psycopk Posted June 3, 2024 Report Posted June 3, 2024 Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు 03-06-2024 Mon 13:21 | Andhra పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు సుప్రీంలో పిటిషన్ విచారణ చేపట్టిన న్యాయస్థానం పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిన్నెల్లి అరెస్టుకు హైకోర్టు కల్పించిన వెసులుబాటును ఎత్తివేయాలని శేషగిరిరావు తన పిటిషన్లలో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం సహా హత్యాయత్నం చేశారని తెలిపారు. కాగా, హైకోర్టు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్కు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ముందస్తు ఉపశమనం కలిగించి ఏపీ హైకోర్టు తప్పు చేసిందని, ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అభిప్రాయపడింది. అలాగే పిన్నెల్లి కేసును ఈ నెల 6వ తేదీన విచారించి, పరిష్కరించాలని సూచించింది. Quote
psycopk Posted June 3, 2024 Author Report Posted June 3, 2024 6 minutes ago, mettastar said: Eedini arrest cheyara Two more days Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.