nuvvu_naakina_paalem Posted June 3, 2024 Report Posted June 3, 2024 8 minutes ago, psycopk said: Hema: సినీ నటి హేమకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ 03-06-2024 Mon 22:30 | Entertainment జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచిన సీసీబీ అంతకుముందు, రేవ్ పార్టీపై వివిధ కోణాల్లో విచారణ తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ మీడియాపై ఆగ్రహం బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్ లోని జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని విధించారు. అంతకుముందు రేవ్ పార్టీ గురించి సీసీబీ పోలీసులు ఆమెను వేర్వేరు కోణాల్లో విచారించారు. ఐదుగురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించి, జడ్జి ఎదుట హాజరుపరిచారు. మీడియాపై హేమ చిందులు వైద్య పరీక్షల అనంతరం హేమను పోలీసులు బయటకు తీసుకువచ్చిన సమయంలో ఆమె మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఇప్పుడే తనను ఇక్కడకు (ఆసుపత్రికి) తీసుకు వచ్చారన్నారు. పరీక్షల కోసం తన హెయిర్, యూరిన్, నెయిల్ (వెంట్రుకలు, మూత్రం, గోళ్లు) శాంపిల్స్ ఇప్పుడే తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రగ్స్ కేసులో తన శాంపిల్స్ ఇదివరకు తీసుకోకపోయినా మీడియా ఎలా నిర్ధారిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. Ivanni nekundhuku thaatha? Ne personal family gurinchi choosko chalu Quote
psycopk Posted June 6, 2024 Author Report Posted June 6, 2024 Manchu Vishnu: 'మా' నుంచి నటి హేమను సస్పెండ్ చేస్తున్నాం: మంచు విష్ణు 06-06-2024 Thu 16:37 | Entertainment పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అందుకే హేమను సస్పెండ్ చేస్తున్నట్లు మంచు విష్ణు వెల్లడి క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టీకరణ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమను 'మా' సస్పెండ్ చేసింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమను సస్పెండ్ చేసే అంశంపై నిన్న సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు 'మా' సభ్యులకు సమాచారం అందించారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీసు ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హేమకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హేమ ప్రాథమిక సభ్యత్వం రద్దు బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని 'మా' సెక్రటరీ రఘుబాబు తెలిపారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందన్నారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మా అసోసియేషన్ నుంచి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. Quote
psycopk Posted June 14, 2024 Author Report Posted June 14, 2024 Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ 14-06-2024 Fri 16:35 | Entertainment రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నటి హేమ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రముఖ సినీ నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆమె విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను సీసీబీ కోర్టుకు అందించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆమె ఈరోజు విడుదలయ్యారు. Quote
kevinUsa Posted June 14, 2024 Report Posted June 14, 2024 41 minutes ago, psycopk said: Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ 14-06-2024 Fri 16:35 | Entertainment రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నటి హేమ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రముఖ సినీ నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆమె విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను సీసీబీ కోర్టుకు అందించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆమె ఈరోజు విడుదలయ్యారు. Bro oka doubt was she involved in the chex thing or drugs thing Quote
psycopk Posted June 14, 2024 Author Report Posted June 14, 2024 2 hours ago, kevinUsa said: Bro oka doubt was she involved in the chex thing or drugs thing both aaite emana problem aa.. Quote
bulreddy Posted June 14, 2024 Report Posted June 14, 2024 5 minutes ago, psycopk said: both aaite emana problem aa.. neeku happy ne kada samara. Quote
Mediahypocrisy Posted June 14, 2024 Report Posted June 14, 2024 3 hours ago, kevinUsa said: Bro oka doubt was she involved in the chex thing or drugs thing Danitho evadu chex chestadu bayya...60+ untadi ...anta makeup, coverup... Cine aspirant ni trap chesi chances Ani supply chestadi Ani talk..pimp Quote
kevinUsa Posted June 14, 2024 Report Posted June 14, 2024 2 hours ago, psycopk said: both aaite emana problem aa.. Nee face lo dogs leg up Quote
psycopk Posted September 13, 2024 Author Report Posted September 13, 2024 Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసుల చార్జ్‌షీట్.. నిందితుల్లో నటి హేమ 13-09-2024 Fri 06:27 | Entertainment మూడు నెలల క్రితం బెంగళూరు శివారులోని ఫాంహౌస్‌లో రేవ్‌పార్టీ దాడిచేసి 88 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు పార్టీలో పాల్గొన్న హేమ సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నారంటూ పోలీసుల చార్జ్‌షీట్ ఇదే కేసులో గతంలో అరెస్ట్ అయిన నటి హేమ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ పేరు మరోమారు వెలుగులోకి వచ్చింది. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఆమెతోపాటు పార్టీలో పాల్గొన్న మరో 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బెంగళూరు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు నిన్న 1,086 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ అభియోగ పత్రంలో ప్రతి నిందితుడి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్. వాసు యాజమాన్యంలోని ‘విక్టరీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ’ మూడు నెలల క్రితం బెంగళూరు శివారులోని హెబ్బగోడి జీఎం ఫాంహౌస్‌లో కంపెనీ తొలి వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అయితే, ఈ వేడుకను కాస్తా అది రేవ్ పార్టీగా మార్చేసిందని పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. పార్టీకి హాజరైన వారిలో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇదే కేసులో గతంలో అరెస్ట్ అయిన హేమకు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ కూడా విధించింది. ఆ తర్వాత కొన్ని షరతులతో ఆమెకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో జూన్ 14న బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. Quote
psycopk Posted September 13, 2024 Author Report Posted September 13, 2024 Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు.. పోలీసుల చార్జ్‌షీట్‌కు భిన్నంగా నటి హేమ స్పందన 13-09-2024 Fri 07:25 | Entertainment బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల చార్జ్‌షీట్ నటి హేమ సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పేర్కొన్న పోలీసులు వీడియో రిలీజ్ చేసిన హేమ చార్జ్‌షీట్‌లో తన పేరు లేనందుకు హ్యాపీగా ఉందంటూ ఇన్‌స్టా వీడియో మూడు నెలల క్రితం సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు తాజాగా కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పించారు. 1,086 పేజీలున్న ఈ చార్జ్‌షీట్‌లో టాలీవుడ్ నటి హేమతోపాటు 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే, హేమ స్పందన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆమె ఓ వీడియోను విడుదల చేస్తూ.. పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌లో తన పేరు లేదని పేర్కొనడం గమనార్హం. మీకో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానని, తన బ్లడ్ శాంపిళ్లలో డ్రగ్స్ నెగటివ్ వచ్చినట్టు తన లాయర్ ఫోన్ చేసి చెప్పారని అందులో హేమ పేర్కొన్నారు. పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారని చెప్పారని పేర్కొన్నారు. తన రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్న సంగతిని గతంలోనే మీతో పంచుకున్నానని, ఏ టెస్టులకైనా రెడీ అని అప్పుడే చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చార్జ్‌షీట్‌లో కూడా పోలీసులు అదే విషయాన్ని పేర్కొన్నారని, ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని హేమ పేర్కొన్నారు. Quote
psycopk Posted September 13, 2024 Author Report Posted September 13, 2024 Janalani yerri papalu anukuntunda… leka natti pakodi gadu maa president em pekaledu anukuntunda.. https://www.instagram.com/reel/C_0c78dgKvU/?igsh=bmw2aGpodW9leDM4 Quote
quickgun_murugun Posted September 13, 2024 Report Posted September 13, 2024 19 minutes ago, psycopk said: Janalani yerri papalu anukuntunda… leka natti pakodi gadu maa president em pekaledu anukuntunda.. https://www.instagram.com/reel/C_0c78dgKvU/?igsh=bmw2aGpodW9leDM4 Actually ee rave party sodi enti ? Quote
DaatarBabu2 Posted September 13, 2024 Report Posted September 13, 2024 31 minutes ago, psycopk said: Janalani yerri papalu anukuntunda… leka natti pakodi gadu maa president em pekaledu anukuntunda.. https://www.instagram.com/reel/C_0c78dgKvU/?igsh=bmw2aGpodW9leDM4 Madhyalo ma Anna ni erri 🌸 ni chesaru kadara 😞 Quote
psycopk Posted September 16, 2024 Author Report Posted September 16, 2024 Hema Drugs Case: పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం.. డ్రగ్స్ కేసులో మీడియాపై నటి హేమ సీరియస్! 16-09-2024 Mon 16:05 | Entertainment బెంగళూరు రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు హేమపై కేసు తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారంటూ న్యూస్ ఛానెళ్లపై హేమ మండిపాటు మళ్లీ ఇప్పుడు అదే పాత వార్తలను తీసుకువచ్చి ప్రచారం చేస్తున్నాయంటూ సీరియస్ సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన హేమ తెలుగు నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఇక ఈ కేసులో నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. అలాగే చార్జీషీట్లో ఈ రేవ్ పార్టీ నిర్వాహకులుగా తొమ్మిది మందిని చేర్చారు. అయితే తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారంటూ న్యూస్ ఛానెల్స్‌పై హేమ తాజాగా సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు గతంలో ఎలా అయితే పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయని, ఇప్పుడు మళ్లీ అదే పాత వార్తలను తీసుకువచ్చి ప్రచారం చేస్తున్నాయంటూ ఆమె మండిపడ్డారు. హేమకు పాజిటివ్ వచ్చిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మీడియాను దుయ్యబట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ తానే ఇంకా చూడలేదని చెప్పిన హేమ.. మీరు ఎలా చూశారంటూ మీడియాపై చిందులుతొక్కారు. తానే స్వయంగా మీడియా సంస్థల వద్దకు వస్తానని, వారే పరీక్ష చేయించాలని ఈ సందర్భంగా హేమ సవాల్ విసిరారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకు అయిన రెడీ అన్నారు. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం తనకు న్యాయం చేయాలన్నారు. పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమని హేమ పేర్కొన్నారు. ప్రస్తుతం హేమకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Quote
psycopk Posted September 16, 2024 Author Report Posted September 16, 2024 police lu chepinde kada channels vestundi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.