Jump to content

Nara chandra babu naidu ane nenu…. All hail Naidu


Recommended Posts

Posted

Amit Shah: నేడు ఏపీకి అమిత్ షా... చంద్రబాబుతో భేటీ 

11-06-2024 Tue 16:15 | Andhra
Amit Shah to meet Chandrababu today
 
  • రాత్రి తొమ్మిదిన్నరకు గన్నవరం విమానాశ్రయానికి అమిత్ షా
  • రాత్రి 10.20 గంటలకు చంద్రబాబు, అమిత్ షాల భేటీ
  • ఆ తర్వాత నోవాటెల్ హోటల్లో అమిత్ షా బస
  • చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి బండి సంజయ్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఇందుకోసం కేంద్రమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. నేటి రాత్రి 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 10.20 గంటలకు అమిత్ షా-చంద్రబాబు భేటీ కానున్నారు. భేటీ అనంతరం రాత్రి 11.20 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు.

రేపు ప్రధాని రాక

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతున్నారు. రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధాని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.55 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వేదిక వద్దకు విచ్చేస్తారు. నిన్న కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.

  • Haha 1
Posted

Gannavaram Airport: చంద్రబాబు ప్రమాణస్వీకారం.. గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు 

11-06-2024 Tue 15:20 | Andhra
Traffic restrictions in the vicinity of Gannavaram Airport
 
  • రేపు ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
  • ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖుల రాక 
  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు  

బుధవారం ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా విమాన ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు ఉదయం 9.30 గంటల లోపే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సూచించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. విమాన సర్వీసులన్నీ యథాతథంగా నడుస్తాయని తెలిపారు.

Posted

 

Chandrababu: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన చంద్రబాబు 

11-06-2024 Tue 17:24 | Andhra
Chandrababu meets AP governor
 
  • రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
  • మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసిన టీడీపీ అధినేత
  • ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పును వివరించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. టీడీపీ అధినేత... రేపు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పునకు సంబంధించి గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు.

ఉదయం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై... శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను కూటమి నేతలు గవర్నర్‌కు అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్... చంద్రబాబును ఆహ్వానించారు. 

 

Posted

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ప్రముఖులు... 7 వేల మంది పోలీసులతో బందోబస్తు 

11-06-2024 Tue 18:11 | Andhra
Tight security for Chandrababu taking oath ceremony
 
  • రేపు ఉదయం కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణం
  • మోదీ, అమిత్ షా సహా హాజరవుతున్న వీవీఐపీలు
  • ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు
  • విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు
  • పాస్‌లు ఉన్నవారి వాహనాలకే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతి

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నడ్డా, బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్‌లు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ప్రముఖులు బస చేసే హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రామకృష్ణ తెలిపారు. అమిత్ షా, బండి సంజయ్ తదితరులు ఈరోజు రాత్రికే ఏపీకి రానున్నారు.

Posted

Chiranjeevi: రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం... ప్రత్యేక విమానంలో ఏపీకి చిరంజీవి 

11-06-2024 Tue 18:40 | Both States
Chiranjeevi will attend Chandrababu taking oath ceremony tomorrow
 
  • చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్నకూతురు శ్రీజ, మనవరాళ్లు
  • బేగంపేట విమానాశ్రయం గన్నవరం బయలుదేరిన చిరంజీవి కుటుంబం
  • ప్రముఖులతో గన్నవరం విమానాశ్రయం కిటకిట

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్న కూతురు శ్రీజ, ఇద్దరు మనవరాళ్లతో కలిసి విజయవాడకు బయలుదేరారు.

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఏపీ ప్రభుత్వం విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబం ఏపీకి బయలుదేరారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం ప్రముఖులతో కిటకిటలాడుతోంది.

Posted

Amit Shah: గన్నవరం చేరుకున్న అమిత్ షా... ఘనస్వాగతం పలికిన నారా లోకేశ్

11-06-2024 Tue 22:19 | Andhra
Amit Shah reaches Gannavaram Air Port
  • అమిత్ షా వెంట వచ్చిన బండి సంజయ్, జేపీ నడ్డా
  • విమానాశ్రయంలో స్వాగతం పలికిన టీడీపీ, బీజేపీ నేతలు
  • గన్నవరం చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు. అమిత్ షా వెంట కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వచ్చారు. అమిత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

పురందేశ్వరి, సీఎం రమేశ్, సుజనా చౌదరి, సత్యకుమార్, టీజీ వెంకటేశ్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కాసేపట్లో అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. అనంతరం నోవాటెల్ హోటల్లో బస చేస్తారు.  టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా గన్నవరం చేరుకున్నారు.
20240611fr6668800320a1d.jpg  
  20240611fr6668801bd7fe0.jpg చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సింగపూర్, కొరియా కాన్సులేట్ జనరల్స్, ఇతర ప్రతినిధులు హాజరవుతున్నారు. జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ కాన్సులేట్ జనరల్స్‌కు కూడా ఆహ్వానం పంపించారు.

ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన చిరంజీవి సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి కుటుంబ సభ్యులతో వచ్చిన చిరంజీవికి, కుటుంబ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గన్నవరం చేరుకున్నారు.

Posted
Just now, Raisins_72 said:

Lokesh ki em isthunnaaru ?? panchayat and IT ?

Food C I

Posted
1 minute ago, Raisins_72 said:

Lokesh ki em isthunnaaru ?? panchayat and IT ?

i think IT.. inka official ga announce cheyaledu

  • Thanks 1
Posted

@psycopk ee background wall paper inkaaa undaaa? lekapothe malla set chepinchu...

 

Chandrababu_Naidu_during_a_meeting_at_Se

  • Like 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...