Jump to content

Memu dakunaa bayataku lakochi kodutunaru… memu chesina diku malina panulu alantivi antuna kukka sai

Recommended Posts

Posted

Vijayasai Reddy: తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారు: టీడీపీపై విజయసాయి ఫైర్ 

12-06-2024 Wed 15:31 | Andhra
Vijayasai Reddy slams TDP Govt
 
  • ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఘటనలపై వైసీపీ ప్రెస్ మీట్
  • టీడీపీ పాలన దారుణంగా ఉందన్న విజయసాయి
  • యూనివర్సిటీ వీసీలపైనా దాడులు చేస్తున్నారని ఆరోపణ
  • బీసీ వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని వెల్లడి

ఏపీలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానవీయమైన ఆ సంఘటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని వివరించారు.

యూనివర్సిటీ వీసీలపైనా దండెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమి తరిమి కొడుతున్నారని ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ టీడీపీ ఏ విధంగా తగలబెడుతోందో అందరూ గమనించాలని అన్నారు. ఇవాళ రాష్ట్రం ఉన్న దుస్థితిని తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. 

"మంగళగిరిలో లోకేశ్ మనుషులు మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో వీడియోలో చూశాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు దేశానికే అవమానం. ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతోంటే కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచుకోవాలి. 

టీడీపీ పాల్పడుతున్న ఈ చర్యల్లో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ రకంగా కాపాడుతుంది? ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెడుతుంది? సాక్షి, ఎన్టీవీ, టీవీ9 వంటి మీడియా సంస్థలను కూడా అణచివేస్తున్నారు. ఎంఎస్ఓల ద్వారా ఆయా చానళ్లు ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారు. 

ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ఈ వారం పది రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. మొత్తం 27 ఘటనలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. 

Posted

Pulivarthi Nani: చంద్రబాబు ప్రమాణానికి వీల్ చెయిర్ లో వచ్చిన పులివర్తి నాని 

12-06-2024 Wed 12:13 | Andhra
TDP MLA Pulivarthi Nani Attended in Weelchair
 
  • అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో నానిపై దాడి
  • వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో గాయపడ్డ నాని
  • కాలికి పట్టీ వేసిన వైద్యులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతల దాడిలో టీడీపీ నాయకుడు పులివర్తి నాని గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయాల నుంచి నాని ఇంకా కోలుకోలేదు. అయితే, తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పులివర్తి నాని హాజరయ్యారు. కాలికి పట్టీతో వీల్ చెయిర్ లో వచ్చారు. కేసరపల్లి సభావేదిక వద్దకు పులివర్తి నాని వీల్ చెయిర్ లో వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలనకు వెళ్లారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ ను పరిశీలించి తిరిగి వస్తుండగా.. వైసీపీ శ్రేణులు నానిపై దాడికి దిగాయి. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ తెదేపా నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

Posted
23 minutes ago, psycopk said:

Evaro common man YCP MLA ni kottadu kada.. athanni kuda pilavalsindi… 

how is he doing now? Any update? 

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...