psycopk Posted July 11, 2024 Report Posted July 11, 2024 HOME NEWS TELUGU NEWS VIDEO NEWS MOVIE NEWS MOVIE REVIEWS ET VIDEOS PRESS RELEASES ARTICLES BHAKTI GRIEVANCES Praneeth Hanumanthu: తండ్రీకూతుళ్ల సంబంధంపై అసభ్యకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్టు 11-07-2024 Thu 07:40 | Both States బెంగళూరులో ప్రణీత్‌ను అరెస్టు చేసిన టీజీ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు, స్థానిక కోర్టులో హాజరు పరిచిన వైనం అనంతరం, నిందితుడిని హైదరాబాద్‌కు తరలింపు పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ చిన్నారి వీడియోపై అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో అతడు వీడియో చాట్ చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీనటుడు సాయిదుర్గ తేజ్ ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడుతో పాటు మరికొందరికి ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రణీత్ హనుమంతుపై చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం బెంగళూరులో ప్రణీత్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. తండ్రీకుమార్తెల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడన్న అభియోగంతో పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసులు ప్రణీత్‌ను హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.