southyx Posted June 11, 2024 Author Report Posted June 11, 2024 Last time vacchinappudu YCP batch mottham gandru kukkala lekka meedha padi gola chesaaru. 1 Quote
PizzaReddy Posted June 11, 2024 Report Posted June 11, 2024 17 minutes ago, southyx said: Last time vacchinappudu YCP batch mottham gandru kukkala lekka meedha padi gola chesaaru. now those barking dogs are limited to DB Quote
southyx Posted June 11, 2024 Author Report Posted June 11, 2024 రాజా.. మిమ్మల్ని తిట్టినోళ్లంతా ఓడిపోయారు ‘సార్..మిమ్మల్ని గతంలో తిట్టిన వైకాపా మంత్రులంతా ఓడిపోయారు’ అని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పారు రజనీకాంత్‌తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి దిల్లీ విమానాశ్రయంలో రజనీకాంత్‌తో మాట్లాడుతున్న బాలశౌరి ఈనాడు, అమరావతి: ‘సార్..మిమ్మల్ని గతంలో తిట్టిన వైకాపా మంత్రులంతా ఓడిపోయారు’ అని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వస్తున్న రజనీకాంత్ దిల్లీ విమానాశ్రయంలో ఉండగా.. అక్కడికొచ్చిన బాలశౌరి గతంలో ఉన్న పరిచయంతో ఆయనను పలకరించారు. ఈ సందర్భంగా బాలశౌరి వివిధ అంశాలపై మాట్లాడుతూ ‘గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు వైకాపా మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో వారంతా ఓడిపోయారు’ అని వివరించారు. దీంతో రజనీకాంత్ చిరునవ్వుతో.. ‘మనకు నచ్చింది మనం మాట్లాడతాం.. దానికే తిడితే ఎలా? అలా తిట్టకూడదు కదా?’ అని పేర్కొన్నారు. ‘జనసేనలో చేరి మంచి పనిచేశారు. పవన్ కల్యాణ్ మంచి నాయకుడు అవుతారు’ అని ప్రశంసించారు. అప్పట్లో చంద్రబాబును పొగిడినా తట్టుకోలేక.. గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్.. తన మిత్రుడైన చంద్రబాబును ప్రశంసిస్తూ మాట్లాడారు. ‘చంద్రబాబు ఒక దీర్ఘదర్శి.. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఈ విషయం చెబుతున్నారు. చంద్రబాబు ఘనత ఏమిటో బయట వాళ్లకు బాగా తెలుసు’ అని కొనియాడారు. చంద్రబాబును పొగడటాన్ని తట్టుకోలేని అప్పటి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, రోజా తదితరులు రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. నీచాతినీచమైన వ్యక్తుల్లో రజనీకాంత్ ఒకరని కొడాలి నాని విమర్శించారు. రజనీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారని రోజా ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వారంతా ఓటమిపాలయ్యారని రజనీకాంత్‌తో బాలశౌరి చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.