Jump to content

Recommended Posts

Posted

Nara Lokesh: పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్.. వినతులు ఆ మెయిల్ ఐడీకి పంపాలని విన్నపం 

11-07-2024 Thu 15:30 | Andhra
Nara Lokesh requests people to send their issues to his personal mail ID
 

 

  • లోకేశ్ వాట్సాప్ కు వెల్లువెత్తుతున్న వినతులు
  • టెక్నికల్ సమస్యలతో బ్లాక్ అవుతున్న లోకేశ్ వాట్సాప్
  • మెయిల్ పంపితే సమస్యలు పరిష్కరిస్తానన్న లోకేశ్
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు [email protected] మెయిల్ ఐడీకి పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ ను 'మెటా' బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న మంత్రి లోకేశ్ వాట్సాప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని ఒక ప్రకటనలో కోరారు.

సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే నారా లోకేశ్ ప్రకటించారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తన వాట్సాప్‌కి వచ్చిన మెసేజ్ కు రియాక్ట్ అయ్యి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్‌కి వాట్సాప్ చెయ్యడం వల్ల టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. తనకు సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే హ్యాండిల్ చేసే పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] కి సమస్యలను పంపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేశ్" కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్న మంత్రి... తానే అందరి సమస్యలు నేరుగా అడ్రస్ చేస్తానని ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. మెయిల్ చేస్తే తాను స్పందిస్తానని తెలియజేశారు. వాట్సాప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్ లు చూసే అవకాశం ఉండటం లేదని, దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటనలో విన్నవించారు.
Posted

na first email to him -- USA lo chadhuvukunnaav ga...public schools elaa vuntavo telusugaa.....same la AP lo kuda vundela chudu..narayana ...china schools ni pakkana pettu...idhi chesina roju..I appreciate you(mogan babu style lo)

Posted

Intlo bathroom la water raakunna WhatsApp chestharu. Ivanni 1st 6 months honeymoon hungama. Slow ga chiraak vachi no publicity. 

Do your job properly every thing lo finger pedthe nee body meedha daayer kuda laagesrharu public. They are selfish like srimanthudu-bhibatsam.gif

 baby_dc1

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...