ramannar Posted May 25, 2024 Report Posted May 25, 2024 I love their beautiful family plez pray for medum hema in tough time By mistake name might have come ame family is out of all those unhealthy parties Quote
psycopk Posted May 25, 2024 Author Report Posted May 25, 2024 Manchu Vishnu: రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: మంచు విష్ణు 25-05-2024 Sat 20:28 | Both States రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో హేమ ఉందన్న బెంగళూరు పోలీసులు డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్... ఇప్పటికే ఆమెకు నోటీసులు నిజానిజాలు నిర్ధారణ చేసుకుని వార్తలు రాయాలన్న మా అధ్యక్షుడు బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా పాల్గొన్నట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించడం తెలిసిందే. ఆమె డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులు పంపించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు నటి హేమపై వస్తున్న వార్తలను ఖండించే ప్రయత్నం చేశారు. ఇటీవల డ్రగ్స్ వ్యవహారంతో కూడిన రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంచు విష్ణు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నిజనిర్ధారణ చేసుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని తెలిపారు. నేరం నిరూపితమయ్యే వరకు హేమను ఒక నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని మంచు విష్ణు స్పష్టం చేశారు. ఆమె ఒక తల్లి, ఒక భార్య... పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరించడం అన్యాయం అని పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని... హేమ తప్పు చేసినట్టు పోలీసులు కచ్చితమైన సాక్ష్యాధారాలు అందిస్తే 'మా' తగిన చర్యలు తీసుకుంటుందని మంచు విష్ణు స్పష్టం చేశారు. అప్పటి వరకు సంచలనాత్మక వార్తలను, నిరాధార వార్తలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలకు హితవు పలికారు. Quote
psycopk Posted May 25, 2024 Author Report Posted May 25, 2024 Bengaluru: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు 25-05-2024 Sat 13:25 | National ఈ నెల 27న సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు హేమ సహా 86 మందికి నోటీసుల జారీ రేవ్ పార్టీ కేసులో హైదరాబాద్‌లో ఆరో నిందితుడి అరెస్ట్ రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హేమతో పాటు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, అశీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివానీ జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏ2 నిందితుడు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు పార్టీకి హాజరైన వ్యక్తులకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు. Quote
psycopk Posted May 25, 2024 Author Report Posted May 25, 2024 https://www.instagram.com/reel/C7YTpHPJLJ0/?igsh=MWg3czMyY2NhbG5s Quote
BattalaSathi Posted May 25, 2024 Report Posted May 25, 2024 2 hours ago, psycopk said: Manchu Vishnu: రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: మంచు విష్ణు 25-05-2024 Sat 20:28 | Both States రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో హేమ ఉందన్న బెంగళూరు పోలీసులు డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్... ఇప్పటికే ఆమెకు నోటీసులు నిజానిజాలు నిర్ధారణ చేసుకుని వార్తలు రాయాలన్న మా అధ్యక్షుడు బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా పాల్గొన్నట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించడం తెలిసిందే. ఆమె డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులు పంపించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు నటి హేమపై వస్తున్న వార్తలను ఖండించే ప్రయత్నం చేశారు. ఇటీవల డ్రగ్స్ వ్యవహారంతో కూడిన రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంచు విష్ణు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నిజనిర్ధారణ చేసుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని తెలిపారు. నేరం నిరూపితమయ్యే వరకు హేమను ఒక నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని మంచు విష్ణు స్పష్టం చేశారు. ఆమె ఒక తల్లి, ఒక భార్య... పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరించడం అన్యాయం అని పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని... హేమ తప్పు చేసినట్టు పోలీసులు కచ్చితమైన సాక్ష్యాధారాలు అందిస్తే 'మా' తగిన చర్యలు తీసుకుంటుందని మంచు విష్ణు స్పష్టం చేశారు. అప్పటి వరకు సంచలనాత్మక వార్తలను, నిరాధార వార్తలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలకు హితవు పలికారు. iga maa vithnu anna rangam loki digaadu ante andaru moosukuni side ayipovalsindhe...enni maatalu annaru raa pathivratha lake pathivrathaa shiromani ayina hem@ gaarini? mee mokal manda. Quote
psycopk Posted May 25, 2024 Author Report Posted May 25, 2024 1 minute ago, BattalaSathi said: iga maa vithnu anna rangam loki digaadu ante andaru moosukuni side ayipovalsindhe...enni maatalu annaru raa pathivratha lake pathivrathaa shiromani ayina hem@ gaarini? mee mokal manda. https://www.instagram.com/reel/C7YMhs_vwhO/?igsh=MXBmNjFjdmsxcGtiZQ== Quote
psycopk Posted May 27, 2024 Author Report Posted May 27, 2024 Hema: విచారణకు డుమ్మా కొట్టిన హేమ.. టైం కావాలంటూ బెంగళూరు పోలీసులకు లేఖ 27-05-2024 Mon 12:29 | Entertainment వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానంటూ రిక్వెస్ట్ తిరస్కరించిన పోలీసులు.. మళ్లీ నోటీసుల జారీకి ప్రయత్నం హేమ సహా మొత్తం 86 మందికి నోటీసులు పంపిన సీసీబీ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. రేవ్ పార్టీలో దొరికిన వారిలో డ్రగ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిన 86 మందికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం (మే 27) రోజు బెంగళూరులోని సీసీబీ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హేమ కూడా ఈ నోటీసులు అందుకున్నారు. అయితే, విచారణకు వెళ్లలేదు. దీనిపై బెంగళూరు పోలీసులకు హేమ ఓ లేఖ రాశారు. తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని, విచారణకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని పోలీసులను అభ్యర్థించారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు మరోసారి ఆమెకు నోటీసులు పంపనున్నట్లు సమాచారం. ఈ నెల 19న బెంగళూరులోని జీఆర్ ఫాంహౌస్ లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఫాంహౌస్ పై దాడి చేసి మొత్తం 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ రక్తపరీక్షలు చేయగా.. నటి హేమతో పాటు మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో వీరిని విచారించేందుకు నోటీసులు పంపించారు. Quote
psycopk Posted June 3, 2024 Author Report Posted June 3, 2024 Hema: సినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు 03-06-2024 Mon 17:39 | Entertainment హేమను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన సీసీబీ పోలీసులు మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు సినీ నటి హేమ కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీసీబీ పోలీసులు ఆమెకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి సీసీబీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వచ్చారు. నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు... రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు. Quote
psycopk Posted June 3, 2024 Author Report Posted June 3, 2024 Hema: సినీ నటి హేమకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ 03-06-2024 Mon 22:30 | Entertainment జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచిన సీసీబీ అంతకుముందు, రేవ్ పార్టీపై వివిధ కోణాల్లో విచారణ తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ మీడియాపై ఆగ్రహం బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్ లోని జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని విధించారు. అంతకుముందు రేవ్ పార్టీ గురించి సీసీబీ పోలీసులు ఆమెను వేర్వేరు కోణాల్లో విచారించారు. ఐదుగురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించి, జడ్జి ఎదుట హాజరుపరిచారు. మీడియాపై హేమ చిందులు వైద్య పరీక్షల అనంతరం హేమను పోలీసులు బయటకు తీసుకువచ్చిన సమయంలో ఆమె మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఇప్పుడే తనను ఇక్కడకు (ఆసుపత్రికి) తీసుకు వచ్చారన్నారు. పరీక్షల కోసం తన హెయిర్, యూరిన్, నెయిల్ (వెంట్రుకలు, మూత్రం, గోళ్లు) శాంపిల్స్ ఇప్పుడే తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రగ్స్ కేసులో తన శాంపిల్స్ ఇదివరకు తీసుకోకపోయినా మీడియా ఎలా నిర్ధారిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.