ntr2ntr Posted June 13, 2024 Report Posted June 13, 2024 బటన్ నొక్కుడుకు మాత్రమే బయటికి వచ్చి... వచ్చిన ప్రతిసారీ పరదాలు కట్టి, బారికేడ్లు పెట్టి, చెట్లు కొట్టే పాలనకు తెర పడింది. రాష్ట్రంలో మార్పు మొదలైంది. పరదాల పాలనకు స్వస్తి మితిమీరిన ఆంక్షలకు సెలవు రాజధాని ప్రాంతంలో మారిన చిత్రం బారికేడ్లు, పోలీసు పహరా మాయం జనంతో మమేకమైన ముఖ్యమంత్రి జగన్ ఫొటోలున్నా ‘స్టూడెంట్ కిట్’ పంపిణీ విద్యార్థులకు ఇబ్బంది ఉండొద్దనే! బటన్ నొక్కుడుకు మాత్రమే బయటికి వచ్చి... వచ్చిన ప్రతిసారీ పరదాలు కట్టి, బారికేడ్లు పెట్టి, చెట్లు కొట్టే పాలనకు తెర పడింది. రాష్ట్రంలో మార్పు మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు పరదాల పాలనకు తెర దించారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు ఈ విషయం స్పష్టం చేశారు. అయితే... చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా పరదాలు కట్టడం కనిపించింది. దీనిపై మంత్రి లోకేశ్ అప్పుడే స్పందించారు. ‘పరదాలు కట్టొద్దని చెప్పాం కదా’ అని ప్రశ్నించగా... ‘అలవాటులో పొరపాటు జరిగిందనే సమాధానం రావడంతో ఆయన సరదాగా నవ్వారు. ఇకపై పరదాలు, బారికేడ్లు వద్దని స్పష్టం చేశారు. ప్రజలకూ తమకూ మధ్య అడ్డంకులు వద్దని చంద్రబాబు కూడా అధికారులకు సూచించారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని, బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ సమయంలో... సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వీలైనంత తక్కువ స్థాయిలో మాత్రమే ఆంక్షలు అమలయ్యాయి. ‘ముఖ్యమంత్రి వస్తున్నారు’ అంటూ గంటల తరబడి సామాన్య భక్తులను నిలిపివేసే పరిస్థితికి తెరపడింది. ఇక... జగన్ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయం వైపు వెళ్లేందుకే ఇష్టపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కేబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మాత్రం సచివాలయానికి వెళ్లేవారు. ఆ సమయంలో... దారి పొడవునా వందలాది మంది పోలీసులను మోహరించేవారు. రాజధాని గ్రామాల్లో ఇంటికొక పోలీసును కాపలా పెట్టేవారు. వలలు, బారికేడ్లు, పరదాలు సరేసరి! అసెంబ్లీ సమావేశాలప్పుడూ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ చిత్రం మారిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానంతరం గురువారం తొలిసారి సచివాలయానికి వెళ్లిన చంద్రబాబుకు దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. ప్రజలతో ఆయన మమేకమయ్యారు. జగన్ బొమ్మ ఉన్నా ఆపొద్దు చంద్రబాబు మాట, ముద్రను జగన్ ఒక్క క్షణం కూడా సహించలేకపోయారు. ‘ప్రజా వేదిక’నే కూల్చి వేయించారు. కానీ... ఇలాంటి విద్వేషపూరిత విధానాలను తాము అమలు చేయబోమని చంద్రబాబు సంకేతాలు పంపారు. ‘విద్యా కానుక’పై జగన్ ఫొటో ఉన్నప్పటికీ పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ‘‘ఎవరి బొమ్మ ఉందనేది ముఖ్యం కాదు. విద్యార్థులు ఇబ్బంది పడకూడదు. మాజీ సీఎం జగన్ బొమ్మలున్నా ఫరవాలేదు. విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్ల పంపిణీ ఆపొద్దు’ అని స్పష్టం చేశారు. బడులు పునఃప్రారంభమైనందున విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలన్నారు. జగన్ ఫొటోలున్న పుస్తకాలు పంపిణీ చేయొద్దంటారేమోనని అధికారులు భావించారు. కానీ... ఎలా ఉన్నా కిట్లు ఇవ్వాలని, ప్రజాధనం వృథా చేయొద్దని సీఎం ఆదేశించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.