Jump to content

Recommended Posts

Posted

 

AP Cabinet: ముగిసిన ఏపీ క్యానెబిట్ సమావేశం.... ఆమోదించిన నిర్ణయాలు ఇవే! 

16-07-2024 Tue 14:22 | Andhra
AP Cabinet meeting concluded
 

 

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
  • కొత్త ఇసుక విధానం అమలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
  • ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం లభించింది. 

రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రుణం తీసుకునేందుకు వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి క్యాబినెట్ సమ్మతి తెలిపింది. 

కాగా, పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు, విధివిధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఈ కమిటీలో అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. 

రెండ్రోజుల్లో చర్చించి, అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా? లేక, ప్రభుత్వం చెల్లించాలా? అనే అంశాన్ని ఖరారు చేయాలని కమిటీకి నిర్దేశించారు. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది.

ఇక, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
20240716fr669635512695d.jpg

 

 

Posted

Chandrababu: ఉచిత ఇసుక పాలసీలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు: సీఎం చంద్రబాబు 

16-07-2024 Tue 15:27 | Andhra
Chandrababu said Ministers and MLAs should not involve into free sand policy
 

 

  • ముగిసిన క్యాబినెట్ భేటీ
  • మంత్రులతో రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చ
  • ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నామని చెప్పారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని అన్నారు. 

అక్టోబరు తర్వాత ఇసుక్ రీచ్ లన్నీ అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అన్నారు.
Posted

Kolusu Parthasarathy: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని ఆ భయానక చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకువచ్చింది: మంత్రి పార్థసారథి 

16-07-2024 Tue 16:36 | Andhra
Minister Kolusu Parthasarathy press meet after AP Cabinet meeting conclusion
 

 

  • నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
  • పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్
  • పలు నిర్ణయాలకు ఆమోదం
  • మంత్రివర్గ నిర్ణయాలపై మంత్రి పార్థసారథి మీడియా సమావేశం
నేడు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలియజేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయడంలేదని తెలిపారు. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు సందేహాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండానే, హడావిడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని పార్థసారథి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. 

నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే లాభనష్టాల గురించి ఆలోచించకుండా, ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. 

ఈ చట్టం ప్రకారం... భూమి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరినైనా నియమించవచ్చనే అంశం దారుణం అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. అధికారిని నియమిస్తారా, లేక నామినేటెడ్ వ్యక్తిని నియమిస్తారా అనేది స్పష్టత లేదన్నారు. పైగా, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు అపరిమత అధికారాలు ఇవ్వడం, ఆయన తీసుకున్న నిర్ణయమే అంతిమం అని పేర్కొనడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. 

పాత ఇసుక విధానం రద్దు అవుతుందని, పలు ఒప్పందాలు కూడా రద్దవుతాయని తెలిపారు. ఇక నుంచి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పార్థసారథి చెప్పారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాదని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక పాలసీ అమలుపై కమిటీ వేసి పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఇసుక అంశంపై గత సర్కారు కోర్టులకు తప్పుడు వివరాలు అందించిందని ఆరోపించారు. 

ఇక, ఎంఎస్ పీ విధానాలతో రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నాయని గుర్తించినట్టు మంత్రి పార్థసారథి తెలిపారు. ధాన్యం సంచుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. అటు, ధాన్యం సేకరించే మిల్లర్లపైనా పర్యవేక్షణ లేదని అన్నారు. రైతులకు 80 నుంచి 90 రోజుల పాటు బకాయిలు చెల్లించలేదని పేర్కొన్నారు. త్వరలోనే ధాన్యం రైతుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. 

గత ఐదేళ్లలో పంటల బీమా అస్తవ్యస్తం చేశారని, గత ప్రభుత్వం లోపభూయిష్టంగా పంటల బీమా విధానం అమలు చేసిందని విమర్శించారు. పంటల బీమాపై కమిటీ వేశామని, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరామని పార్థసారథి వివరించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...