Jump to content

Recommended Posts

Posted

[size=14pt][b]చంద్రబాబు కాన్వాయ్ ఫై తెరాస కార్యకర్తల దాడి : చితకబాదిన తెదేపా కార్యకర్తలు[/b][/size]

[b]తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు  మెదక్ జిల్లాలో పర్యటించారు.

తెరాస కార్యకర్తలు తమ అధినేత వాహనశ్రేణిపై దాడికి పాల్పడితే ప్రతిదాడులు తప్పవని తెదేపా నేతలు హెచ్చరించారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలంలోని ప్రజ్ఞాపూర్‌కు బాబు కాన్వాయ్ చేరుకోగానే తెరాస కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  తెలంగాణ ద్రోహి చంద్రబాబు.. గోబ్యాక్.. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

దీంతో సహనం కోల్పోయిన తెదేపా కార్యకర్తలు, తెరాస కార్యకర్తలతో తలపడ్డారు.

సంస్థాగతంగా మంచిపట్టున్న తెదేపా కార్యకర్తలు తెరాస కార్యకర్తలను పట్టుకుని చితకబాదారు.

తెదేపా శ్రేణులు మరింత రెచ్చిపోకుండా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన పోలీసులు తెరాస కార్యకర్తలను తరిమికొట్టారు.[/b]

×
×
  • Create New...