andhra_jp Posted June 8, 2024 Report Posted June 8, 2024 Contribution of Eenadu Towards NTR 1983 Success Contribution of Eenadu was more than just the coverage. The paper, through its vast network, gathered information on local issues and offered inputs to NTR before he visited a place. A newspaper reporter and photographer always accompanied the actor on his campaign trail and provided colourful ground reports day after day. It was through Eenadu that pictures of NTR bathing and shaving in public spaces, sleeping outdoors and eating on the roadside became iconic. It was undoubtedly an all-out effort by Eenadu to get the man and his message to the last voter in the state.” “Ramoji and NTR were self-made men and highly egoistic individuals.” “NTR acknowledged much later that he had offered the position of chairman, State Planning Board, as well as a Rajya Sabha seat to Ramoji soon after the TDP was elected to power. But the newspaper baron had politely declined the offer.” “According to Upendra, most of the publicity material and party literature was also prepared in Ramoji Rao’s offices and printed at his presses.” Quote
andhra_jp Posted June 8, 2024 Report Posted June 8, 2024 Rift With NTR The media mogul felt NTR had become fickle and erratic, and even advised him in 1991 in an editorial to step down from party leadership and hand over the reins to young blood. ‘If NTR retires from politics, it would be good for the party, for NTR himself and for Andhra Pradesh,’ Eenadu said caustically” 1 Quote
andhra_jp Posted June 8, 2024 Report Posted June 8, 2024 G.J Reddy Behind Ramoji Rao Looks like it was kondapalli seetharamaiah who introduced Ramoji Rao to G.J Reddy G.J Reddy(గాదిరెడ్డి జగన్నాథరెడ్డి) is major shareholder in margadasi. Even Eenadu is brainchild of G.J Reddy Ramoji joined as gumasta initial days Eanadu mahcinery all belonged to G.J Reddy fianlly G.J Reddy ran away from india in 1977 as he is selling info to Russia(desha droham CIA agent) but still he is major shareholder(288 shares he holds even today) in Margadasi. G.J Reddy son U.V Reddy said his father put investments in dolphin hotels as well. Also initial investment by Ramoji and his brother Kasi Viswanatham put 20Rs when they started in 1962 Aug 31st and major shareholder was G.J Reddy 1960s Ramoji used to roam in cycle in gudivada roads and he was aimless and own village is pedaparipudi. Then it was kondapalli seetharamaiah(also in communist party) who wrote a letter for Ramoji to get introduced to GJR and he went to delhi to join as gumastha... Even Ramoji told himself wen he turned 75yrs that during 1960s he used to work as Gumastha in one malayali ad agency in delhi.. Infact GJR Reddy got that investment money from russians! Even there is rumor that Ramoji helped GJR to run away from India. https://www.sakshi.com/news/editorial/yes-my-father-only-developed-ramoji-rao-says-yuri-reddy-128080 https://www.sakshi.com/news/editorial/ramoji-rao-do-have-a-gj-reddy-127789 1 Quote
psycopk Posted June 8, 2024 Report Posted June 8, 2024 RamojiRao: రామోజీ మృతికి షూటింగ్ లు నిలిపేసి చిత్రసీమ నివాళి 08-06-2024 Sat 13:30 | Entertainment ఆదివారం సినిమా షూటింగ్ లు బంద్ నిర్మాతల మండలి ప్రకటన ఫిల్మ్ సిటీలో రామోజీ పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు అని వ్యాఖ్యానించారు. మీడియా సహా పలు రంగాల్లో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి, ప్రజలకు సేవ చేసిన ఆ మహానీయుడికి నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహాన్ని కడసారి చూసి, నివాళులు అర్పించారు. ప్రముఖ నటులు మోహన్ బాబు, నరేశ్, కల్యాణ్ రామ్, సాయికుమార్, దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కీరవాణి తదితరులు ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. కాగా, రామోజీరావు మరణంపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విచారం వ్యక్తం చేసింది. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ సంతాపం ప్రకటించింది. రామోజీరావు మృతికి సంతాపంగా ఆదివారం సినిమా షూటింగ్ లు అన్నీ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల మండలి శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. Quote
psycopk Posted June 8, 2024 Report Posted June 8, 2024 RRR: సమాధి ఎక్కడుండాలో రామోజీ రావు ముందే నిర్ణయించారు: రఘురామ కృష్ణ రాజు 08-06-2024 Sat 13:35 | Both States రామోజీ రావు మృతి పట్ల మ్మెల్యే రఘురామ కృష్ణ రాజు సంతాపం 'ఎక్స్' వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన టీడీపీ నేత వీడియోలో రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వైనం ఆర్ఎఫ్‌సీలోని ఓ ప్లేస్‌ని తన సమాధి కోసం రామోజీ ఎంపిక చేశారని వెల్లడి దాన్ని ఓ ఉద్యానవనంలా తీర్చిదిద్దారన్న ఆర్ఆర్ఆర్ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఇక రామోజీ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఫిల్మ్‌సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆయన మృతిపట్ల టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. వీడియోలో రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీ రావు ముందే నిర్ణయించారని ఆర్ఆర్ఆర్ తెలియజేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. "ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. కొన్ని నెలల క్రితం ఆయనతో రెండు గంటల పాటు మాట్లాడాను. నా జీవితంలో ఆ సమయం మరిచిపోలేనిది. తన సమాధి ఎక్కడ ఉండాలో కొన్నేళ్ల ముందే నిర్ణయించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ ప్లేస్‌ని ఎంపిక చేశారు. దాన్ని ఓ ఉద్యానవనంలా తీర్చిదిద్దారు" అని రఘురామ కృష్ణ రాజు వీడియోలో చెప్పుకొచ్చారు. Quote
psycopk Posted June 8, 2024 Report Posted June 8, 2024 Ramoji Rao Death: గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్‌లో రామోజీరావుకు నటుడు రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ నివాళి 08-06-2024 Sat 13:10 | Entertainment రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ స్పాట్‌లో రెండు నిమిషాలు మౌనం పాటించిన టీం పత్రికా రంగంపై రామోజీ చెరగని ముద్రవేశారన్న చిత్ర బృందం పత్రికా రంగంలో అడుగుపెట్టి సంచనాలు నమోదుచేసి, ఆ రంగంపై చెరగని ముద్రవేసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రముఖ నటుడు రామ్‌చరణ్, దర్శకుడు శంకర్, సునీల్, రఘు కారుమంచి, యూనిట్ సభ్యులు నివాళులు అర్పించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. రామోజీ మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర బృందం అక్కడే రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రామోజీ మరణం తీరని బాధాకరమని, ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రాంతీయ మీడియా స్వరూపాన్ని మార్చేశారు: రామ్‌చరణ్ ఈ సందర్భంగా రామ్‌చరణ్ ఎక్స్‌లో తన సంతాపాన్ని ప్రకటించారు. ఈనాడు పేపర్‌తో ప్రాంతీయ మీడియా స్వరూపాన్నే రామోజీ మార్చివేశారని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపన ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్ర నిర్మాతలకు ల్యాండ్ మార్క్ అయిందని పేర్కొన్నారు. రామోజీ తన ఆప్యాయతతో తెలుగు ప్రజలకు చేసిన విశేష కృషికి చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. Quote
psycopk Posted June 8, 2024 Report Posted June 8, 2024 Mamata Benerjee: తెలుగు మీడియా ప్రపంచానికి ఆయన ఓ దార్శనికుడు.. రామోజీ మృతిపై దీదీ ట్వీట్! 08-06-2024 Sat 12:40 | National రామోజీ రావు మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ఆయన మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న దీదీ 'ఎక్స్' వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి ఈనాడు సంస్థల అధినేత, తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఈ మేరకు రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) లో ఓ పోస్టు పెట్టారు. "ఈనాడు గ్రూప్, ఈటీవీ నెట్‌వర్క్, ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కమ్యూనికేషన్ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఆయన ఓ దార్శనికుడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మంచి పరిచయం ఉంది. ఓసారి ఫిల్మ్‌సిటీకి నన్ను ఆహ్వానించారు. ఫిల్మ్‌సిటీ సందర్శన మధురానుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని దీదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Quote
psycopk Posted June 8, 2024 Report Posted June 8, 2024 Ramoji Rao: ఆనాడు సామాన్యుడు... 'ఈనాడు' ఆయన 'మార్గదర్శి'! 08-06-2024 Sat 10:34 | Both States రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో జననం 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన 1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించిన రామోజీరావు ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం తెలుగు భాష అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన ‘తెలుగు మీడియా మొఘల్’ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు ఆయన.. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా ఎదిగారు. మీడియా సంస్థల సారధిగా ప్రజాహితాన్ని కాంక్షించారు. సామాన్యుడే అయినా అసమాన్య రీతిలో శిఖరంగా ఎదిగారు. 'అన్నదాత' మాసపత్రికను తీసుకొచ్చి రైతులకు ప్రియనేస్తంగా మారారు. మీడియా సంస్థలను పరిచయం చేసి తెలుగు వారి విశ్వాసాన్ని గెలుచుకున్నారు. చిట్‌ఫండ్ వ్యాపారంలో అడుగుపెట్టి నమ్మకానికి చిరునామా అయ్యారు. రామోజీ ఫిల్మ్‌సిటీని స్థాపించి ప్రపంచ చిత్రపటంలో తెలుగు నేలకు చోటు కల్పించారు. ఇక మాతృభాష ‘తెలుగు’ అభ్యున్నతికి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. ఎన్నో విజయగాథలు, స్ఫూర్తిదాయక కథనాలు.. ఇవన్నీ దివికేగిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జీవితంలో విజయ ప్రస్థానాలు. అనారోగ్యంతో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో రామోజీరావు జీవిత ప్రస్థానానికి సంబంధించిన విశేషాలు ‘ఏపీ7ఏఎం’ పాఠకుల కోసం ప్రత్యేకం.. తన పేరుని తానే పెట్టుకున్నారు... రామోజీరావు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో 1936, నవంబర్ 16న సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. తాతయ్య పేరునే 'రామయ్య'గా ఆయనకు పెట్టారు. అయితే బడికి వెళ్లిన రామోజీరావు తన పేరు రామోజీరావు అని మాస్టారుకు చెప్పారు. అలా రామయ్య కాస్తా రామోజీరావు అయ్యారు. మాస్టారుకి పేరు మార్చి చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ప్రతిభను చూసి మురిసిపోయారు. 1951లో ఆయన హైస్కూల్ విద్యాభ్యాసం ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా ఉన్నారు. మహాత్మాగాంధీ అంటే రామోజీరావుకు ఎంతో ఇష్టం. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన వివాహమాడారు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి దేశరాజధాని ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తర్వాత ఢిల్లీలో ఉద్యోగాన్ని మానేసి వ్యాపారరంగంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సిద్ధం చేసుకున్నారు. చిట్ ఫండ్ నేస్తం.. రైతు నేపథ్యం ఉన్న రామోజీరావు 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్‌ను నెలకొల్పారు. హిమాయత్ నగర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో సంస్థను ప్రారంభించారు. మార్గదర్శి ప్రచారం కోసం కిరణ్ యాడ్స్ పేరిట యాడ్ ఏజెన్సీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ, హైదరాబాద్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొలి యాడ్ ఏజెన్సీగా నిలిచింది. కొద్ది కాలానికే మార్గదర్శి రెండో శాఖను విశాఖపట్టణంలో నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో 113 శాఖలు, 3 లక్షలకుపైగా ఖాతాదారులు, 4100 మందికిపైగా ఉద్యోగులు, 18 వేలకుపైగా ఏజెంట్లతో చక్కటి వృద్ధిలో ముందుకు సాగుతోంది. 1969లో ‘అన్నదాత మాసపత్రిక’ ప్రారంభం రైతు కుటుంబానికి చెందిన రామోజీరావు... రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెలకువలు నేర్పేందుకు 1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించారు. ఈ పత్రిక అనతికాలంలోనే తెలుగు రైతుల మనసులను దోచుకుంది. ఆధునిక సేద్యంలో రైతుల ప్రియనేస్తంగా మారిపోయింది. ఈ పత్రిక చందాదారులకు ప్రతి ఏడాది ఒక ఉచిత డైరీని కానుకగా అందిస్తుంటారు. ఇక ఆ తర్వాతి కాలంలో విశాఖపట్నంలో డాల్ఫిన్ పేరిట హోటల్‌ను కూడా నిర్మించారు. వ్యాపార పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్, విశాఖ, ఢిల్లీల మధ్య తిరుగుతూ క్షణం తీరిక లేకుండా కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. ఈనాడు’ పత్రికకు బీజం పడింది ఇలా.. 1970 దశకంలో విజయవాడ, హైదరాబాద్‌లలోనే వార్తా పత్రిక ముద్రణ జరిగేది. విజయవాడలో తయారయ్యే పత్రిక విశాఖ చేరాలంటే మధ్యాహ్నం అయ్యేది. ఇదే విషయాన్ని నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్ వద్ద రామోజీరావు ప్రస్తావించారు. విశాఖలో పత్రికను ముద్రించాలని కోరారు. అయితే పత్రిక ప్రచురణ వ్యయ ప్రయాసలతో కూడినదంటూ ప్రసాద్ చెప్పిన సమాధానంతో రామోజీరావు ఏకీభవించలేకపోయారు. విశాఖలో తానే ఓ పత్రికను ప్రచురిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. ఓ పాత ప్రింటింగ్ మిషన్‌ను చౌక ధరకు చేజిక్కించుకుని 1974 ఆగస్టు 10న విశాఖలో ‘ఈనాడు’కు ఊపిరి పోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకెళ్లారు. అప్పటిదాకా ఉదయాన్నే పత్రిక ముఖం చూడని విశాఖ వాసులు ఈనాడు పత్రిక కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్‌ను అనతి కాలంలోనే రామోజీరావు పెంచేశారు. ఏడాది గడిచిందో లేదో... 1975, డిసెంబర్ 17న ఈనాడు రెండో ఎడిషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. పత్రిక సర్క్యులేషన్‌ను ఒక్కసారిగా 50 వేల మార్కును దాటించారు. మరో రెండేళ్లకు 50 వేల సర్క్యులేషన్‌తో విజయవాడ ఎడిషన్‌ను కూడా అట్టహాసంగా ప్రారంభించారు. ఇక నాలుగేళ్లలో పత్రిక మొత్తం సర్క్యులేషన్ లక్ష దాటించేశారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎడిషన్లతో ఈనాడు పత్రిక నడుస్తోంది. ఈనాడులో స్థానిక వార్తలకు అగ్రాసనం! ఈనాడు పత్రిక ఆవిర్భావమే అద్భుతమనుకుంటే, తనదైన శైలిలో స్థానిక వార్తలకే అగ్రతాంబూలమిచ్చిన రామోజీ, జిల్లాల వారీగా ప్రత్యేకంగా ‘టాబ్లాయిడ్’ పేరిట అనుబంధాల ప్రచురణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం తెలుగు జాతిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతగానంటే, ఆ తర్వాత వెలువడ్డ ఏ పత్రిక అయినా, జిల్లా వార్తల కోసం టాబ్లాయిడ్‌లను ముద్రించక తప్పనంతగా. ఇందులో రామోజీ ఏమాత్రం రాజీ పడలేదు. ఈ ప్రయోగం రామోజీ కీర్తిప్రతిష్ఠలను కూడా ఇనుమడింపజేసింది. జర్నలిజంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక బీడీ గోయెంకా అవార్డును సాధించిపెట్టింది. వార్తల సేకరణకే కాక పత్రిక ప్రతులను అమ్మడానికి కూడా రామోజీ ఓ ప్రత్యేక వ్యవస్థనే నిర్మించారు. ఆ వ్యవస్థే, రామోజీ వయసురీత్యా కాస్త విశ్రమిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈనాడును దిగ్విజయంగా నడిపిస్తోంది. మెరికల్లాంటి జర్నలిస్టులను తయారుచేయడానికి ఏకంగా 'ఈనాడు జర్నలిజం స్కూలు'ను నెలకొల్పి అత్యుత్తమ శిక్షణను ఇచ్చి, ఆ అభ్యర్థులను తన సంస్థలోనే ఉద్యోగులుగా తీసుకునే ఓ వ్యవస్థను రామోజీ తీర్చిదిద్దారు. సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్ స్థాపన రామోజీరావు సినీ ఇండస్ట్రీలోనూ విజయవంతమయ్యారు. నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ అవార్డులను కైవసం చేసుకున్నారు. సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్, చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్‌లను ఆయన నెలకొల్పారు. సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఈ పంపిణీ సంస్థ ఎంతో ఉపయోగపడింది. సినిమా రంగంపై రామోజీ చెరగని ముద్ర తన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ ద్వారా తెలుగు సినిమా నిర్మాణాన్ని రామోజీరావు కొత్త పుంతలు తొక్కించారు. 'స్టార్ డం' ఆధారంగా చిత్ర నిర్మాణం సాగుతున్న దశలో రామోజీ 'కథే మా హీరో' అన్న నినాదంతో చిత్ర నిర్మాణాన్ని చేసేవారు. కొన్ని సినిమాలకు వాస్తవ సంఘటనలను కూడా ఆయన ఎంచుకున్నారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఎలా పొందవచ్చో ఆయన చేసి చూపించారు. ఆయన నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించు పెళ్లాడు, ప్రతిఘటన, మయూరి, మౌనపోరాటం, పీపుల్స్ ఎన్‌కౌంటర్, అశ్వని... వంటి సినిమాలు కొత్త తరహాగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామోజీకి లాభాలను తెచ్చిపెట్టాయి. మంచి కథతో సరైన సినిమా తీస్తే ఎంతగా లాభాలు వస్తాయన్న విషయం ఆయనకు 'ప్రతిఘటన' సినిమా ద్వారా తెలిసిందని ఒక సందర్భంలో చెప్పారు. వివిధ భాషల్లో ఆయన 90కి పైగా చిత్రాలను నిర్మించారు. టీవీ రంగంలోకి అడుగిడిన రామోజీ టీవీ రంగంలోకి అడుగుపెట్టిన రామోజీరావు ఈటీవీని నాణ్యతకు మారుపేరుగా నిలిపారు. 1995, ఏప్రిల్‌లో ఈటీవీని ప్రారంభించారు. వినోద ప్రధానంగా ప్రారంభమైనప్పటికీ ఈటీవీ వార్తా ప్రసారాలకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. నానాటికి మారుతున్న సమాజ పోకడలకు అనుగుణంగా నిరంతర వార్తా ప్రసారాల కోసం ఈటీవీ-2ను కూడా ఏర్పాటు చేశారు. అనంతరం పలు భాషల్లోకి కూడా ఈ-టీవీ రంగప్రవేశం చేసింది. తెలుగు భాషలో ఏర్పాటు చేసిన వివిధ కేటగిరీల ఛానళ్లు కూడా చక్కటి ప్రజాదరణ పొందుతున్నాయి. కళాంజలి పేరిట కళాఖండాలు.. ఆదరణ పొందిన ప్రియా పచ్చళ్లు.. ఈటీవీ ప్రారంభమైన ఏడాదే రామోజీ గ్రూప్ 'కళాంజలి' పేరిట కళాఖండాల విక్రయాలను ఎగుమతి చేసే విభాగాన్ని ప్రారంభించింది. దీనికి అనుగుణంగా వస్త్ర విక్రయ దుకాణాలను ప్రారంభించింది. ఇక ప్రియా ఫుడ్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన రామోజీ ‘ప్రియా’ బ్రాండ్ పేరిట పచ్చళ్లు, వంట నూనెల ఉత్పత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ ప్రియా ఉత్పత్తులకు మంచి గిరాకీ వుంది. ‘రామోజీ ఫిల్మ్ సిటీ’కి బీజం పడిందిలా... చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆయన సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా గమనించారు. దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ నిర్మాణం దిశగా అడుగులు వేశారు. దాదాపు 1,666 ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను నిర్మించారు. 1996 అక్టోబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించారు. ఈ నిర్మాణం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకుంది. అంతేకాదు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఈ ‘సిటీ’ కొనసాగుతోంది. కింగ్ మేకర్‌గా ఉండటమే ఇష్టమట! కింగ్ గా ఉండటం కంటే కింగ్ మేకర్ గా ఉండటమే రామోజీకి ఇష్టమట. 1983లో అప్పటికే చలన చిత్ర రంగంలో మేరునగధీరుడిగా ఎదిగిన దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీ ప్రచారం కోసం ఆయన రామోజీ సహాయం తీసుకున్నారు. దీంతో టీడీపీ పక్షపాతిగా ఈనాడుపై పేరు పడిపోయింది. అయినా, వార్తల విషయంలో రామోజీ ఏనాడు రాజీ పడలేదు. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ సర్కారు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విమర్శనాత్మక వార్తలు రాశారు. అయితే అదే ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కరరావు గద్దె దింపిన సమయంలో రామోజీ... ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్, లక్ష్మీపార్వతికి ప్రాధాన్యత ఇవ్వడం, చంద్రబాబు వారితో విభేదించడం, ఆ సమయంలో ప్రజల పక్షాన నిలిచి చంద్రబాబుకి రామోజీ మద్దతుగా నిలవడం జరిగిపోయాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత కీలకంగా వ్యవహరించిన ఆయన, పదవులు తీసుకునేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఉద్యమాల్లోనూ విజేతే! ఈనాడు వేదికగా రామోజీ అక్షర యుద్ధం చేసిన సందర్భాలూ కోకొల్లలు. మద్యపాన నిషేధం ఉద్యమానికి రామోజీ వెన్నుదన్నుగా నిలిచారు. ఆ ఉద్యమం జరిగినంత కాలం ఈనాడులో కార్టూన్లు కూడా సదరు ఉద్యమానికి సంబంధించినవే. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యేదాకా ఈనాడు నిద్రపోలేదు. ఇక 1983లో రాష్ట్రంలో పెద్దల సభ శాసన మండలినే రామోజీ ఢీకొన్నారు. ‘పెద్దల గలాభా’ పేరిట తన పత్రిక రాసిన కథనంపై సభ మండిపడింది. సభకు పిలిచి సంజాయిషీ కోరాలని తీర్మానించింది. అయితే తాను రాసింది ముమ్మాటికీ సబబేనన్న భావనతో రామోజీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అరెస్ట్ కాకుండా కోర్టు ఉత్తర్వులు పొందారు. ఆ విధంగా పెద్దల సభ ఆదేశాల మేరకు తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఉట్టిచేతులతో తిప్పిపంపారు. పట్టుదల ఉన్న మనిషి! రామోజీరావులో గమనించవలసిన ముఖ్య లక్షణం ఆయన పట్టుదల. ఒక పని చేయాలని అనుకున్నాక దానిపై సమగ్రంగా చర్చించి పక్కా ప్రణాళికతో ఆయన రంగంలోకి దిగుతారు. ఇక దిగడమంటూ జరిగితే వెనకడుగు వేయడమనే సమస్యే ఉండదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా... ఆరునూరైనా దూసుకుపోవడమే ఆయన నైజం. 'మనం వెళ్లే దారిలో రాళ్లు రప్పలు, ముళ్లు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ గమ్యం చేరడమే మన కర్తవ్యం. ఆ పట్టుదలతో ముందడుగు వేస్తే విజయం నీదే' అంటారాయన. 'రాజీ' ఎరుగని రామోజీ! అవును ... రామోజీరావు డిక్షనరీలో రాజీ అన్న పదానికి చోటు లేదు. 'రాజీ అనేది ఆత్మహత్యా సదృశం వంటిది' అని ఆయన చెప్పేవారు. అందుకే, ఆయన ఇన్నేళ్ల జీవితంలో ఏ విషయంలోనూ ఎవరితోనూ రాజీ పడలేదు. ఒకానొక సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమ ఈనాడుని బ్యాన్ చేసినప్పుడు ఎదిరించి నిలిచారు. మార్గదర్శి ఫైనాన్స్ విషయంలోనూ కేసులకు ఆయన అదరలేదు. రామోజీరావులో ఉన్న గొప్ప ధైర్య లక్షణాన్ని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే అడుగిడిన ప్రతి రంగంలోనూ విజయం సాధించిన రామోజీరావు ఒక్క ‘న్యూస్ టైమ్’ ఇంగ్లిష్ పేపర్ విషయంలో మాత్రం విజయం పొందలేకపోయారు. మొత్తంగా రామోజీరావు తెలుగు చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయడమే కాక తన సంస్థల నిర్వహణ కోసం ఏకంగా కొన్ని వ్యవస్థలను నిర్మించుకొని ఆదర్శ వ్యక్తిగా నిలిచారు. వేల మందికి ప్రత్యక్ష ఉపాధి.. లెక్కనేనంత మందికి పరోక్ష ఉపాధి చేకూర్చారు. అందుకే రామోజీ యువతరానికి ముమ్మాటికీ మార్గదర్శే. విభిన్న రంగాల్లో సత్తా చాటిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇలా సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి.. అసామాన్యుడిగా ఎదిగి.. ఎందరికో ఆదర్శంగా, స్పూర్తిగా, మార్గదర్శిగా నిలిచి తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఆ మహనీయునికి.. ఆ మహావ్యక్తికీ ఏపీ 7 ఏఎం నివాళులు అర్పిస్తోంది! Quote
psycopk Posted June 8, 2024 Report Posted June 8, 2024 Ramoji Rao: ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు.. తెలంగాణ సర్కారు నిర్ణయం 08-06-2024 Sat 10:30 | Both States సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ప్రస్తుతం ఢిల్లీలో సీఎం రేవంత్ అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్‌కు సీఎస్ ఆదేశాలు మీడియా దిగ్గజం రామోజీ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.