Jump to content

Kcr inka bratike unnadu ga..


Recommended Posts

Posted

హరీశ్ రావు ఎన్నో మోసాలు చేశారు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

14-09-2024 Sat 17:49 | Telangana
Komatireddy Venkat Reddy lashes out at Harish rao
 

 

  • శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం పేరుతో మోసాలు చేశారని మండిపాటు
  • హరీశ్ రావు చేసిన మోసాలు ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయన్న మంత్రి
  • మదర్ డైరీ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్లు, కొండా సురేఖకు విజ్ఞప్తి
శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం పేరుతో హరీశ్ రావు ఎన్నో మోసాలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం హరీశ్ రావుకు బినామీగా ఉంది అని ఆరోపించారు. 

నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల మదర్ డైరీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గుడిపాటి మధుసూదన్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గెలిచిన డైరెక్టర్లకు ఎన్నికల అధికారితో కలిసి మంత్రి సర్టిఫికెట్లను అందించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... హరీశ్ రావు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరుకు ఆరు స్థానాలు గెలుచుకుందన్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల్లో మదర్ డైరీ పాలు సరఫరా చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మదర్ డైరీ నుంచి అందే నెయ్యితో లడ్డూలు తయారయ్యేలా చూడాలని మరో మంత్రి కొండా సురేఖను కోమటిరెడ్డి కోరారు. వేములవాడ దేవస్థానం లడ్డూల తయారీకి కూడా మదర్ డైరీ నెయ్యిని ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. మదర్ డైరీని ఇలా ఆదుకోవడం ద్వారా ఈ డైరీకి ఉన్న రూ.60 కోట్ల అప్పును త్వరగా తీర్చవచ్చని తెలిపారు. 

పాల ఉత్పత్తిలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మదర్ డైరీ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
Posted

Jagga Reddy: కేసీఆర్, కేటీఆర్ నాలుకలు కూడా కోస్తాం... కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారు: జగ్గారెడ్డి 

14-09-2024 Sat 15:39 | Both States
KCR grand fathers came from Vijayanagaram says Jagga Reddy
 

 

  • రేవంత్ రెడ్డిని తిడితే నాలుకలు కోస్తామన్న జగ్గారెడ్డి
  • ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను డిస్టర్బ్ చేస్తున్నారని మండిపాటు
  • కేసీఆర్ సీఎం అయిన రోజే రాజకీయాల్లో విలువలు నశించాయని విమర్శ
తమ నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిట్టిన వాళ్ల నాలుకలు కోస్తారని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేటీఆరే కాదు ఆయన బాబు కేసీఆర్ నాలుక కూడా కోస్తామని హెచ్చరించారు. రేవంత్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగ్గారెడ్డి ఈమేరకు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను చెడగొట్టాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. 

వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోలీసులు వినాయక నిమజ్జనం బందోబస్తు చూసుకోవాలా? లేక బీఆర్ఎస్ నేతల పంచాయితీ చూసుకోవాలా? అని ప్రశ్నించారు. అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల గొడవ ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. 

హరీశ్ రావు నీకు సిగ్గుందా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత ప్రాంతీయతత్వాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారని చెప్పారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ కు, బీఆర్ఎస్ నేతలకు ఏమీ అర్థం కావడం లేదని... అందుకే రోడ్లపై పడుతున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీలు మారిన నేతలకు కండువాలు కప్పే సాంప్రదాయం ఉమ్మడి ఏపీలో ఉండేది కాదని... కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఈ సాంప్రదాయానికి తెర లేపారని విమర్శించారు.2014-18 మధ్య కాలంలో కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ లో చేరినప్పుడు ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీ మారిన నేతలకు కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ఆద్యుడని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజే రాజకీయాల్లో విలువలు నశించాయని చెప్పారు.
Posted

 

KTR: ఆ అధికారులను సస్పెండ్ చేస్తారో.. తొలగిస్తారో... కానీ దమ్ముంటే రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకోవాలి: కేటీఆర్ 

14-09-2024 Sat 18:41 | Telangana
KTR challenges CM Revanth Reddy
 

 

  • ఆదర్శ్ నగర్‌లో 75 ఇళ్లను కూల్చేశారని మండిపాటు
  • పేద ప్రజల కడుపు కొట్టడానికి ముఖ్యమంత్రి అయ్యావా? అని నిలదీత
  • రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డల కడుపు కొడుతున్నారని ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాను చిత్తు కాగితంలా చూసి... విలువ ఇవ్వని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేస్తారో... తొలగిస్తారో... కానీ దమ్ముంటే ముఖ్యమంత్రి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని ఆద‌ర్శ్ న‌గ‌ర్‌లో కొన్ని రోజుల క్రితం పేద‌లు, దివ్యాంగుల‌కు చెందిన 75 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై మహబూబ్ నగర్‌లో కేటీఆర్ మాట్లాడుతూ... పేద ప్ర‌జ‌ల క‌డుపు కొట్ట‌డానికి సీఎం అయ్యావా? అని ధ్వజమెత్తారు.

ఆ ఇండ్లు పేదవాళ్లవి, దివ్యాంగులవి అనే సోయి లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పదిహేను రోజుల క్రితం ఇళ్లను కూల్చారని విమర్శించారు. దివ్యాంగులనే ఇంగితజ్ఞానం లేకుండా వారి నివాసాల పైకి బుల్డోజర్లను పంపించి కూల్చేశారన్నారు. పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతో సీఎంను అయ్యానని చెబుతున్న రేవంత్ రెడ్డి అదే పాలమూరు బిడ్డల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకుంటే కేసీఆర్ 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేశారని, పేదవాళ్లకు లక్షల పట్టాలు అందించామన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పేదల ఇళ్లను కూల్చేసిందన్నారు. రేవంత్ రెడ్డికి సంస్కారం ఉంటే... పేదల పట్ల ప్రేమ ఉంటే... వెంటనే 75 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. 

 

 

Posted

KTR: చంద్రబాబు, వైఎస్‌తోనే కొట్లాడాం... రేవంత్ రెడ్డి ఓ చిట్టినాయుడు: కేటీఆర్ ఎద్దేవా 

14-09-2024 Sat 13:34 | Telangana
KTR says Revanth Reddy is bachha for brs
 

 

  • చరిత్రలో రేవంత్ రెడ్డిలాంటి సీఎంలను చాలామందిని చూశామన్న కేటీఆర్
  • కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలతో పోలిస్తే రేవంత్ చాలా చిన్నోడని విమర్శ
  • హైదరాబాద్ భాషలో రేవంత్ రెడ్డి ఓ బుల్లెబ్బాయ్ అని చురక
తాము చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి వారితోనే కొట్లాడామని, కానీ వారికింద రేవంత్ రెడ్డి ఓ చిట్టినాయుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్... ఆయనను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

"చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు... నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగ (ఎంతోమంది) వచ్చారు... మస్తుగ పోయారు. పెద్దపెద్దవాళ్లతో కొట్లాడాం. చంద్రబాబుతో కొట్లాడాం... రాజశేఖర రెడ్డితో కొట్లాడాం... కిరణ్ కుమార్ రెడ్డితో, రోశయ్యతోనూ కొట్లాడాం... ఇలా ఎంతోమందితో తలపడ్డాం. వాళ్లందరికంటే కూడా నువ్వు (రేవంత్ రెడ్డి) చాలా చిన్నోడివి. నువ్వు చిట్టినాయుడివి. చాలా చిన్నవాడివి.

మా భాషలో... హైదరాబాద్ భాషలో చెప్పాలంటే నీలాంటి వాడిని బుల్లబ్బాయ్ అంటాం... నీలాంటి బుల్లెబ్బాయిలను... చిట్టినాయుడులను చాలా మందిని చూశాం. ఏం ఫరక్ పడేది లేదు. వెంట్రుక కూడా పీకలేవు కానీ, నాలుగు రోజులు ఏదో పైశాచిక ఆనందం. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను... నేనేదో పెద్దవాడిని అయ్యానని ఎగిరెగిరి పడుతున్నావ్.. కానీ రేవంత్ రెడ్డి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నీ దుష్టసంప్రదాయం నువ్వు పదవిలో నుంచి దిగిపోయాక నిన్ను వెంటాడుతుందని హెచ్చరిస్తున్నాను" అని మండిపడ్డారు.

కౌశిక్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న కేటీఆర్

కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఆలింగనం చేసుకొని... ఆప్యాయంగా పలకరించారు. టైగర్ కౌశిక్ భాయ్ అంటూ సంబోధించారు. అనంతరం బైపాస్ సర్జరీ చేయించుకున్న కౌశిక్ రెడ్డి మామ కృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Posted

KTR: ఒక్క సీటు కూడా గెలవలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగబట్టారు: కేటీఆర్ 

14-09-2024 Sat 12:32 | Telangana
KTR says Revanth Reddy targetting Hyderabad for not giving one seat
 

 

  • రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన సీఎం అంటూ కేటీఆర్ ఆగ్రహం
  • హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం గట్టారన్న కేటీఆర్
  • హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపాటు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలపై పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండాపూర్‌లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్, తెలంగాణ పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం గట్టారన్నారు.

అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో కొత్త పంచాయతీని తీసుకువచ్చారని విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు... కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆయన పగబట్టి కొత్త పంచాయతీలు తీసుకువచ్చారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా మావాళ్లేనని మరోసారి చెబుతున్నామని, ఇదే విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రాంతీయతత్వం లేదా ప్రాంతీయ భేదం లేవన్నారు.

కౌశిక్ రెడ్డి అసలు ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరామన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచాలని కోరుతున్నామన్నారు. పార్టీ మారిన వారికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. తాను పార్టీ మారానని అరికెపూడి గాంధీ ఇదివరకు బహిరంగంగా ప్రకటించారని, అలాంటి ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తే దాడి చేయడమేమిటన్నారు.

కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? హైదరాబాద్‌లో శాంతిభద్రతలను అదుపు చేయలేకపోతున్నారని విమర్శించారు. గూండాలకు పోలీస్ రక్షణను ఇచ్చి మరీ కౌశిక్ రెడ్డి మీదకు దాడికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్లు చేసినా... ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
Posted

Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు 

14-09-2024 Sat 10:07 | Telangana
Attempt to murder case filed on Arekapudi Gandhi
 

 

  • గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డి
  • హత్యాయత్నం కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
  • గాంధీ కుమారుడు, సోదరుడిపై కూడా కేసు నమోదు
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపై కూడా కేసు నమోదయింది. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్ లపై కూడా కేసు నమోదు చేశారు.

గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. వివాదం మధ్యలోకి ప్రాంతీయత రావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలను రాజేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని గాంధీ ఆరోపించారు. సెటిలర్లను బీఆర్ఎస్ కు దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
Posted

Cbn bhajana cheyaka pote ee kodukulaki print media lo news kuda veyaru… adi eedi bratuku

Padi Kaushik Reddy: చంద్రబాబు ట్రాప్‌లో రేవంత్ రెడ్డి పడ్డారు: పాడి కౌశిక్ రెడ్డి 

13-09-2024 Fri 19:03 | Telangana
Padi Koushik Reddy fires at Revanth Redy
 

 

  • కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్ర చేస్తున్నారని విమర్శ
  • ఆంధ్రావాళ్లను తిట్టినట్లు ప్రచారం చేయడం దారుణమని మండిపాటు
  • అమరావతికి పెట్టుబడులు డైవర్ట్ చేసే కుట్రలో రేవంత్ రెడ్డి భాగమయ్యాడని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. శంభీపూర్ రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను ఆంధ్రా సెటిలర్స్‌ను దూషించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అరికెపూడి గాంధీనే తన పట్ల ఇష్టారీతిగా మాట్లాడారని, పైగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. తానేదో ఆంధ్రా వాళ్లను తిట్టినట్లుగా ప్రచారం చేయడం దారుణమన్నారు. చిల్లర రాజకీయం కోసం ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారన్నారు.

ఇప్పటికే హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో భవనాలు కూలగొట్టి నగరం ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ కుట్రలను హైదరాబాద్ ప్రజలు గమనించాలని కోరారు. 

కేసీఆర్ పదేళ్లలో హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ నష్టం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ట్రాప్‌లో పడిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి అమరావతికి పెట్టుబడులను డైవర్ట్ చేసే కుట్రలో భాగం అయ్యాడని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన స్థాయిని గుర్తించాడని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఈరోజు నుంచి రేవంత్ రెడ్డికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అవసరం లేదని, తాను చాలునని వ్యాఖ్యానించారు. ఇక నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నానని... కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేనన్నారు.
Posted

Kaleswaram to naaku sambadam ledu , anthaa KCRe choosukundu annadu Harish.

95,000 kotlu (Congress cheptunnattu 1 lakh crores kaadu ani Harish clarify chesindu) karsu pedite, samvatsaram nunchi okka chukka neeru koodaa ettatledu.

Posted
7 minutes ago, argadorn said:

Kaleswaram undha kottukonipoyindha … 100 posts vesav kaleswaram medha emaindhi 

monna vijaywada la vachina varadhalu ave.... dhaniki thodu psycho uncle edupu kooda add ayyi inka ekkuva vachinay neellu.

Posted
2 minutes ago, adavilo_baatasaari said:

Kaleswaram to naaku sambadam ledu , anthaa KCRe choosukundu annadu Harish.

95,000 kotlu (Congress cheptunnattu 1 lakh crores kaadu ani Harish clarify chesindu) karsu pedite, samvatsaram nunchi okka chukka neeru koodaa ettatledu.

fake news again. brother, you can have an opinion and political affiliation but don't get misguided by fake news peddlers. get your news from credible sources.

Posted

Not even a drop of water will be lifted for the next two years as per estimates.

Check any reputable national media. 

If I am wrong , I have no problem standing corrected.

https://www.hindustantimes.com/india-news/restoration-of-kaleshwaram-project-unlikely-in-near-future-101708456909459.html

 

https://theprint.in/india/governance/a-white-elephant-no-water-from-kaleshwaram-but-project-costs-telangana-around-rs-18000-cr-annually/1951074/

 

Posted
21 minutes ago, adavilo_baatasaari said:

Not even a drop of water will be lifted for the next two years as per estimates.

Check any reputable national media. 

If I am wrong , I have no problem standing corrected.

https://www.hindustantimes.com/india-news/restoration-of-kaleshwaram-project-unlikely-in-near-future-101708456909459.html

 

https://theprint.in/india/governance/a-white-elephant-no-water-from-kaleshwaram-but-project-costs-telangana-around-rs-18000-cr-annually/1951074/

 

NDSA asked the govt to repair the block where the pillars sank.

Those articles you shared (from feb) are comments from Uttam and govt officials after the assembly elections and just before general elections, which are politically motivated.

recent ga water kooda release chesinru from the existing project on different dates/sources  and the rest of the project was intact even after recent heavy rain/floods. it is not going anywhere and will be a lifeline for TG for generations. 

 

https://www.newindianexpress.com/states/telangana/2024/Apr/02/kaleshwaram-water-released-to-save-standing-crops

https://telanganatoday.com/telangana-kaleshwaram-water-to-reach-anantha-sagar-reservoir-soon

https://timesofindia.indiatimes.com/city/hyderabad/government-utilizes-kaleshwaram-infrastructure-for-water-extraction/articleshow/112071954.cms

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...