psycopk Posted September 2, 2024 Report Posted September 2, 2024 Chandrababu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు 02-09-2024 Mon 14:08 | Andhra నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు ట్వీట్ చేసిన చంద్రబాబు ప్రజా జీవితంలో నిబద్ధత ఉన్న నాయకుడు అంటూ కితాబు రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలంటూ ఆకాంక్ష ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ నేడు (సెప్టెంబరు 2) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్... రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాకుండా, పవన్ తో తాను కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు. Quote
psycopk Posted September 2, 2024 Author Report Posted September 2, 2024 Allu Arjun: పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. ట్వీట్ ఇదిగో! 02-09-2024 Mon 12:17 | Entertainment కొంతకాలంగా పవన్ కు దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం బన్నీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పీకే ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పోస్టు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం హైలైట్ గా మారింది. గత కొంతకాలంగా ఇరువురు హీరోల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలే దీనికి కారణం. ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇటీవల పొసగడంలేదు. అల్లు అర్జున్ పై జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనికితోడు ఓ సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మరింత పెరిగింది. హీరోల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. Quote
psycopk Posted September 2, 2024 Author Report Posted September 2, 2024 Chiranjeevi: కల్యాణ్ బాబూ.. నీలాంటి నాయకుడు కావాలి, రావాలి: చిరంజీవి 02-09-2024 Mon 10:04 | Entertainment ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కల్యాణ్ ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం అన్న చిరంజీవి ప్రజలకు నీలాంటి నాయకుడు కావాలని ట్వీట్ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన తమ్ముడు పవన్ కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "కల్యాణ్ బాబు... ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయతీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!" అని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్, తన భార్య సురేఖలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. Quote
psycopk Posted September 2, 2024 Author Report Posted September 2, 2024 Varun Tej: బాబాయ్‌కి వరుణ్ బర్త్‌డే విషెస్.. ఆకట్టుకుంటున్న పవన్ అరుదైన ఫొటో 02-09-2024 Mon 14:27 | Entertainment నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా జనసేనానికి బర్త్ విషెస్‌ల వెల్లువ ఎక్స్ వేదికగా బాబాయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వరుణ్ తేజ్ నేడు జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు జనసేనానికి భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పవన్ కుటుంబ సభ్యులు చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా విషెస్ తెలిపారు. ఇప్పుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బాబాయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ అరుదైన ఫొటోను షేర్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్! నేను ఎప్పుడూ మీరు పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ తిరుగులేని సంకల్పం అనంతంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీలోని అగ్ని ప్రకాశవంతంగా మండుతూనే ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. మీరు నా శక్తి తుఫాన్. హ్యాపీ బర్త్‌డే జనసేనాని" అంటూ వరుణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్‌కు తన చిన్ననాటి ఫొటో ఒకటి జోడించాడు. ఆ ఫొటోలో పవన్ సోఫాలో కూర్చొని ఉండగా, వరుణ్ ఆయన కాళ్లు పడుతున్నాడు. వరుణ్‌ను పవన్ ఆశీర్వదిస్తున్నట్లు ఫోజు పెట్టడం కూడా ఆ ఫొటోలో ఉంది. Quote
psycopk Posted September 2, 2024 Author Report Posted September 2, 2024 Ramcharan: మా పవర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు: రామ్ చరణ్ 02-09-2024 Mon 08:58 | Entertainment నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు 'ఎక్స్' వేదికగా బాబాయ్‌కి విషెస్ తెలిపిన చరణ్ నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా జనసేనానికి రామ్ చరణ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. మా పవర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చరణ్ ట్వీట్ చేశారు. "మీ బలం, అంకితభావం, అవసరంలో ఉన్నవారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు, చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. మీ నిస్వార్థ పనులు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకితభావంతో దృష్టి సారించడం అద్భుతం. ఆంధ్రప్రదేశ్‌లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ, ఆశీర్వదిస్తూ మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Quote
psycopk Posted September 2, 2024 Author Report Posted September 2, 2024 Nara Lokesh: రియల్ హీరో పవన్ అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు: లోకేశ్ 02-09-2024 Mon 14:54 | Andhra నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్ అయ్యారన్న లోకేశ్ ప్రజల అభిమానంతో డిప్యూటీ సీఎం అయ్యారని కితాబు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ రియల్ హీరో అంటూ ఈ సందర్భంగా లోకేశ్ కితాబిచ్చారు. ఎక్స్ వేదికగా లోకేశ్ స్పందిస్తూ 'రియల్ హీరో పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్‌గా నిలిచావు. రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు... ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... హ్యాపీ బర్త్ డే పవన్ అన్న' అని ట్వీట్ చేశారు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.