psycopk Posted May 17, 2024 Report Posted May 17, 2024 Sajjala Ramakrishna Reddy: గెలుస్తామని చంద్రబాబు చెప్పలేక పోతున్నారు.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని సీట్లు వైసీపీవే: సజ్జల 17-05-2024 Fri 16:18 | Andhra చంద్రబాబు పూర్తిగా నెగెటివ్ క్యాంపెయిన్ చేశారన్న సజ్జల ల్యాండ్ టైట్లింగ్ పై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపాటు వైసీపీ ఓడిపోతుందనే భ్రమలో టీడీపీ ఉందని ఎద్దేవా ఓటమి సరళిని చూసి దాన్ని ప్రజా వ్యతిరేక ఓటు అనుకోవద్దని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ఎన్నిల్లో వైసీపీ విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని... గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పూర్తిగా నెగెటివ్ క్యాంపెయిన్ చేశారని... ఆయనపై ఆయనకే నమ్మకం లేదని అన్నారు. కుప్పంలో కూడా వైసీపీ గెలవబోతోందని చెప్పారు. కుట్రపూరితంగానే కొందరు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించారని విమర్శించారు. జగన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని సజ్జల విమర్శించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో సీసీటీవీలను పోలీసులు ధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు చేసిన దాడిపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పారు. పోలింగ్ రోజున టీడీపీ అక్రమాలకు పాల్పడిందని... కౌంటింగ్ రోజున అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పటికైనా ఈసీ తన తప్పును సరిదిద్దుకుంటే మంచిదని చెప్పారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలింగ్ శాతం పెరిగితే వైసీపీ ఓడిపోతుందనే భ్రమలో టీడీపీ ఉందని... వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని సజ్జల చెప్పారు. ప్రజలు నమ్మడం లేదనే చంద్రబాబు సూపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదని... వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించే మాట్లాడారని... తాను చేసే మంచి గురించి మాట్లాడలేదని విమర్శించారు. జగన్ మాత్రం తాను చేసిన సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని అడిగారని చెప్పారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ-ఆఫీసును అప్ గ్రేడ్ చేస్తుంటే... రికార్డులను మాయం చేస్తున్నారని గవర్నర్ కు పిచ్చిపిచ్చి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని సీట్లు వైసీపీవేనని ధీమా వ్యక్తం చేశారు. Quote
Android_Halwa Posted May 17, 2024 Report Posted May 17, 2024 CBN after 2019 Election Day….as it is..same to same sollu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.