Jump to content

Recommended Posts

Posted
30 minutes ago, psycopk said:

 

@vetrivel anna.. i know you are fan of Jagan anna. by chance are you fan of duvvada srinu anna?

Posted
23 minutes ago, DarkKnight19 said:

@vetrivel anna.. i know you are fan of Jagan anna. by chance are you fan of duvvada srinu anna?

I am a fan of the most glorified real estate agent CBN

Its a talent to convince so many ppl that he is a visionary

Biggest charlatan

I need to learn how to so confidently make false statements after false statements

Posted

Super six emaindi ra vaari ante duvvada sreenu gani muchata cheptaru…

Atu registration rates penchi, media ki rakunda dubvada ranku story nadipistunaru…

 

Posted
15 minutes ago, vetrivel said:

I am a fan of the most glorified real estate agent CBN

Its a talent to convince so many ppl that he is a visionary

Biggest charlatan

I need to learn how to so confidently make false statements after false statements

Ok.

So duvvada manchivaadu, neethimanthudu, soumyudu antav.

Got it.

Posted
9 minutes ago, Android_Halwa said:

Super six emaindi ra vaari ante duvvada sreenu gani muchata cheptaru…

Atu registration rates penchi, media ki rakunda dubvada ranku story nadipistunaru…

 

mee pinky puppet jagalaq gaadu 4 pellilu ani edichadu ga.... 

mana deggariki vachesariki anni gurthuku vastayi.

Posted
13 minutes ago, DarkKnight19 said:

Ok.

So duvvada manchivaadu, neethimanthudu, soumyudu antav.

Got it.

I need to learn how to make so many false statements so confidently like CBN

CBN is nothing but a glorified real estate agent but you all are saying he is visionary

I need to understand what made you guys believe his lies

Posted

 

Duvvada: నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది: దువ్వాడ 

10-08-2024 Sat 12:35 | Andhra
Duvvad Srinivas Press Meet On Family Fight
 

 

  • నన్ను చంపాలని చూసే వాళ్లలో తన వాళ్లూ ఉన్నారని ఆవేదన
  • కుటుంబ వివాదంపై ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్సీ
  • అర్ధరాత్రి మనుషులను వేసుకొని రావాల్సిన అవసరమేంటని ప్రశ్న
  • తండ్రిని కలిసేందుకు కుమార్తె వచ్చే విధానమిదేనా? అని నిలదీత
పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయా.. అయినా ఎప్పుడూ ఒకేలా ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు నా కుటుంబం గురించి నేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా తన కుటుంబంలో జరుగుతున్న విషయాలపై ఆయన శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తన భార్య వాణి, కూతురు హైందవి చేస్తున్న ఆరోపణలపై, దివ్వెల మాధురితో తనకున్న సంబంధంపై పలు వివరాలను వెల్లడించారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పనిచేశానని, చేస్తానని వివరించారు.

భారత కుటుంబ వ్యవస్థలో భర్త అడుగుజాడల్లో నడిచే భార్యలను చూశానని దువ్వాడ చెప్పుకొచ్చారు. కానీ తన కుటుంబంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని వివరించారు. ముప్పై ఏళ్లుగా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నానని, ఇకపైనా కాపాడుకుంటానని చెప్పారు. నా కష్టాలను, నష్టాలను కుటుంబం దాకా చేరనివ్వలేదని వివరించారు. ఇద్దరు కూతుళ్లను డాక్టర్లను చేశానని, పెద్ద కూతురుకు వివాహం చేశానని తెలిపారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నా చేతికి అవినీతి మరక అంటుకోనివ్వలేదని, నిజాయతీకి కట్టుబడి పనిచేస్తున్నానని వివరించారు.

ఈ క్రమంలో రాజకీయంగా, వ్యాపారపరంగా అనేకమంది శత్రువులను తయారుచేసుకున్నానని దువ్వాడ చెప్పారు. ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేసి చంపేస్తారో తెలియదని, తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. ప్రాణాలతో ఉన్నన్ని రోజులు సంతోషంగా, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నదే తన లక్ష్యమని వివరించారు. అయితే, తనను చంపేయాలని కుట్రలు పన్నుతున్న వారిలో తన కుటుంబ సభ్యులు కూడా చేరడం బాధాకరమని వాపోయారు.

ఎంత బాగా చూసుకుంటున్నా తన భార్య వాణి కుటుంబంలో గొడవలు చేసేదని, వ్యాపార సంస్థలను, మైన్స్ లను తన పేరు మీద రాయాలని ఎన్నోమార్లు గొడవ చేసిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. పిల్లల మనసుల్లో విషం నింపిందని, తండ్రిని నిలదీసేలా మార్చేసిందని మండిపడ్డారు. ప్రతీ కుటుంబంలోనూ గొడవలు వస్తాయని అయితే అవి నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలని చెప్పారు. కానీ తన భార్య వాణి మాత్రం రాజకీయ ఆకాంక్ష, డబ్బుపై ఆపేక్షతో గొడవ చేస్తోందని ఆరోపించారు.

తాజాగా అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడికి వచ్చిందని చెప్పారు. భర్తను కలిసేందుకు వచ్చానని వాణి, తండ్రిని కలిసేందుకు వచ్చానని హైందవి చెబుతున్నారని గుర్తుచేస్తూ.. అర్ధరాత్రి భర్తను, తండ్రిని కలిసేందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనుచరులతో ఇంటి గోడను కూల్చి, డోర్ లాక్ ను రంపంతో కట్ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. వాణి, హైందవి, వారి అనుచరులను చూసి బయటకు వస్తే తనను చంపేసే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఇంట్లో నుంచి బయటకు రాలేదని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.
Posted

Duvvada: దువ్వాడ కుటుంబ వివాదంలో ట్విస్ట్.. వాణి నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ఎమ్మెల్సీ ప్రకటన 

10-08-2024 Sat 11:12 | Andhra
AP MLC Duvvada Srinivas Wants Divorce From Vani
 

 

  • భార్యాపిల్లలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ
  • తనకు ప్రాణహాని ఉందని ఆవేదన
  • ఇంటి గేట్లు విరగ్గొట్టి లోపలికి వచ్చారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తన భార్య వాణి నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుంటానని వెల్లడించారు. భార్యాపిల్లల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు దౌర్జన్యం చేయడంతో పాటు వాణి, తన కూతురు హైందవి సహా ఐదుగురు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారని, అనుచరులతో కలిసి వాణి తనను చంపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. వాణితో పాటు ఆమె అనుచరులను అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన భార్య వాణి, కూతురు కలిసి తనను అంతమొందించాలని చూస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ అండతో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా తనను వేధిస్తున్నారని వాపోయారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. ఎస్పీ తిరస్కరించారని చెప్పారు. తాజాగా వాణి, ఆమె అనుచరులు తన ఇంటిపై దాడి చేయడంతో గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.
Posted

Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై భార్య వాణి ఫైర్ .. తీవ్ర ఆరోపణలు 

10-08-2024 Sat 11:27 | Andhra
YCP MLC Duvvada Srinivas wifs made allegations on him
 

 

  • మరోసారి వీధికెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయితీ
  • భర్తపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి
  • పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినా మార్పు రాలేదని ఆవేదన
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పంచాయితీ మరోసారి వీధికెక్కింది. దువ్వాడ గత కొంత కాలంగా ఇంటికి రాకుండా వేరే మహిళతో సహజీవనం సాగిస్తుండటంతో ఆయన భార్య, పిల్లలు మీడియా ముందుకు వచ్చి శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనతో ఉంటున్న మహిళపై కూడా ఆరోపణలు గుప్పించారు. 

టెక్కలిలో జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన ఇంటిలో ఉంటున్న శ్రీనివాస్‌ను కలిసేందుకు ఆయన కుమార్తెలు గురువారం ప్రయత్నించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ఆ ఇంటి వద్దే కారులో కూర్చుని నిరీక్షించినా శ్రీనివాస్ వారితో మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో వారు వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో శుక్రవారం శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి (వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు), పెద్ద కుమార్తె హైందవి మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ గౌరవాన్ని, కుటుంబ నేపథ్యాన్ని, రాజకీయ జీవితాన్ని శ్రీనివాస్ మంటగలుపుతున్నాడంటూ వాపోయారు.

తన తాత లక్ష్మీపతి దొర, తండ్రి రాఘవరావు దొర, తాను వందల ఎకరాలు అమ్ముకుని రాజకీయం చేశామని, తన భర్తగా ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ చేరి నమ్ముకున్న కార్యకర్తలను, పార్టీని, కుటుంబాన్ని నట్టేట ముంచేసి రోడ్డున పడేశారంటూ వాణి విమర్శించారు. తన భర్త తీరుపై గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీనివాస్ వైఖరి వల్ల కేవలం తాము మాత్రమే నష్టపోవడం లేదని, పార్టీ కార్యకర్తలు అంతా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చాలా మంది జీవితాలను నాశనం చేసిన మహిళ ఉచ్చులో తన భర్త చిక్కుకున్నాడని, ఆమెతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని ఆరోపించారు.
Posted
5 hours ago, Android_Halwa said:

Super six emaindi ra vaari ante duvvada sreenu gani muchata cheptaru…

Atu registration rates penchi, media ki rakunda dubvada ranku story nadipistunaru…

 

Ucha apuko… pakka state vallaki enduku vayya 

 

neku kavalsindi nista daridrudiki savam dorikinda leda annadi matrame…

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...