psycopk Posted August 28, 2024 Report Posted August 28, 2024 Kinjarapu Ram Mohan Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది... అందుకు ఇదే నిదర్శనం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 28-08-2024 Wed 16:51 | Andhra కొప్పర్తి, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ లు కేంద్రం ప్రకటన ఏపీకి పరిశ్రమలు వచ్చేందుకు కేంద్రం సాయం చేస్తోందన్న కేంద్రమంత్రి రామ్మోహన్ ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి వివిధ రకాల పరిశ్రమలు వచ్చేందుకు కేంద్రం సాయం చేస్తోందని తెలిపారు. ఇవాళ కేంద్రం ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్ లను ప్రకటించిన నేపథ్యంలో, రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మంజూరయ్యాయని వెల్లడించారు. రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతంలో ఉద్యోగాల కల్పన అనేది చాలా ముఖ్యమైన విషయం అని తెలిపారు. అందుకే రాష్ట్ర సహకారంతో కేంద్రం ఇక్కడ పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతోందని పేర్కొన్నారు. కొప్పర్తి... విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా వస్తుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొప్పర్తిలో పునరుత్పాదక శక్తి, ఇంజినీరింగ్, కెమికల్, మెటాలిక్, నాన్ మెటాలిక్, టెక్స్ టైల్స్, ఆటోమొబైల్ కంపెనీలు వస్తాయని అన్నారు. ఇక్కడ రూ,8,800 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని తెలిపారు. రాయలసీమ అటు బెంగళూరుకు, ఇటు చెన్నైకి దగ్గరగా ఉంటుందని, హైదరాబాద్ కు సమీపంగా ఉంటుందని వివరించారు. గతంలో అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాయని, దీనిపై కేబినెట్ లో కూడా ఆమోదం లభించిందని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనేదానికి ఇదొక నిదర్శమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల నాయకత్వాన్ని బలపరిచి, ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిన నేపథ్యంలో, రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ ముగ్గురి నాయకత్వం అవసరమని ప్రజలు భావించారని, కూటమి గెలుపునకు ఇదే కారణమని వివరించారు. Quote
psycopk Posted August 28, 2024 Author Report Posted August 28, 2024 Industrial Hubs: కొప్పర్తి, ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక హబ్ లు వస్తున్నాయి: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ 28-08-2024 Wed 16:11 | Andhra ఏపీపై కేంద్రం కరుణ కొప్పర్తి, ఓర్వకల్లులో భారీ వ్యయంతో ఇండస్ట్రియల్ హబ్ లు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ దాదాపు లక్ష మందికి ఉపాధి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఏపీపై కరుణ చూపిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ... కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక హబ్ లు వస్తున్నాయని వెల్లడించారు. ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ వస్తోందని తెలిపారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ప్రాజెక్టు వ్యయం రూ.2,786 కోట్లు అని వివరించారు. ఈ పారిశ్రామిక హబ్ లో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దీని ద్వారా 45 వేల మందికి ఉపాధి కలుగుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక, కొప్పర్తి పారిశ్రామిక హబ్ ను 2,596 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీని కోసం రూ.2,137 కోట్ల వ్యయం చేయనున్నారని పేర్కొన్నారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్ ద్వారా 54 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. Quote
psycopk Posted August 28, 2024 Author Report Posted August 28, 2024 Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించేందుకు కేంద్రం సుముఖత 28-08-2024 Wed 14:25 | Andhra జాతీయ ప్రాజెక్టుగా పోలవరం కొన్నాళ్లుగా కొనసాగుతూనే ఉన్న నిర్మాణ పనులు ఇటీవల పలు దఫాలుగా కేంద్రంతో చంద్రబాబు చర్చలు పోలవరం నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం! ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు దఫాలుగా కేంద్రంతో పోలవరంపై చర్చించారు. ప్రధానమంత్రి, ఆర్థిక, జలశక్తి మంత్రులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి సానుకూల స్పందన వెలువడింది. జాతీయ ప్రాజెక్టు పోలవరంను పూర్తిగా నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వెలిబుచ్చింది. బకాయిలు సహా, నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. Quote
psycopk Posted August 28, 2024 Author Report Posted August 28, 2024 Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ నేతల కీలక భేటీ 28-08-2024 Wed 10:10 | Andhra ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ నేతలు శివప్రకాశ్, దగ్గుబాటి పురందేశ్వరి సమావేశం నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతపైనే ప్రధానంగా చర్చ ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో సమావేశమైన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర నెలలు దాటింది. ఇక నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కీలక నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశతో ఉన్నారు. అయితే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న జనసేన, బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల నియామకాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ తరుణంలో బీజేపీ కీలక నేతలు మంగళవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమిలో నెలకొన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అలానే నామినేటెడ్ పదవుల్లోనూ బీజేపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీకి ముందు విజయవాడలోని పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ సీఎం రమేశ్, రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, విప్ ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ పార్థసారథి, ఎన్ ఈశ్వరరావు, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ తదితరులు పురందరేశ్వరి నివాసంలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవులు, జిల్లాల వారీగా ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. Quote
psycopk Posted August 28, 2024 Author Report Posted August 28, 2024 Chandrababu: కేంద్రం చర్యలతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోంది: చంద్రబాబు 28-08-2024 Wed 18:10 | Andhra పోలవరంను పూర్తిగా నిర్మిస్తామన్న కేంద్రం ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్ లు కేటాయింపు కేంద్రం నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఏపీకి ఇవాళ చారిత్రాత్మక దినం అని వెల్లడి కేంద్ర ప్రభుత్వం ఇవాళ పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్ లు ప్రకటించిన నేపథ్యంలో, సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ ఏపీకి చారిత్రాత్మక దినం అని, ఇదొక శుభారంభం అని చంద్రబాబు అభివర్ణించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి ఈ ప్రకటన మంచి ఊతమిస్తుందని, ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పిస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టు అని వెల్లడించారు. ఫేజ్-1 కింద ప్రాజెక్టు వ్యయం రూ.30,436.95 కోట్లు అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే నాటికి రూ.4,730 కోట్లు పెట్టుబడి పెట్టామని తెలిపారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి, మిగిలిన మొత్తాన్ని కేంద్రం భరించేట్టు ఒక అవగాహనకు వచ్చామని చంద్రబాబు వివరించారు. బ్యాలన్స్ అమౌంట్ చూసినప్పుడు రూ.25,706 కోట్లు అని, అందులో ఇంతవరకు విడుదల చేసింది రూ.15,146 కోట్లు అని స్పష్టం చేశారు. భూసేకరణ, పునరావాసం వ్యయం పోగా... రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వివరించారు. 2024-25కి రూ.6 వేల కోట్లు... 2025-26కి రూ.6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఇక, తాజాగా ప్రకటించిన కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లు, ఇంతకుముందు ప్రకటించిన మరో రెండు హబ్ లతో కలిపి ఏపీలో ఇండస్ట్రియల్ హబ్ ల సంఖ్య నాలుగుకు చేరిందని వివరించారు. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఏపీలో ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అన్నారు. కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం కలుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి అవకాశాలు ఉంటే, వాటిని ఉపయోగించుకోకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఇదంతా మా ఘనతే అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చారని గత ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్లను ఏం చేస్తారో తెలియదు కానీ, మన దేశంలో కాబట్టి ఇలా జరిగిపోతోంది అని వ్యాఖ్యానించారు. Quote
Android_Halwa Posted August 28, 2024 Report Posted August 28, 2024 Orvakallu industrial park…. Kotha vi emana vunaya leka vunna danike malli malli inaguration sestara ? Oravakal industrial hub is already a functional industrial hub with an operating airport and road connectivity. Kotha vi emi lekapothey igo vunnaye malli mallo techinam chesinam ani cheppukovali.. 2 Quote
psycopk Posted August 28, 2024 Author Report Posted August 28, 2024 Nara Lokesh: అలాంటి వారి కోసం అన్వేషిస్తున్నాం: మంత్రి నారా లోకేశ్ 28-08-2024 Wed 22:33 | Andhra రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పాటుపడే వారి కోసం అన్వేషిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రతిభావంతులు, వినూత్న ఆలోచనలు ఉన్న వారికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతిభావంతుల నుంచి సెప్టెంబరు 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో నాడు చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం ఏపీలోనూ వచ్చేలా కృషి చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. మాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని లోకేశ్ వివరించారు. మానవ వనరులు, మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రణాళిక రూపొందించాల్సి ఉందని... కూటమి ప్రభుత్వంతో కలిసి నడవాలని ఏపీ ఈడీబీ (ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్)ని కోరుతున్నామని తెలిపారు. Quote
Android_Halwa Posted August 28, 2024 Report Posted August 28, 2024 41 minutes ago, psycopk said: హైదరాబాదులో నాడు చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం ఏపీలోనూ వచ్చేలా కృషి చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. Matash…antha matash..!!! Eedu IT park antadu…suttu bhumu dobbestadu…IT park edi ra ayya ante jaggadu ethukapoindu ano covering chestadu.. 1 Quote
Android_Halwa Posted August 28, 2024 Report Posted August 28, 2024 42 minutes ago, psycopk said: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పాటుపడే వారి కోసం అన్వేషిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రతిభావంతులు, వినూత్న ఆలోచనలు ఉన్న వారికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతిభావంతుల నుంచి సెప్టెంబరు 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. Vethakadam deniki….vunnadu kada Rajesh Kilaru…Jubilee hills la kurchini yellow tax colkection chestundu… Inka vetakadam denikayya…alreay work started..venu swamy degaranundi collection tho boni ayindi anta Quote
psycopk Posted August 28, 2024 Author Report Posted August 28, 2024 4 minutes ago, Android_Halwa said: Matash…antha matash..!!! Eedu IT park antadu…suttu bhumu dobbestadu…IT park edi ra ayya ante jaggadu ethukapoindu ano covering chestadu.. Quote
Raisins_72 Posted August 28, 2024 Report Posted August 28, 2024 Ippudu anni chebuthaaru, malli 2028 lo nalla sokka yesukoni thiruguthaaru 😂😂 1 Quote
manadonga Posted August 28, 2024 Report Posted August 28, 2024 3 hours ago, Android_Halwa said: Orvakallu industrial park…. Kotha vi emana vunaya leka vunna danike malli malli inaguration sestara ? Oravakal industrial hub is already a functional industrial hub with an operating airport and road connectivity. Kotha vi emi lekapothey igo vunnaye malli mallo techinam chesinam ani cheppukovali.. Orvakallu lo again 2500 acres acquire chestunaru and central is giving 2800 cr for development its bug extension Quote
Android_Halwa Posted August 28, 2024 Report Posted August 28, 2024 12 minutes ago, manadonga said: Orvakallu lo again 2500 acres acquire chestunaru and central is giving 2800 cr for development its bug extension Ala istune vuntaru….ala ala… Its all about land…primary focus of TdP govt. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.