psycopk Posted September 5, 2024 Report Posted September 5, 2024 Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్! 05-09-2024 Thu 07:41 | Andhra మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు హైదరాబాద్‌లో నందిగం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోసం సురేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు బుధవారం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంత సేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేశ్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ తదితరులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో గుంటూరు, బాపట్ల, పన్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. Quote
psycopk Posted September 5, 2024 Author Report Posted September 5, 2024 Jogi Ramesh: నందిగం సురేశ్ అరెస్టుతో అజ్ఞాతంలోకి జోగి రమేశ్ 05-09-2024 Thu 11:18 | Andhra -- మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప్రసారం చేయడంతో మిగతా నేతలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ తో పాటు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు వున్న దేవినేని అవినాశ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులకు సంబంధించి అరెస్టును తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులకు చిక్కకుండా మాజీ మంత్రి జోగి రమేశ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. దేవినేని అవినాశ్ కూడా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. Quote
psycopk Posted September 5, 2024 Author Report Posted September 5, 2024 Aa sakshi office ladies toilet lo dakoni untadu… Jogi Ramesh: జోగి రమేశ్ కోసం హైదరాబాదులో ఏపీ పోలీసుల గాలింపు 05-09-2024 Thu 15:50 | Andhra చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేశ్ జోగి రమేశ్ కు హైకోర్టులో చుక్కెదురు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత అజ్ఞాతంలోకి జోగి రమేశ్ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన ఏపీ పోలీస్ శాఖ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, జోగి రమేశ్ తో పాటు ఆయన అనుచరుల కోసం ఏపీ పోలీసులు హైదరాబాదులో గాలిస్తున్నారు. జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అటు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న దేవినేని అవినాశ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న ఇతర వైసీపీ నేతలు ముందే జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. Quote
psycopk Posted September 5, 2024 Author Report Posted September 5, 2024 Lella Appireddy: వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీసులు 05-09-2024 Thu 17:40 | Andhra నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ నందిగం సురేశ్ కు రెండు వారాల రిమాండ్ లేళ్ల అప్పిరెడ్డిని కూడా కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్ కోసం తీవ్రస్థాయిలో గాలింపు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్పిరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, నందిగం సురేశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను గుంటూరు జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి కోసం పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. Quote
psycopk Posted September 5, 2024 Author Report Posted September 5, 2024 YSRCP: వైసీపీ నేత నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు 05-09-2024 Thu 17:29 | Andhra టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో హైదరాబాద్‌లో వైసీపీ నేత అరెస్ట్ నందిగం సురేశ్‌ను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు 2014 నుంచి టీడీపీ తనను వేధిస్తోందన్న మాజీ ఎంపీ వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బుధవారం నుంచి నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత తన ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించింది. టీడీపీ నన్ను వేధిస్తోంది: నందిగం సురేశ్ తెలుగుదేశం పార్టీ తనను 2014 నుంచి వేధిస్తోందని నందిగం సురేశ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కాగా, వైసీపీ నేతను పోలీసులు కాసేపట్లో గుంటూరు జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఆయనను తమ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. Quote
Popular Post praying Posted September 5, 2024 Popular Post Report Posted September 5, 2024 42 minutes ago, psycopk said: YSRCP: వైసీపీ నేత నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు 05-09-2024 Thu 17:29 | Andhra టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో హైదరాబాద్‌లో వైసీపీ నేత అరెస్ట్ నందిగం సురేశ్‌ను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు 2014 నుంచి టీడీపీ తనను వేధిస్తోందన్న మాజీ ఎంపీ వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బుధవారం నుంచి నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత తన ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించింది. టీడీపీ నన్ను వేధిస్తోంది: నందిగం సురేశ్ తెలుగుదేశం పార్టీ తనను 2014 నుంచి వేధిస్తోందని నందిగం సురేశ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కాగా, వైసీపీ నేతను పోలీసులు కాసేపట్లో గుంటూరు జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఆయనను తమ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. Nuvvu pedda figure vi mari… ninnu vedinchadaniki 4 Quote
praying Posted September 5, 2024 Report Posted September 5, 2024 A migilina iddarni kuda panilo pani lopala tengandi tondaraga, vijaywada ki pattina daridram vaduluddi Quote
psycopk Posted September 5, 2024 Author Report Posted September 5, 2024 Jaffa finds out what he is missing in life https://www.instagram.com/reel/C9Qxs-lN56V/?igsh=MWwzaDFwNmY0MnB3dA== Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.