Jump to content

Recommended Posts

Posted

 

Floods- ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్ల పంపిణీ.. ఏయే సరుకులు ఉంటాయంటే..? 

06-09-2024 Fri 10:35 | Andhra
Glossary kits distribution in AP for flood victims
 

 

  • తొలి రోజు 50 వేల కిట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు
  • కిట్లలో బియ్యం, కందిపప్పు, ఉల్లి, బంగాళాదుంపలు, నూనె, పంచదార
  • మొత్తం 2 లక్షల కుటుంబాలకు కిట్లు అందించేందుకు ఏర్పాట్లు
భారీ వర్షాలకు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాత్రింబవళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఈరోజు నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేయనున్నారు. తొలిరోజు 50 వేల కిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. కిట్ లో 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు, లీటర్ నూనె ఉంటాయి. మొత్తం 2 లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ-పోస్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆధారంగా కిట్లను పంపిణీ చేస్తారు. 

 

 

Posted

Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే 

06-09-2024 Fri 16:17 | Andhra
CM Chandrababu takes aerial survey on flood hit areas
 

 

  • హెలికాప్టర్ ద్వారా వివిధ ప్రాంతాలను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు
  • బుడమేరు గండ్లు, వాటిని పూడ్చే పనుల పరిశీలన
  • బుడమేరు ఆక్రమణల పరిశీలన
ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు, వాటిని పూడ్చే పనులను పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల నుంచి వెళ్లి కొల్లేరులో కలుస్తుందో ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితిని గమనించారు.

అంతేకాదు, బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో కూడా చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజి దిగువన కృష్ణా నది ప్రవాహాన్ని, కృష్ణా నది సముద్రంలో కలిసే చోటును, లంక గ్రామాలను కూడా ఏరియల్ సర్వేలో వీక్షించారు.
Posted

Kinjarapu Ram Mohan Naidu: నెగెటివ్ యాటిట్యూడ్ మార్చుకోలేదు... బురద రాజకీయాలు చేస్తున్నారు: జగన్ పై రామ్మూర్తినాయుడు ఫైర్ 

06-09-2024 Fri 16:08 | Andhra
Ram Mohan Naidu fires on Jagan
 

 

  • జగన్ ఎక్కడకు వెళితే అక్కడ ప్రమాదం ఉంటుందన్న రామ్మోహన్ నాయుడు
  • బుడమేరు గేట్లు ఎత్తేశారంటున్నారని ఎద్దేవా
  • వరదలను రాజకీయాలకు వాడుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శ 
వైసీపీ అధినేద జగన్ పై కేంద్ర మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ను భరించలేకే ఆయన ఐదేళ్ల పాలనకు ప్రజలు ముగింపు పలికారని చెప్పారు. అయినప్పటికీ తన పద్ధతిని, నెగెటివ్ యాటిట్యూడ్ ను జగన్ మార్చుకోలేదని విమర్శించారు. జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉందనే భావనతోనే ప్రజలు ఆయనను పక్కన పెట్టారని చెప్పారు. జగన్ ఎక్కడకు వెళితే అక్కడ ప్రజలకు ప్రమాదం ఉంటుందని అన్నారు. 
 
విజయవాడ వరదలపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. బుడమేరుకు గేట్లు ఎత్తేశారని, అమరావతి మునిగిపోయిందని అంటున్నారని ఎద్దేవా చేశారు. భారీ వరదల సమయంలో రాజకీయం చేయాలనే ఆలోచన జగన్ కు రావడం దురదృష్టకరమని అన్నారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్తు పరిస్థితిలో డ్రోన్లను ఉపయోగిస్తూ సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని చెప్పారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సహాయం అందించామని తెలిపారు. ఇంత చేస్తున్నా జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో తనకు తానే సాటి అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని రామ్మోహన్ నాయుడు కితాబిచ్చారు. వరదలను రాజకీయాలకు వాడుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని... తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.
Posted

Vijayawada Floods: విజయవాడలో నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు 

06-09-2024 Fri 14:05 | Andhra
AP Ministers has began supply of essentials in Vijayawada
 

 

  • వరద బీభత్సం నుంచి తేరుకుంటున్న విజయవాడ నగరం
  • నిత్యావసర సరుకుల పంపిణీ షురూ చేసిన మంత్రులు అచ్చెన్న, నాదెండ్ల, కందుల 
  • ప్రతి ఇంటికీ సరుకులు 100 శాతం పంపిణీ అయ్యేలా ఆదేశాలు
భారీ వరదతో విలవిల్లాడిన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ విజయవాడలో నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలను ప్రారంభించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ షురూ చేశారు. 

ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100 శాతం జరిగేలా మంత్రులు ఆదేశించారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ పంపిణీ చేస్తున్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...