psycopk Posted September 11, 2024 Author Report Posted September 11, 2024 Jagan: జైల్లో ఉన్న నందిగం సురేశ్ ను పరామర్శించిన జగన్... చంద్రబాబుపై ఫైర్ 11-09-2024 Wed 14:15 | Andhra నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఇటీవల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ గుంటూరు జైలు వద్దకు వచ్చిన జగన్ ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా చూడలేదంటూ ఆగ్రహం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి, గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగం సురేశ్ తో 'ములాఖత్' ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేశ్ కు సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు వెలుపల జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే నాలుగేళ్ల నాటి కేసును తిరగదోడారని ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని అన్నారు. నాడు దాడి ఘటనలో నందిగం సురేశ్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజిలో కనిపించాలి కదా... అని వ్యాఖ్యానించారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కూడా దూషించారు... అయినా గానీ చంద్రబాబులా కక్షసాధింపు చర్యలకు దిగలేదు అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, రేపు టీడీపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని, వారు కూడా ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందని ఘాటు హెచ్చరికలు చేశారు. రెడ్ బుక్ అంటున్నారని, అదేమీ ఘనకార్యం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనను నిర్లక్ష్యం చేసి రెడ్ బుక్ పైనే శ్రద్ధ చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ గెలవగానే ఆ బోట్లపై విజయోత్సవాలు చేసుకోలేదా...? వాతావరణ హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. బాబు తన ఇంటిని కాపాడుకునేందుకు విజయవాడను బలి చేశారని, బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడ వరదలకు కారణమయ్యారని ఆరోపించారు. తద్వారా 60 మంది ప్రాణాలు కోల్పోయారని, మరి చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టరు? అని జగన్ ప్రశ్నించారు. ఆఖరికి చంద్రబాబు బోట్లతోనూ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ బోట్లకు ఎవరి హయాంలో అనుమతి వచ్చిందో తెలుసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించగానే, ఇవే బోట్లపై విజయోత్సవాలు చేసుకున్నారని... అన్నింటికీ మించి బాబు, లోకేశ్ తో కలిసి బోట్ల యజమాని ఉషాద్రి ఫొటోలు కూడా దిగాడని జగన్ వెల్లడించారు. టీడీపీ వాళ్లకు చెందిన బోట్లను వైసీపీ నేతలవంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. Quote
psycopk Posted September 11, 2024 Author Report Posted September 11, 2024 Paladugu Durga Prasad: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత దుర్గాప్రసాద్ అరెస్ట్ 11-09-2024 Wed 15:11 | Andhra 2021 సెప్టెంబరు 17న చంద్రబాబు నివాసంపై దాడి గత కొంతకాలంగా దుర్గాప్రసాద్ కోసం గాలిస్తున్న పోలీసులు నేడు గుంటుపల్లిలో అరెస్ట్ గతంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ ను మంగళగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. దుర్గాప్రసాద్ ఈ కేసులో ఏ4గా ఉన్నారు. దుర్గాప్రసాద్ కోసం గత కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులు... ఇవాళ గుంటుపల్లిలోని నివాసంలో ఉన్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనే కాకుండా, టీడీపీ కార్యాలయంపై దాడి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి ఘటనల్లోనూ దుర్గాప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. 2021 సెప్టెంబరు 17న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని వైసీపీ నేత జోగి రమేశ్ తన అనుచరులతో కలిసి ముట్టడించడం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఘటనల్లో ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. Quote
psycopk Posted September 11, 2024 Author Report Posted September 11, 2024 Chandrababu: గత పాలకుల పాపాలు.. మనకు శాపాలు: చంద్రబాబు 11-09-2024 Wed 13:26 | Andhra బుడమేరులో పూడిక తీయలేదు.. గుంతలు పూడ్చలేదని ఆరోపణ అందువల్లే విజయవాడకు కనీవినీ ఎరగని వరదలు వచ్చాయని వివరణ ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లు వైసీపీ వాళ్లవేనని వెల్లడి ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు పట్ల నాటి సర్కారు వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడిక తీయలేదని, గండ్లు పూడ్చలేదని విమర్శించారు. దీంతో భారీ వర్షాలకు విజయవాడను కనీవినీ ఎరగని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించిందని, అక్రమ కట్టడాలకు తప్పుడు దారిలో అనుమతులిచ్చిందని వివరించారు. కుండపోత వర్షాలు, వరదలకు వాతావరణ మార్పులు కారణమని చెప్పారు. అయితే, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. ఆ బోట్లు వాళ్లవే.. ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునే వైపుగా వైసీపీ నాయకులు పోతున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణా నదిలో వదిలిపెట్టిన నాలుగు బోట్లు వైసీపీ వాళ్లవేనని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని వివరించారు. ఆ బోట్లపై వైసీపీ రంగు ఉందన్న విషయం గుర్తుచేశారు. ఒకదానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలి పెట్టడంతో అవి బ్యారేజీ గోడలను ఢీ కొట్టాయని, ఇప్పటికీ వాటిని బయటకు తీయడానికి అధికారులు శ్రమిస్తూనే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ఆ బోట్లను ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించే వారని ఆరోపించారు. వైసీపీ లీడర్ జగన్ ఇప్పుడు మాట్లాడుతూ.. ఆ బోట్లు టీడీపీ వాళ్లవేనని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని కూల్చాలని కుట్ర చేశారని, దీని వెనక రాజకీయ లింకులు లేకుంటే ఒక్క నిమిషంలో నిందితులను ఏం చేయాలో అది చేసే వాడినని వివరించారు. రౌడీలు, గూండాలను తాను ఎన్నడూ సహించలేదని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారిపట్ల తానెప్పుడూ కఠిన వైఖరినే అవలంబించానని చంద్రబాబు గుర్తుచేశారు. Quote
psycopk Posted September 11, 2024 Author Report Posted September 11, 2024 Nuvvu chesina langa panulaki ninu petrol posi kalchali ani undi… adi kuda tappu kadu kadara tuppasi yedava Quote
psycopk Posted September 11, 2024 Author Report Posted September 11, 2024 Anduke jaggadu epudu antu untadu… mana karyakarthalu donga naa kodukulu vallani nammodu ani.. 🤣🤣 1 Quote
psycopk Posted September 11, 2024 Author Report Posted September 11, 2024 Leader ki tagga cader Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.