర్ని నమ్మించాలని సజ్జలా... ఇవాళ మళ్లీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు? 

కేఏ పాల్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో, నిన్న జగన్ మాటల్లో ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉంది! కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ కొంప ముంచింది. మీ ప్రచార పిచ్చి, మీ ఫొటోల పిచ్చి... తాతముత్తాలు ఇచ్చిన భూములను కొట్టేయాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్లు అయ్యాయి. 

ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. దాని ఫలితమే జనసునామీ... అందుకే మీకు చెవులు గింగుర్లెతుత్తున్నాయి... దాంతో రోజుకొకరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మొదటి క్యాబినెట్ లో కానీ, రెండో క్యాబినెట్ లో కానీ... 40 మంత్రుల్లో ఒక్కడు కూడా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తున్నాం అని ధైర్యంగా మాట్లాడడంలేదు... 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. 

మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తుంటే, సర్వేలు చెబుతుంటే... ఇవాళ  సజ్జల వచ్చి ఏ నాయకుడ్ని నమ్మిద్దామని, ఏ కార్యకర్తను నమ్మిద్దామని మళ్లీ బురద చల్లే కార్యక్రమం చేస్తున్నాడు? సిగ్గుందా అని అడుగుతున్నా? 

ఈసీ మీద, టీడీపీ మీద, ఎన్డీయే కూటమి మీద సజ్జల బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. భయం కళ్లలో కనిపిస్తోంది, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లండన్ వెళ్లి తిరిగొస్తాడో, లేదో అనే అనుమానం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో కనిపిస్తోంది. 

సజ్జల భార్గవరెడ్డి పోలింగ్ అయిపోయిన 24 గంటల్లో పక్క రాష్ట్రానికి జెండా ఎత్తేశాడు. మొత్తం వైసీపీ సోషల్ మీడియా దుకాణం బంద్ అయిపోయింది. సజ్జలా... నీ కొడుకే ఇప్పుడు జెండా ఎత్తేశాడు! కానీ నిన్నటి మాటలతో కార్యకర్తలు, నేతల్లో ఆత్మవిశ్వాసం కలగకపోవడంతో, మళ్లీ ఇవాళ సజ్జల వచ్చి మీడియా ముందు అబద్ధాలు చెబుతున్నారు. 

రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు, కీలక స్థానాల్లో బాధ్యత కలిగిన అధికారులను నియమించకపోవడానికి సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆంజనేయులు, రఘురామిరెడ్డి, ధనంజయరెడ్డి, జవహర్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ఊతమిస్తున్నారు. వీళ్ల మాటలు విని జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడాలని ఏ అధికారులైతే తప్పుచేస్తున్నారో వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

ఆర్థిక శాఖలో సత్యనారాయణ కూడా పరిధి మంచి వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మీరు చేసిన పనులన్నీ సమీక్షించడం జరుగుతుంది. తప్పుచేసిన వాళ్లు జైళ్లపాలవుతారు. 

ఎక్కడ రాజంపేట... ఎక్కడ అనంతపురం జిల్లా... డీఎస్పీ చైతన్య దివ్యాంగుడిపై దాడి చేయడం దారుణం. దివ్యాంగుడు కిరణ్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. డీఎస్పీ చైతన్యను ఎందుకు సస్పెండ్ చేయకుండా సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ ఎందుకు కాపాడుతున్నారు? 

వైజాగ్ లో ఓటేయలేదని ముగ్గురిపై దాడి చేసి వాళ్ల తలలు పగులగొట్టారు. ఇవాళ్టికి కూడా మీ దుర్మార్గాలు ఆగడంలేదు. సజ్జలా, జవహర్ రెడ్డి, పోలీసుల అధికారులూ దీనికి ఏం సమాధానం చెబుతారు?" అంటూ దేవినేని ఉమా నిప్పులు చెరిగారు.

Posted

Why this kolevari anna ? TDP or Ycheap can't change results kadha now. Of course entertainment and betting babas ki thappa no use. Inkoka 2 days lo marchipotharu janaalu until results 

Posted
2 minutes ago, chintumintu1 said:

Oka survey/exit poll data ledu. Ani Poompuhar matalu.

0IccWU.gif

But already inside vache vuntai party head la ki 

Posted

Bonda Uma: జ‌గ‌న్‌కు టీడీపీ నేత బొండా ఉమ స‌రికొత్త స‌వాల్‌! 

17-05-2024 Fri 16:38 | Andhra
  • ఒకవేళ కూటమి గెలిస్తే.. జ‌గ‌న్ వైసీపీని మూసేస్తాన‌ని ప్ర‌క‌టించాలంటూ బొండా ఉమ డిమాండ్‌
  • ప‌రాజయం త‌ప్ప‌ద‌నే భ‌యం బొత్స, పెద్దిరెడ్డి ముఖాల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోందంటూ టీడీపీ నేత‌ చుర‌క‌లు
  • వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు త‌ప్పితే ఇంకెవ‌రూ బాగుప‌డ‌లేద‌ని ధ్వ‌జం  
 
TDP Leader Bonda Uma fires on YSRCP

ఏపీలో ఎన్నిక‌లు ముగియ‌డంతో ఇప్పుడు అంద‌రీ దృష్టి జూన్ 4వ తేదీన వ‌చ్చే ఫ‌లితాల‌పై ఉంది. ఈ నేప‌థ్యంలో అధికార వైసీపీ, కూటమి పార్టీలు త‌మ విజ‌యం ప‌ట్ల ధీమాగా ఉన్నాయి. ఎవ‌రికి వారే త‌మ‌దే విజ‌యం అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత బొండా ఉమ తాజాగా వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. 

ఈసారి త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్న సీఎం జ‌గ‌న్‌.. ఒకవేళ కూటమి గెలిస్తే వైసీపీని మూసేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించాల‌ని స‌వాల్ చేశారు. ప‌రాజయం త‌ప్ప‌ద‌నే భ‌యం ఆ పార్టీ కీల‌క నేత‌లైన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి ముఖాల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని బొండా ఉమ చుర‌క‌లంటించారు. ఇక వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు త‌ప్పితే ఇంకెవ‌రూ బాగుప‌డ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...