southyx Posted July 25, 2024 Report Posted July 25, 2024 Vaadu kabzalu cheyyadame kakunda muncipal funds tho private roads vesukunnadu public evaru aa road use cheyyakudadhu ani warning, gates pettaru tharuvatha. 140 properties election affidavit lo pettaledhu anta. MLA disqualify chese chance undhi antunnaru. TDP vaallu high court lo correct ga vaadhisthe chance undhi. Quote
karna11 Posted July 25, 2024 Report Posted July 25, 2024 Mithun reddy ni tondaraga jump cheyinchandi ivanni agalanteee Quote
karna11 Posted July 25, 2024 Report Posted July 25, 2024 Individual assets medha koda swetha patramaa, vellaki @cbn antee baga lokivipoindhii chusara @Android_Halwa sir Quote
southyx Posted July 25, 2024 Report Posted July 25, 2024 Madanapalle: వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు! అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. Published : 26 Jul 2024 03:23 IST వందల సంఖ్యలో తరలివచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సీఎస్ సిసోదియాకు మొర ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ వర్షంలోనే బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఆర్పీ సిసోదియా ఈనాడు, కడప: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా గురువారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వందలమంది బాధితులు వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో వైకాపా నేతలు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని వాపోయారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి వెల్లువలా తరలి వచ్చారు. వారి నుంచి జోరు వానలోనే రాత్రి 8 గంటల వరకు సిసోదియా ఫిర్యాదులు స్వీకరించారు. విశ్రాంత పోలీసు అధికారికే దిక్కులేదు తిరుపతి ఎస్సైగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన చౌలేశ్వరయ్య.. వైకాపా నేతలు తమ కుటుంబ భూమిని దోచుకున్న తీరును సిసోదియాకు వివరించారు. తన తల్లి జయమ్మ పేరిట చిత్తూరు జిల్లా సదుంలో సర్వే నంబరు 495/3లో 1.69 ఎకరాలు, 495/2లో 1.85 ఎకరాల భూమి ఉండగా పెద్దిరెడ్డి చిన్నాన్న కుమారుడు పెద్దిరెడ్డి వేణుగోపాలరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. తన సోదరుడు చెన్నకేశవులుకు చెందిన 4.50 ఎకరాల భూమిని సైతం కాజేశారని మొర పెట్టుకున్నారు. తమతో పాటు ఎందరో బాధితులు ఉన్నప్పటికీ భయంతో ముందుకు రాలేదని సిసోదియా దృష్టికి తెచ్చారు. ఏ పది మందో వస్తారనుకుంటే.. బాధితుల స్పందన చూసి ప్రత్యేక సీఎస్ సిసోదియా ఆశ్చర్యపోయారు. తన పిలుపునకు స్పందించి ఏ పది మందో వస్తారనుకుంటే, వందల మంది తరలిరావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘అర్జీలన్నింటిపై విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తాం. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడి ఉంటే, వాటిని వెనక్కి తీసుకుని వాస్తవ యజమానులకు అప్పగిస్తాం. ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు వచ్చారంటే వ్యవస్థలోనూ ఎక్కడో లోపాలున్నాయనిపిస్తోంది. ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టాలని భావిస్తున్నాం. సబ్ కలెక్టరేట్ దహనం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు. వీరంతా ఏ తిరునాళ్లకో, జాతరకో వచ్చిన జనం కాదు. బాధితులు.. పీడితులు.. వైకాపా జమానాలో అధికార అండతో పెద్దిరెడ్డి కుటుంబం, అనుచరగణం సాగించిన అక్రమాలకు, అరాచకాలకు బలైన పేదలు. వారి గొంతు వినేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిన్న చొరవ చూపింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఆర్పీ సిసోదియాను గురువారం మదనపల్లెకు పంపించింది. వినతులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అంతే, ఐదేళ్లుగా అక్రమార్కుల పదఘట్టనల కింద నలిగిపోయిన బాధితులు వందల్లో పోటెత్తారు. గుండెల్లో దాచుకున్న ఆవేదనను ధైర్యంగా వెళ్లగక్కారు. న్యాయం చేయాలని మొర పెట్టుకున్నారు. తాళిబొట్టు తెంచేశారు ఈమె మదనపల్లె మండలం బండకాడిపల్లెకు చెందిన శోభారాణి. ఈమెకు సర్వే నంబరు 773/13లో 5.25 ఎకరాల భూమి ఉంది. దాన్ని పెద్దిరెడ్డి అనుచరులు వెంకటరమణ, గోవిందు కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాణిపై దాడి చేసి, తాళిబొట్టు సైతం తెంచేశారు. ఆరు నెలల కిందట జరిగిన ఈ దాడి తర్వాత తాను కేవలం పసుపు తాడుతోనే బతుకుతున్నానంటూ ఆమె అధికారులకు చూపించి భోరున విలపించారు. https://www.eenadu.net/telugu-news/ap-top-news/peddireddy-land-victims-que-at-madanapalle-sub-collector-office/2501/124137610 Quote
southyx Posted July 25, 2024 Report Posted July 25, 2024 https://www.eenadu.net/telugu-news/ap-top-news/peddireddy-occupied-road-at-tirupati/2501/124137600 Peddireddy: అదీ పెద్దిరెడ్డి రాజకీయం! మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన ఇంటిముందు.. నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన రోడ్డుకు రెండువైపులా గేట్లు పెట్టి ఐదేళ్లపాటు అటువైపు ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు. Published : 26 Jul 2024 03:20 IST గతంలో సీసీ రోడ్డును ఆక్రమించి.. గేట్లు పెట్టి తాళాలు ప్రజల రాకపోకలకు వీలు కల్పించాలని హైకోర్టు ఆదేశం తీర్పు మేరకు గేట్లు తెరిచినా.. మధ్యలో కొత్తగా మరో గేటు హైకోర్టు తీర్పు బేఖాతర్.. ప్రజలకు తొలగని సమస్య రాయల్నగర్ ప్రాంతం వైపు తెరిచిన గేటు ఈనాడు, తిరుపతి: మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన ఇంటిముందు.. నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన రోడ్డుకు రెండువైపులా గేట్లు పెట్టి ఐదేళ్లపాటు అటువైపు ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ గేట్లను తొలగించి ప్రజల రాకపోకలకు వీలు కల్పించాలని హైకోర్టు ఆదేశించడంతో.. ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపారు. హైకోర్టు తీర్పు మేరకు అధికారులు రెండు గేట్లు తెరవడంతో.. వాటి మధ్యలో తన కార్యాలయం ముందు మరో కొత్త గేటు ఏర్పాటు చేసి దానికి తాళాలేశారు. గతంలోలాగే రోడ్డుమీద రాకపోకలు సాగించే వీల్లేకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డులో కొంత దూరం వెళ్లాక తాళాలేసిన మరో గేటు కనిపించడంతో ముందుకు వెళ్లే అవకాశం లేక.. వెనక్కి వెళ్లేలా చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉంటుందా అని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన నగరపాలక సంస్థ అధికారులు కూడా ఈ విషయంలో నిద్ర నటిస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఫోన్ కూడా తీయడం లేదు. ఐదేళ్లపాటు సీసీ రోడ్డు ఆక్రమణ తిరుపతిలోని రాయల్నగర్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి 2019-20లో కార్పొరేషన్ నిధుల నుంచి రూ.9.51 లక్షలు ఖర్చుచేసి సిమెంటు రహదారి నిర్మించారు. మారుతినగర్-రాయల్నగర్ మధ్య ప్రజల రాకపోకల కోసం దీన్ని నిర్మించినట్లు నగరపాలక సంస్థ అధికారులు అప్పట్లో చెప్పారు. అయితే నిర్మాణం పూర్తయ్యాక అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోడ్డుకు రెండువైపులా గేట్లు ఏర్పాటు చేసి ప్రజలెవరూ అటు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినా నగరపాలక సంస్థ అధికారులు గేట్లు తెరిపించే ప్రయత్నం చేయలేదు. పెద్దిరెడ్డి కార్యాలయం వద్ద వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన గేటు జనసేన నేతల ధర్నాతో దారి మూసివేతపై ఇటీవల జనసేన నేత కిరణ్రాయల్తో పాటు పలువురు పెద్దిరెడ్డి ఇంటివద్ద ధర్నా చేశారు. గేటును తొలగించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. 48 గంటల్లో దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు వారికి హామీ ఇచ్చారు. హైకోర్టు చెప్పినా.. తమ భూమిలోని రహదారితో పాటు గేట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో.. యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు తొలుత ఆదేశాలిచ్చింది. తాము రహదారిని ఎక్కడా ధ్వంసం చేయడం లేదని, గేట్లను సైతం తీసివేయడం లేదని, కేవలం ప్రజల రాకపోకలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు కార్పొరేషన్ అధికారులు కౌంటరు దాఖలు చేశారు. దీంతో రహదారిపై ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా.. గేట్లను తొలగించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు గేటు తెరిచారు. అయితే మధ్యలో మరో గేటు ఏర్పాటుచేసి రాకపోకలు అడ్డుకోవడంతో ప్రజలకు మళ్లీ ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుని కొత్త గేటును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. Quote
akkum_bakkum Posted July 25, 2024 Report Posted July 25, 2024 2 hours ago, Mr Mirchi said: Nijamenaaaaaaa Eede files kaalpinchadanna maata aithe Quote
React Posted July 25, 2024 Report Posted July 25, 2024 Peddireddy is innocent soul antunna @Android_HaIwa and @vetrivel Quote
southyx Posted July 26, 2024 Report Posted July 26, 2024 6 minutes ago, vetrivel said: We need to discuss with Jetti Kusuma Kumar He will decide After all he helped create a new day in a week in KGF summit @psycopk Memu veedi kula kampu posts ki counter veste caste topic post cheyyoddhu antav. Veedu prathi thread lo ilanti kula kampu posts vesi, threads ni derail chesthunnadu. Why are you not taking action? Quote
vetrivel Posted July 26, 2024 Report Posted July 26, 2024 15 minutes ago, southyx said: @psycopk Memu veedi kula kampu posts ki counter veste caste topic post cheyyoddhu antav. Veedu prathi thread lo ilanti kula kampu posts vesi, threads ni derail chesthunnadu. Why are you not taking action? @psycopk go check who in their last 100 posts 90 has been using the word jaathi and targeting one caste This id starts provoking by caste and then when retaliated comes crying to you Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.