Jump to content

గులకరాయి ఇన్సిడెంట్ లో, ఎన్ని నాటకాలు రా? పాపం చిన్న పిల్లోడిని ఇరికించాలి అని చూశారు. మరో కోడి కత్తి శీను ని తయారు చేయాలి అని చూశాడు, సైకో గాడు.


Recommended Posts

Posted

Vemula Satish: తుపాకీ గురిపెట్టి బెదిరించారు

‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై గులకరాయి విసిరి హత్యాయత్నానికి పాల్పడింది నువ్వేనని ఒప్పుకో. లేకపోతే చంపేస్తాం’ అంటూ పోలీసులు తన తలపైన తుపాకీ పెట్టి బెదిరించారని ఈ కేసులో నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

 

జగన్‌పై గులకరాయి విసిరినట్లు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు
లేకపోతే మా అమ్మానాన్నలను చంపేస్తామన్నారు
అక్కడ నేను లేనని చెప్పినా పట్టించుకోలేదు
నేరాన్ని నాపై వేసుకుంటే రూ.2 లక్షలు ఇస్తామన్నారు
రెండు రోజులు జైల్లో ఉండి, బయటకొచ్చేస్తావని చెప్పారు
అందుకు ఒప్పుకోకపోవటంతో చంపేస్తామని భయపెట్టారు
చేయని నేరానికి నన్ను బలి చేశారు
మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన గులకరాయి కేసు నిందితుడు సతీష్‌
నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదల
ఈనాడు - అమరావతి, నెల్లూరు, న్యూస్‌టుడే - నెల్లూరు నేర విభాగం

ap020624main1a.jpg

నెల్లూరులో కారాగారం ఎదుట విలేకరులతో మాట్లాడుతున్న సతీష్‌

‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై గులకరాయి విసిరి హత్యాయత్నానికి పాల్పడింది నువ్వేనని ఒప్పుకో. లేకపోతే చంపేస్తాం’ అంటూ పోలీసులు తన తలపైన తుపాకీ పెట్టి బెదిరించారని ఈ కేసులో నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ కన్నీటి పర్యంతమయ్యారు. అసలు ఆ ఘటనా స్థలంలోనే తాను లేనని ఎంత చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. నేరం చేసినట్లు అంగీకరించకపోతే మీ అమ్మానాన్నలను చంపేస్తామని హెచ్చరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో నెలా పదిహేను రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న సతీష్‌కుమార్‌ బెయిల్‌పై ఆదివారం విడుదలయ్యారు. సతీష్‌ తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ, వారి తరఫు న్యాయవాది అబ్దుల్‌ సలీం నెల్లూరు కేంద్ర కారాగారం వద్దకు వచ్చి అతణ్ని విజయవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. నెల్లూరు, విజయవాడల్లో తనను కలిసిన మీడియాతో సతీష్‌ మాట్లాడారు. ‘నువ్వే నేరం చేసినట్లు ఒప్పుకో. నీకేం కాదు. అన్నీ మేం చూసుకుంటాం. రెండు రోజులు జైల్లో ఉంటావు. తర్వాత బయటకు వచ్చేస్తావు. నేరాన్ని నీపై వేసుకుంటే రూ.2 లక్షలు ఇస్తాం అని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను అంగీకరించకపోవడంతో ఒప్పుకొంటావా? చస్తావా అంటూ తుపాకీతో బెదిరించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి.. అక్కడ నన్ను తీవ్రంగా హింసించి, బెదిరించేవారు’ అని చెప్పారు. 

ap020624main1c.jpg
జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న సతీష్‌

రాత్రి 11.30 గంటలకు లాక్కెళ్లారు

‘జగన్‌ బస్సు యాత్రకు హాజరైతే రూ.300 ఇస్తామని చెప్పటంతో నేను, స్నేహితులతో కలిసి వెళ్లాను. అజిత్‌సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ నుంచి వడ్డెర కాలనీ ఆర్చి వరకే నేను బస్సు యాత్రలో ఉన్నాను. ఆ తర్వాత ఇంటికెళ్లిపోయాను. సీఎం మీద ఎవరో రాయి విసిరారని కూడా నాకు తెలీదు. ఏప్రిల్‌ 14న నా పుట్టినరోజు కావటంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో నా స్నేహితులతో కలిసి రోడ్డుపై కేక్‌ కోశా. టపాసుల శబ్దానికి పోలీసులొచ్చి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పటంతో అందరం అక్కడి నుంచి వెళ్లిపోయాం. అదే నేను చేసిన నేరమైపోయింది. రెండు రోజుల తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో ఆరుగురు పోలీసులు మా ఇంట్లోకి చొరబడ్డారు. నీపై కేసు ఉంది.. రావాలంటూ చొక్కా పట్టుకుని లాక్కెళ్లారు. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లకుండా అంబాపురం, మంగళగిరి, 100 అడుగుల రోడ్డు ఇలా రాత్రంతా ఎక్కడెక్కడో తిప్పారు. ముఖ్యమంత్రిపై రాయి విసిరింది నువ్వేనని ఒప్పుకోవాలని బెదిరించారు. ఆ తర్వాత రెండు రోజులపాటు స్టేషన్‌లో నిర్బంధించి, తీవ్రంగా ఒత్తిడి చేశారు. చివరికి కోర్టులో పెట్టి జైలుకు పంపించారు.

ap020624main1b.jpg
ఇంటికి చేరుకున్న సతీష్‌తో న్యాయవాది సలీం


కోడికత్తి-2 చేద్దామనుకున్నారు
- అబ్దుల్‌ సలీం, సతీష్‌ తరఫు న్యాయవాది

జగన్‌పై గులకరాయితో దాడి కేసులో అమాయకుడైన వేముల సతీష్‌ను ఇరికించాలని చూశారు. తెదేపా నేతలు నారా లోకేశ్, బొండా ఉమామహేశ్వరరావుల పేర్లు చెప్పాలని అతణ్ని ఒత్తిడి చేశారు. ఈ కేసులో బాధితుణ్నని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలీసుస్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. 161 సీఆర్‌పీసీ కింద ఆయనకు ఏమైందో చెప్పాలి. చట్టం అందరికీ ఒకటే. దానికి జగన్‌ అయినా కట్టుబడి ఉండాలి. ఇప్పటి వరకు పోలీసులు జగన్‌మోహన్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయలేదు. ఇదే విషయాన్ని కోర్టులో ప్రస్తావిస్తే.. పోలీసుల దగ్గర సమాధానం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. వేముల సతీష్‌ కూలి పనులు చేసుకునే కుటుంబంలో బిడ్డ. వారిద్దరికీ ఎలాంటి విభేదాలు, ఆస్తి గొడవలు లేవు. అసత్య ఆరోపణలతో అమాయకుణ్ని ఇరికించారని కోర్టుకు తెలిపాం. కోర్టు సమ్మతించి, బెయిల్‌ మంజూరు చేసింది. రెండు రోజుల కిందటే బెయిల్‌ వచ్చినా దాన్ని రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ కొట్టేయడంతో బెయిల్‌ వచ్చి విడుదలయ్యారు. గులకరాయి కేసును కోడికత్తి-2 చేయాలని చూశారు. కానీ, పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాల్లేవు. కనీసం గులకరాయి, క్యాట్‌బాల్, ఎయిర్‌గన్‌ లాంటివీ లేవు. అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాం.


మా అబ్బాయి బయటకొస్తే చాలు
- సతీష్‌ తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ

మా అబ్బాయికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులు అనవసరంగా ఇరికించారు. జెండా పట్టుకుంటే డబ్బులు    ఇస్తామని చెబితే.. అందరం అక్కడికి వెళ్లాం. 14వ తేదీ మా వాడి పుట్టినరోజు కావడంతో.. 13వ తేదీ రాత్రి మా గూడెం సమీపంలోనే   కేక్‌ కట్‌ చేసుకున్నారు. దాంతోనే సతీష్‌పై కేసు పెట్టారు. 15వ తేదీ మాతో పనికి    కూడా వచ్చాడు. రాత్రి 11 గంటలకు పడుకుని ఉన్న మా అబ్బాయిని సొల్యూషన్‌ తాగుతున్నట్లు కేసు పెట్టారని చెప్పి తీసుకెళ్లారు.  ఆధార్‌కార్డు తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు     రావాలని చెప్పారు. అక్కడికి వెళితే ఇక్కడికి తీసుకురాలేదన్నారు. రెండు, మూడు రోజులు పిల్లాణ్ని చూపించలేదు. మమ్మల్ని కాపాడేందుకు సలీం సార్‌ను కనకదుర్గమ్మే పంపించింది. లేదంటే మేం ఇక్కడ.. మా పిల్లోడు అక్కడ చనిపోయి ఉండేవాళ్లం. కూలీనాలి చేసుకునేవాళ్లం. మా అబ్బాయిపై ఎలాంటి కేసు లేకుండా బయటకు వస్తే చాలు.


జైల్లో ప్రతిక్షణం ఏడుస్తూనే ఉన్నా

‘సీఎంపైకి గులకరాయి ఎవరు విసిరారో వారిని గుర్తించి పట్టుకోకుండా నన్ను కేసులో ఇరికించారు. నాకు ఆ ఘటనతో సంబంధం లేదని ప్రతి అధికారి వద్దా ఎంత మొత్తుకున్నా వినలేదు. రాయి విసరాల్సిన అవసరం నాకేంటి? చేయని నేరానికి నన్ను బలి చేశారు. 45 రోజుల పాటు జైల్లో నరకయాతన అనుభవించా. మా అమ్మా నాన్న గుర్తుకొచ్చి అనుక్షణం ఏడ్చేవాణ్ని. ఇప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అంటూ సతీష్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

Posted

అబ్దుల్‌ సలీం, true hero. Kodi katti Sreenu vishayam lo kooda chala fight chesi almsot 5 years tharuvatha bayataki theesukocchaadu. Cheyyani neraaniki 5 years imprisonment ante, too much

Posted
7 hours ago, southyx said:

అబ్దుల్‌ సలీం, true hero. Kodi katti Sreenu vishayam lo kooda chala fight chesi almsot 5 years tharuvatha bayataki theesukocchaadu. Cheyyani neraaniki 5 years imprisonment ante, too much

5 years ki compensation ivvali sreenu ki..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...