Jump to content

Recommended Posts

Posted

jagan: ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!

‘ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి.

ap280624politics1a.jpg

ఈనాడు, అమరావతి: ‘ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటికొచ్చాయి. ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయనీ మాటలు అన్నట్లు తెలిసింది. ‘నిజంగా వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది. కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి, అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది. దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటికొచ్చా. ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా, మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి. సర్వేలు చేయించాం, వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అందువల్లే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయి. వాటిని చూసినపుడు నా పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మీకూ ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను బయటికొచ్చినట్లే మీరూ ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కండి’ అని నేతలతో ఆయన అన్నారు.

  • Haha 1
  • Upvote 1
Posted

ఆ పని చేయాలసింది, ఆంధ్ర కి పట్టిన దరిద్రం వదిలేది. పోతు పోతూ నువ్వు ఇన్నేళ్లు మింగేసిన డబ్బు జనాలకి తిరిగిచ్చి వెళ్ళు.
వీడు ఇంకా వింత ప్రపంచం లో వున్నాడు. అసలు ఎవరు చెప్పారా వీడికి? సిఎం గా ఉన్నప్పుడు ఇంటిలిజెన్స్ వాళ్ళు డెయిలీ ఇన్పుట్స్ ఇవ్వారా?   మానసికంగా గట్టి దెబ్బే తగిలినట్టు ఉంది, ఇంకా ఏమి అర్ధం కవ్వడం లేదు అంటాడేంటి?

ఎందుకు ఓడామో అని నంగనాచిలా అడుగుతున్నాడు ..
1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో
2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని అడుగు ఎందుకు ఓడామో
3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
7) చనిపోయిన అబ్దుల్ సలాం ను మిస్బని, పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో
8] ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం
చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో.
10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో
11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో.
13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో
16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో.
17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
22) 5 సం||లు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో.
23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో.
24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో.
25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో.
26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో.
27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో.
28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో.
29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో.
30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో.
31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో.
32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో.
33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో.
34) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో.

.................రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది జగన్ రెడ్డి గారు............

Copied from
dayakarreddy7329.


ప్రత్యేక హోదా
పోలవరం
మద్యం నిషేధం
Free ఇసుక..
కరెంటు bill
బస్సు ఛార్జి
జాబ్ కాలెండరు
మెగా dsc..
Cps రద్దు...
Prc అమలు
అంగన్వాడీ జీతాలు...
మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్
Kadapa స్టీల్ ప్లాంట్
రోడ్లు లేవు
పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం
అగ్రీ గోల్డ్ పెండింగ్
రాజధాని లేదు
IT కంపెనీ లు లేవు
మద్యం ధరలు
ఎర్రచందనం దోపిడీ
చెత్త పన్ను,
రోడ్లు గుంతలు
గంజాయి రవాణా
కోడి కత్తి చంద్రబాబు చేసాడు
బాబాయిని చంద్రబాబు చంపాడు
 ఈ తుగ్లక్
సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో

  • Upvote 2
Posted

Ayina Jaffa..Jerusalem kada povalsindi..Himalayas enduku.. akkada kuda church ️ kadadam ani plan emo.. veeditho jagratha ga vundali..psyco gaadu..paga tho emina chestadu..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...