Jump to content

Em government idhi 🙏🙏


Recommended Posts

Posted

Ministry of Home Affairs: రాష్ట్రంలో విపత్తుపై అధికారిక నివేదిక రాలేదు

తెలంగాణలో ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తుకు సంబంధించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

పంపాలని అధికారులకు సూచించండి
సీఎస్‌కి కేంద్ర హోంశాఖ లేఖ

రాష్ట్రంలో విపత్తుపై అధికారిక నివేదిక రాలేదు

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తుకు సంబంధించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు రోజువారీ నివేదిక పంపేలా అధికారులకు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈనెల 3న రాసిన రెండు పేజీల లేఖ బుధవారం బయటకొచ్చింది. ‘‘రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి టెలిఫోన్‌ ద్వారా అందిన సమాచారం ప్రకారం భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరగడం, వాటి నుంచి నీరు విడుదల చేయడం కారణంగా ఆగస్టు 31 నుంచి రాష్ట్రంలో వరద తరహా పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్‌ జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు సమాచారం అందింది. రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందించడానికి పడవలు, ప్రాణాలు కాపాడే సరంజామాతోపాటు ఏడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అలాగే సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి రెండు హెలికాప్టర్లను కూడా పంపింది. ఆ రెండూ హకీంపేటలో ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కేంద్ర హోంశాఖలోని కంట్రోల్‌రూంకి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదికా అందలేదు.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేంద్ర వాటా కోసం సమాచారం సమర్పించని రాష్ట్రం

 

రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు, వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి రూ.1,345.15 కోట్లు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌ ద్వారా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్‌ కింద కేంద్ర వాటా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సమాచారాన్ని సమర్పించలేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద అమలు చేసే పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి అందిన మొత్తం గురించి కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏప్రిల్, అక్టోబరు నెలలలో సమాచారం అందించాలి. ఆయా తేదీల వరకు చేసిన ఖర్చులు, ఖాతాలో మిగిలి ఉన్న మొత్తానికి సంబంధించిన లెక్కలనూ వివరించాలి.

కేంద్రం 2022-23 నుంచి ఇచ్చిన నిధులు ఇలా... 

  • 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కోసం కేంద్ర వాటా రెండో విడత మొత్తం రూ.188.80 కోట్లు 2023 జులై 10న విడుదలయ్యాయి. 
  • 2023-24 సంవత్సరానికి రెండు విడతల మొత్తం రూ.198 కోట్లను 2024 మార్చి 13, 28వ తేదీల్లో ఇచ్చింది. 
  • 2024-25 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత మొత్తం రూ.208.40 కోట్లను ఈ ఏడాది జూన్‌ 1న ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తీ చేయలేదు. అలాగే అంతకుముందు విడుదలైన నిధులు, ఆర్జించిన వడ్డీ ఆదాయం, వినియోగ ధ్రువీకరణ పత్రాలు కూడా పంపలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశిత ప్రొఫార్మాలో సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమర్పించాలి. ప్రతిని సాధ్యమైనంత త్వరగా కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగానికీ పంపాలి. అప్పుడే 2024-25కి సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల్లో కేంద్ర వాటా తొలి విడత మొత్తం విడుదల చేయడానికి వీలవుతుంది’’ అని కేంద్రహోంశాఖ రాష్ట్ర సీఎస్‌కి తెలిపింది.
Posted

Elagu next elections are time varaku center tho kalisipotame kada Ani info ivvaledanta mana GM..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...