psycopk Posted June 4, 2024 Author Report Posted June 4, 2024 Nandamuri Balakrishna: హిందూపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ 04-06-2024 Tue 16:47 | Andhra హిందూపురంలో బాలయ్యకు వరుసగా మూడో విజయం 2014, 2019 ఎన్నికల్లోనూ బాలకృష్ణ విజయం ఈసారి వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై జయకేతనం టీడీపీ కంచుకోట అనదగ్గ హిందూపురం అసెంబ్లీ స్థానంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడోసారి కూడా విజయభేరి మోగించారు. తాజా ఎన్నికల్లో బాలయ్య తన సమీప వైసీపీ ప్రత్యర్థి టీఎన్ దీపికపై విజయం సాధించారు. 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం బాలకృష్ణ 24,629 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. బాలయ్యకు 73,362 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి దీపికకు 48,733 ఓట్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ మరో ఏడు రౌండ్ల లెక్కింపు మిగిలుంది. 2014, 2019 ఎన్నికల్లోనూ బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా, హిందూపురం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన స్వామి పరిపూర్ణానందకు 12 రౌండ్ల వరకు కేవలం 1,240 ఓట్లు వచ్చాయి. పరిపూర్ణానంద నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ పార్టీకి 123 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆయన అంచనాలు దారుణంగా తల్లకిందులయ్యాయి. Quote
sri_sri999 Posted June 4, 2024 Report Posted June 4, 2024 7 hours ago, psycopk said: So happy with the result… my state is in safe hands.. Jagan vachaka ap lo adugupettaledu anta kada thatha nevvu cbn pramana swikataniki ki potava? 1 Quote
psycopk Posted June 4, 2024 Author Report Posted June 4, 2024 Jagan: జగన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ 04-06-2024 Tue 22:44 | Andhra ఏపీలో వైసీపీ ఓటమి సీఎం పదవికి రాజీనామా చేసిన జగన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలన్న గవర్నర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో, ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం ఆయన తన రాజీనామా పత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపారు. తాజాగా, జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అయితే, నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని జగన్ ను గవర్నర్ కోరారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలతో ఎంతో గొప్పగా గెలిచిన వైసీపీ... 2024 ఎన్నికల్లో పాతాళానికి పడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, జనసేన 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. వైసీపీ 11 సీట్లతో మూడో స్థానంలో ఉంది. బీజేపీకి 8 స్థానాలు లభించాయి. Quote
psycopk Posted June 4, 2024 Author Report Posted June 4, 2024 Chandrababu: కూటమిని ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు: చంద్రబాబు 04-06-2024 Tue 22:27 | Andhra ఏపీలో టీడీపీ కూటమిదే విజయం ఏపీ గెలిచింది, ఏపీ ప్రజలు గెలిచారు అంటూ చంద్రబాబు స్పందన ఓట్ల వెల్లువతో కూటమిని ఆశీర్వదించారని వెల్లడి టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి సందేశం వెలువరించారు. "ఏపీ గెలిచింది. ఏపీ ప్రజలు గెలిచారు. ఇవాళ నా హృదయం కృతజ్ఞతాభావంతో ఉప్పొంగుతోంది. ఓట్ల వెల్లువతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆశీర్వదించిన మన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడి గెలిచాం. దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకునేందుకు కలిసికట్టుగా కృషి చేస్తాం. ఈ సందర్భంగా ఏపీ భవిష్యత్తుకు కట్టుబడి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో మా కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలను అభినందిస్తున్నాను. మా కూటమి కార్యకర్తలు, నేతల కఠోర శ్రమ, అంకితభావం ఫలితంగా ఈ చారిత్రాత్మక విజయం సాకారమైంది. చివరి ఓటు కూడా పడే వరకు వాళ్లు తెగించి పోరాడిన తీరు అద్భుతం. ఈ సందర్భంగా మా కూటమి నేతలకు, కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ చంద్రబాబు స్పందించారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయం: నారా లోకేశ్ ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం అని అభివర్ణించారు. "ఈ విజయం... చెడుపై మంచి, అబద్ధాలపై నిజాలు, అధర్మంపై ధర్మం, దుర్మార్గంపై మంచితనం, అవినీతిపై నీతి, విధ్వంసంపై అభివృద్ధి సాధించిన విజయం. ఇది ఏపీ ప్రజలకు, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిన పాలకులకు మధ్య జరిగిన యుద్ధం. చివరికి మనమే గెలిచాం" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. Quote
psycopk Posted June 4, 2024 Author Report Posted June 4, 2024 Narendra Modi: ఏపీ, ఒడిశాలలో చరిత్ర సృష్టించాం: ప్రధాని మోదీ 04-06-2024 Tue 22:00 | National 1962 తర్వాత ఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాలేదన్న మోదీ మూడోసారి గెలిచి ఎన్డీయే కూడా చరిత్ర సృష్టించిందని వ్యాఖ్య చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో గొప్ప గెలుపు సాధించామన్న మోదీ సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలన్న ప్రధాని 2014కు ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవని విమర్శ 1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదని... మరోసారి గెలిచి ఎన్డీయే చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో గొప్ప గెలుపును సాధించామన్నారు. రాష్ట్రాలలో ఎన్డీయేకు గొప్ప విజయం దక్కిందని పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో చరిత్రను సృష్టించామన్నారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమన్నారు. కశ్మీర్‌లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగిందని వెల్లడించారు. బీజేపీకి దేశ ప్రజలు అద్భుత విజయం అందించారని వ్యాఖ్యానించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రం గెలిచిందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలని పేర్కొన్నారు. మన ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూశాయన్నారు. 2014కు ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవని విమర్శించారు. తాము రాకముందు దేశ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల క్రతువులో పాల్గొన్న ప్రతి ఓటరుకూ ప్రధాని అభినందనలు తెలిపారు. పూరీ జగన్నాథుడి ఆశీస్సులతో ఒడిశాలో బీజేపీకి విజయం దక్కిందన్నారు. Quote
psycopk Posted June 4, 2024 Author Report Posted June 4, 2024 Chiranjeevi: ప్రియమైన చంద్రబాబు గారికి... అంటూ చిరంజీవి ట్వీట్ 04-06-2024 Tue 21:32 | Andhra ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అద్భుత విజయం 160కి పైగా అసెంబ్లీ స్థానాలతో విజయభేరి 21 లోక్ సభ స్థానాలు కైవసం ఏపీలో టీడీపీ, దాని మిత్రపక్షాలు అమోఘమైన రీతిలో ఎన్నికల ఫలితాలు సాధించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. "ప్రియమైన చంద్రబాబు గారికి... చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మహత్తర విజయం... మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తీసుకురాగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ గారి మీద ప్రజలు కనబర్చిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకుంటారని భావిస్తున్నాను. రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడినపెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను" అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.